Viral Video: మేడ్ ఇన్ ఇండియా వ్యవసాయం అంటే ఇదే.. రైతు తెలివికి సలాం!

పురాతన కాలం నుంచే భారతీయ సంస్కృతికి, వ్యవసాయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. సింధు నాగరికత కాలంలో వ్యవసాయం గురించి మనం చదువుకునే ఉంటాము. అప్పటి వినూత్న వ్యవసాయ పద్దతులతో ప్రజలు.. పంటలను సమృద్ధిగా పండించారు. కాగా, ఓ రైతు తాజాగా వినూత్న తరహాలో వ్యవసాయం చేస్తున్నాడు.
కాగా, సృజనాత్మకత విషయానికి వస్తే భారతీయులు ప్రతీ ఒక్కరినీ ఓడించగలరని మరోసారి రుజువైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ రైతు ట్రేడ్‌మిల్ వంటి యంత్రంపై ఎద్దును నడిపిస్తూ సాగుకు కావాల్సిన నీటిని, మోటర్ల సాయంతో కరెంట్‌ను ఉత్పత్తి చేస్తున్నాడు. కాగా, ఎద్దు ట్రేడ్‌మిల్ వంటి యంత్రంపై నడుస్తుండగా పైపుల ద్వారా నీరు పంట పొలాలకు చేరుతోంది. అలాగే, మోటర్ల సాయంతో కరెంట్‌ను సైతం ఉత్పత్తి చేసి పంటల సాగుకు వాడుకుంటున్నారు.
ఇక, దీనికి సంబంధించిన వీడియోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. సదరు వీడియోకు ‘రూరల్ ఇండియా ఇన్నోవేషన్. ఇట్స్ అమేజింగ్’ అని క్యాప్షన్ ఇచ్చారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు సదరు క్రియేటివ్ రైతులను ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. స్వదేశీ ఆవిష్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతాయని అన్నాడు. మరో యూజర్ మాత్రం.. జంతువులను శారీరకంగా హింసిస్తున్నాడంటూ కామెంట్స్ చేశాడు.
RURAL INDIA Innovation. It’s Amazing!! pic.twitter.com/rJAaGNpQh5
— Awanish Sharan (@AwanishSharan) September 23, 2022