ఆధ్యాత్మిక దివ్యధామం అయోధ్య

Vice President M Venkaiah Naidu visits Ayodhya - Sakshi

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్యలో శ్రీరామ మందిరాన్ని పునర్నిర్మాణం భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవా నికి, శ్రీరాముని జీవితం బోధించిన మానవీయ విలువల పట్ల మన నిబద్ధతకు ప్రతీక అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అయో ధ్య పర్యటన భారతీయ ఆధ్యాత్మిక మూలాలను, సాంస్కృతిక వారసత్వాన్ని ఏకకాలంలో దర్శింపజేస్తుందని అభిప్రాయ పడ్డారు. శుక్రవారం ఉదయం లక్నో నుంచి ప్రత్యేక రైలులో అయోధ్య చేరుకున్న ఉపరాష్ట్రపతి దంపతులు రామమందిర నిర్మాణ స్థలాన్ని, రామ్‌లల్లా మందిరాన్ని సందర్శించుకున్నారు. అనంతరం హనుమాన్‌ గఢి లో, తర్వాత సరయు నదీతీరంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారణాసి చేరుకుని, దశాశ్వమేథ ఘాట్‌లో గంగా హారతిలో పాల్గొన్నారు. శనివారం విశ్వనాథుని దర్శించుకోనున్నారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top