ఏనుగుకి రూ. 5 కోట్ల ఆస్తి.. అదే ఆయన ఉసురు తీసింది

Uttarakhand Elephant Heir To Rs 5 Crore Property - Sakshi

ఏనుగుకి మనిషికి మధ్యన ఏర్పడిన బాంధవ్యం గురించి చక్కగా వివరించే  ది ఎలిఫెంట్‌ విస్పరస్‌ డాక్యుమెంటరీ ఇటీవల ఆస్కార్‌ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే . అచ్చం అలాంటి కథే ఉత్తరాఖండ్‌కి చెందిన రెండు ఏనుగులకు ఓ మనిషికి మధ్య జరిగింది. ఆ ప్రేమ ఎంత వరకు వెళ్లిందంటే తాను లేకపోతే ఏనుగులు ఎలా అని తన కుటుంబ సభ్యులు మాదిరిగా ఆస్తి రాసిచ్చేంత వరకు దారితీసింది. కానీ ఆ హద్దులు లేని ప్రేమే అతని హత్యకు కారణమైంది కూడా. 

అసలేం జరిగిందంటే..బిహార్‌లోని జన్‌పూర్‌కి చెందిన అక్తర్‌ ఇమామ్‌ తాను పెంచుకుకంటున్న రాణి, మోతీ అనే ఏనుగులకు తన కుటుంబ సభ్యలు మాదిరిగానే వాటికి కూడా ఆస్థిలో వాటా ఇచ్చాడు. ఎందుకంటే తాను చనిపోతే వాటి ఆలనాపాలనా ఎవరు చూసుకుంటారనే ఉద్దేశ్యంతో ఇలా చేశాడు. తన ఆస్తిలో సగం తన భార్య, పిల్లలకు పంచి మిగతా రూ. 5 కోట్ల ఆస్తిని తన ఏనుగుల పేర రాశాడు. ఏనుగుల యజమానులు చనిపోతే వాటి సంరక్షణ ఎవరూ పట్టించుకోని పలు ఘటనలు చూశానని అందుకే ఇలా చేశానని చెప్పుకొచ్చాడు. ఇలా ఏనుగుల కోసం తన ఆస్తిని కేటాయించిన తొలి వ్యక్తి ఇమామ్‌ అని వన్య ప్రాణుల సంరక్షణాధికారి ఇమ్రాన్‌ ఖాన్‌ అన్నారు. ఇమామ్‌ ఆధ్వర్యంలోని ఏషియన్‌ ఎలిఫెంట్‌ రిహాబిలేషన్‌ అండ్‌ వైల్డ్‌ లైఫ్‌ యానిమల్‌ ట్రస్ట్‌ని ప్రస్తుతం ఇమ్రాన్‌ ఖాన్‌ సంరక్షిస్తున్నారు. ఇమామ్‌ ఈ ట్రస్ట్‌ని తన ఏనుగుల కోసమే ఏర్పాటు చేసినట్లు ఖాన్‌ తెలిపారు. 

అప్పట్లో ఈ విషయం హాట్‌ టాపిక్‌గా మారి పలు ఛానెల్స్‌లో అక్తర్‌ ఇమామ్‌ పేరు మారు మ్రోగినట్లు కూడా చెబుతున్నారు. ప్రస్తుతం ఇమామ్‌ లేడు. ఆయన ఇలా ఏనుగులకు ఆస్తి ఇవ్వడం అతని కుటుంబానికి నచ్చలేదు. ఈ విషయమై ఇమామ్‌కి తన కుటుంబ సభ్యుల మధ్య పలు మార్లు గొడవలు జరిగాయి కూడా. అదీగాక తన కుటుంబం నుంచి ప్రమాదం పొంచి ఉందని 2020లో కోవిడ్‌ సమయంలో మొదటి లాక్‌డౌన్‌ని ఎత్తివేయగానే బిహార్‌న నుంచి హుటాహుటినా తన రెండు ఏనుగులను తీసుకుని ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్‌కు వచ్చేశాడు. అక్కడే ఏనుగులకు సంరక్షణకు సంబంధించిన ట్రస్ట్‌ని ఏర్పాటు చేసి ఈ ఏనుగులను ప్రేమగా చూసుకుంటుండేవాడు. ఐతే ఇమామ్‌ ఊహించినట్లుగానే జరిగేంది. 

2021లో ఇమామ్‌ తన కుటుంబం చేతిలోనే అనూహ్యంగా హత్యకు గురయ్యాడు. దీంతో ఆ ట్రస్ట్‌ని, ఇమామ్‌ పెంచుకుంటున్న ఏనుగులను వన్యప్రాణుల సంరక్షణాధికారి ఇమ్రాన్‌ ఖాన్‌ చూసుకుంటున్నారు. అయితే ఇటీవలే ఇమామ్‌ పెంచుకున్న ఏనుగుల్లో మోతీ అనే ఏనుగు చనిపోయింది. దీంతో రాణి అనే ఏనుగు ఒ‍క్కత్తే ఆ రూ. 5 కోట్ల ఆస్తికి వారసురాలు. కానీ ఆస్తి మాత్రం బిహార్‌లోని పాట్నాలో ఉంది. నిధుల కొరతతో సతమతమవుతున్న అక్తర్‌ ఫౌండేషన్‌కి ఆ ఆస్తి చెందితేనే ఇమామ్‌ కోరిక కూడా నెరవేరుతుందని సంరక్షణాధికారి ఇమ్రాన్‌ ఖాన్‌ చెబుతున్నారు. 

(చదవండి: భార్యకు అస్వస్థత, కొడుకు విదేశాల్లో ఉన్నాడు!ఐనా సిసోడియాకు నో బెయిల్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top