Viral Video: పనికిరాని ప్లాస్టిక్‌ బాటిళ్లతో నివాసయోగ్యమైన ఇల్లు!

Viral Video: Houses Made Of Plastic Bottles  - Sakshi

Video of this house made of plastic bottles: ఇంతవరకు మనం అత్యాధునిక హంగులతో నిర్మించిన రకరకాల ఇళ్ల గురించి విన్నాం. అంతేకాదు తక్కువ బడ్జెట్‌తో నిర్మించే ఇళ్ల గురించి కూడా విన్నాం. పైగా విచిత్రమైన రీతిలో నిర్మించిన ఇళ్లను సైతం చూశాం. కానీ ఒక బాలుడు పనికిరాని ప్లాస్టిక్‌ బాటిళ్లతో అది కూడా నివాసం యోగ్యంగా ఉండేలా ఇల్లు రూపొందించాడు. ఆశ్యర్యంగా ఉంది కదూ! నిజమేనా? అనే సందేహంతో ఉండిపోకండి.

అసలు విషయంలోకెళ్తే...ఇళ్లను నిర్మించేవాళ్ల సాయం కూడా తీసుకోకుండా ఒక బాలుడు ప్లాస్టిక్‌ బాటిళ్లతో ఇల్లుని నిర్మించాడు. పైగా భారత్‌లోని ఒక బాలుడు ఈ ఇల్లుని నిర్మించడం విశేషం. అంతేకాదు ఇటుక గానీ సిమెంట్‌ గానీ వినియోగించకుండా కేవలం ప్లాస్టిక్‌ బాటిళ్లతో రూపొందించాడు. పైగా ఈ ఇంట్లో, తలుపులు, కిటికీలు, లైట్‌లు కూడా ఏర్పాటు చేశాడు. ఈ మేరకు ఆ ఇల్లుని చూసిన స్థానికులు కూడా ఆశ్చర్యపోతున్నారు. పైగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి.

(చదవండి: ఈ పార్క్‌లో మెరిసేదంతా బంగారమే!... ఔను! రూ. 87 లక్షల గోల్డ్‌ క్యూబ్‌!!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top