టాప్‌ న్యూస్‌.. నేటి విశేషాలు | Today Top News 4th January 2021 | Sakshi
Sakshi News home page

టాప్‌ న్యూస్‌.. నేటి విశేషాలు

Jan 4 2021 5:52 PM | Updated on Jan 4 2021 8:12 PM

Today Top News 4th January 2021 - Sakshi

శివసేన-ఎన్సీపీ మధ్య ముదురుతున్న వివాదం
ఔరంగాబాద్‌ పేరును సంభాజీనగర్‌గా మార్చాలన్న అంశం దుమారం రేకెత్తిస్తుండగా మరోవైపు అహ్మద్‌నగర్‌ పేరును కూడా మార్చాలనే డిమాండ్‌ తెరపైకి వచ్చింది. అహ్మద్‌నగర్‌ పేరును మార్చాలని షిర్డీ లోక్‌సభ ఎంపీ, శివసేన నాయకుడు సదాశివ్‌ లోఖండ్‌ డిమాండ్‌ చేశారు. పూర్తి వివరాలు..

వ్యాక్సిన్‌ ఫస్ట్‌ మోదీనే తీసుకోవాలి: కాంగ్రెస్‌
కరోనా వైరస్‌ పని పట్టే వ్యాక్సిన్‌ అభివృద్ధిలో ప్రపంచ దేశాలు తలమునకలయ్యి ఉన్నాయి. ఇప్పటికే స్పూత్నిక్‌ వి, ఫైజర్‌ బయోటెక్‌ వ్యాక్సిన్‌ల అత్యవసర వినియోగానికి అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. మన దగ్గర కూడా డీసీజీఐ భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి ఆదివారం అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు డీసీజీఐ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పూర్తి వివరాలు..

‘చంద్రబాబు ఇప్పటికే రాజకీయ సమాధి అయ్యారు’
అనుభవం ఉందని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని దోచుకున్నారని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. కొత్త టెక్నాలజీ అని చెప్పి టిడ్‌కో గృహాల ద్వారా అడుగుకి ధర పెట్టీ పేద ప్రజల డబ్బులను స్వాహా చేశారన్నారు. పూర్తి వివరాలు..

కమలం.. గాలం..
దుబ్బాక ఉప ఎన్నికలు, గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో సత్తా చాటిన భారతీయ జనతా పార్టీ దూకుడును పెంచింది. జిల్లాల వారీగా సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇతర పార్టీల్లోని ముఖ్య నేతలకు గాలం వేసేందుకు సమాయత్తమైంది. పూర్తి వివరాలు..

వీళ్లు అసలు మనుషులేనా: సీఎం జగన్‌
గత కొన్ని రోజులుగా పోలీసులకు చెడ్డపేరు తెచ్చేవిధంగా కొంతమంది ఉద్దేశపూర్వకంగానే దుశ​‍్చర్యలకు పాల్పడుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్షాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు..

ఫిబ్రవరి 1 నుంచి ఇంటింటికి రేషన్‌: సీఎం జగన్‌
ధాన్యం సేకరణ, రేషన్ డోర్ డెలివరీపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు.ధాన్యం సేకరించిన తర్వాత గతంలో చెప్పినట్లుగా 15 రోజుల్లోగా పేమెంట్లు జరిగేలా చూడాలని అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. ఇప్పటివరకు సేకరించిన ధాన్యానికి సంబంధించి ఈ సంక్రాంతి కల్లా రైతుల బకాయిలు పూర్తిగా చెల్లించాలన్నారు. పూర్తి వివరాలు..

కస్టడీ నుంచి తప్పించుకున్న టాలీవుడ్‌ నటి
ముంబైలో డ్రగ్స్‌ పెడ్లర్లతో పట్టుబడ్డ టాలీవుడ్‌ నటి శ్వేతా కుమారి నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) కస్టడీ నుంచి తప్పించుకుంది. దీంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆమెను పట్టుకునేందుకు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు..

వికీలీక్స్‌ ఫౌండర్‌కు భారీ ఊరట
గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న వికిలీస్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజె కేసులో అమెరికాకుఎదురు దెబ్బ తగిలింది. అమెరికాకు అప్పగించే విషయమై బ్రిటన్‌ కోర్టు ప్రతికూలంగా  స్పందించింది. అసాంజేను అమెరికాకు  అప్పగించలేమని  సోమవారం తేల్చి చెప్పింది. పూర్తి వివరాలు..

బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి పోస్టాఫీస్‌ బ్యాంక్‌
సుమారు 150 ఏళ్ల చరిత్ర కలిగిన పోస్టల్‌ శాఖ 2020లో అత్యంత కీలకంగా వ్యవహరించింది. కోవిడ్‌-19 తలెత్తడంతో దేశవ్యాప్తంగా లాక్‌డవున్‌లు అమలయ్యాయి. ఈ సమయంలో వైమానిక, రైల్వే, రోడ్డు రవాణా దాదాపుగా నిలిచిపోయినప్పటికీ పోస్టల్‌ శాఖ పలు సర్వీసులు అందించింది. పూర్తి వివరాలు..

మహేష్‌కు వదినగా రేణు దేశాయ్‌!
పరశురామ్ ​దర్శకత్వంలో సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు నటిస్తున్న తాజాచిత్రం 'సర్కారు వారి పాట'. ఈ సినిమాతో హీరోయిన్‌ కీర్తి సురేష్‌ తొలిసారిగా మహేష్‌తో జోడీ కట్టనున్నారు. ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ షూటింగ్‌ జనవరి చివర్లో ప్రారంభం కానుంది. అయితే ఇప్పటికే మహేష్‌ అభిమానులు ట్విటర్‌లో సర్కారు వారి పాట అనే హ‍్యష్‌ ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు. పూర్తి వివరాలు..

అతడి బౌలింగ్‌లో డివిల్లియర్స్‌ ఏడ్చేశాడు: అక్తర్‌
పాకిస్తాన్‌ మాజీ సీమర్‌ మహ్మద్‌ ఆసిఫ్ బౌలింగ్‌ను ఎదుర్కోలేక సౌతాఫ్రికా మాజీ కెప్టెన్‌ ఏబీ డివిల్లియర్స్‌ ఏడుపు లంకించుకున్నాడంటూ రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అదే విధంగా ఏషియన్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ సమయంలో టీమిండియా టెస్టు స్పెషలిస్టు వీవీఎస్‌ లక్ష్మణ్‌ సైతం ఆసిఫ్‌ బౌలింగ్‌లో ఇబ్బంది పడ్డాడని చెప్పుకొచ్చాడు.  పూర్తి వివరాలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement