Union Budget 2023-24: కర్ణాటకకు కేంద్రం పెద్ద పీట.. బడ్జెట్‌లో వేల కోట్ల కేటాయింపులు

Union Budget 2023: FM announces Grants For Poll Bound Karnataka - Sakshi

సాక్షి, ఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో దక్షిణాది రాష్ట్రం కర్ణాటకకు పెద్ద పీట వేసింది కేంద్రం. బడ్జెట్‌-2023లో వరాలు జల్లు కురిపించింది. కర్ణాటకలోని కరువు ప్రభావిత ప్రాంతాలకు రూ.5,300 కోట్ల కేటాయింపులు  ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో ప్రకటించారు. 

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా.. ఇవాళ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో ప్రసంగించారు.  భద్ర ఎగువ తీర ప్రాజెక్టుకు రూ.5,300 కోట్ల గ్రాంట్లు ఇస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇది ప్రాజెక్టును మరింత బలోపేతం చేస్తుందని, చిత్రదుర్గతో సహా మధ్య కర్ణాటకలోని అనేక వర్షాధార వ్యవసాయ జిల్లాలకు వరం అవుతుందని, పైగా.. ప్రాజెక్టును త్వరగా, సమర్ధవంతంగా పూర్తి చేసేందుకు వీలవుతుందని ఆమె పేర్కొన్నారు.

ఈ ఏడాది కర్ణాటక సహా తొమ్మిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాలకు ఇప్పటికే ఎన్నికలు ప్రకటించారు.  దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకలో మరోసారి అధికారం దక్కించుకోవాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే.. రాష్ట్రంలో పలు కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు నిర్వహిస్తోంది.  దీనికి కొనసాగింపుగా కేంద్ర బడ్జెట్‌లో భారీగా నిధులు వస్తాయని అంచనా వేయగా.. అందుకు తగ్గట్టుగానే వరాలు కురుస్తున్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top