వరవరరావుకు బెయిల్‌ ఇవ్వండి

Varavara Rao wife Pendyala Hemalatha moves Supreme Court - Sakshi

న్యూఢిల్లీ: భీమా కోరెగావ్‌ కేసులో అరెస్టయి, ముంబై జైల్లో ఉన్న ప్రముఖ విప్లవ కవి, 81 ఏళ్ళ వరవరరావుకు బెయిల్‌ ఇవ్వాలంటూ ఆయన భార్య  పెండ్యాల హేమలత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆయనను నిరవధికంగా కస్టడీలో ఉంచటం అమాన వీయం, క్రూరత్వమని, రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్‌ ప్రకారం వ్యక్తి స్వేచ్ఛను అతిక్రమించడమేనని బెయిల్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. 2018 నవంబర్‌లో జ్యుడీషియల్‌ కస్టడీకి వెళ్ళేనాటికి 68 కేజీల బరువున్న వరవరరావు ఇప్పుడు 50 కేజీల బరువున్నారని, ఆయన 18 కేజీల బరువు తగ్గారని, వివిధ ఆరోగ్య సమస్యలతో సతమతమౌతూ, మంచంలో నుంచి కదల్లేని స్థితిలో ఉన్నారని వెల్లడించారు.  వయో సంబంధిత అనారోగ్య సమస్యలతో పాటు, కోవిడ్‌ ప్రబలిన తరువాత తలెత్తిన ఇబ్బందుల కారణంగా వరవరరావుకి నిరంతర పర్యవేక్షణ అవసరమౌతోందని హేమలత తరఫున పిటిషన్‌ దాఖలు చేసిన న్యాయవాది సునీల్‌ ఫెర్నాండెజ్‌ తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top