టాప్‌ న్యూస్‌.. నేటి విశేషాలు | Today Top News 15th December 2020 | Sakshi
Sakshi News home page

టాప్‌ న్యూస్‌.. నేటి విశేషాలు

Dec 15 2020 6:25 PM | Updated on Dec 15 2020 6:43 PM

Today Top News 15th December 2020 - Sakshi

యూపీ ఎన్నికలు; కేజ్రీవాల్‌ కీలక నిర్ణయం
ఢిల్లీలో సత్తా చాటుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో పాగా వేసేందుకు సిద్ధమవుతోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ క్రమంలో 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగనుంది. పూర్తి వివరాలు..


‘జూమ్‌లో చంద్రబాబు.. ట్విట్టర్‌లో లోకేష్‌’
అన్నివర్గాల వారికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌దేనని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. రైతులు,పేదలు, మహిళలు, సామాజిక తరగతుల సంక్షేమమే లక్ష్యంగా  సుపరిపాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్‌ తీరుపై ఆయన మండిపడ్డారు. పూర్తి వివరాలు..

మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు
మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనాలకు మంచిచేస్తే మరిచిపోయే అలవాటుందని, ఏడాదిపాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను రద్దు చేయాలని కేసీఆర్‌ను కోరాలని ఉందన్నారు. పూర్తి వివరాలు..

వైఎస్సార్‌ పంటల బీమాను ప్రారంభించిన సీఎం జగన్‌
ప్రభుత్వం అన్నదాతను ఆదుకునేందుకు అధిక ప్రాధాన్యమిస్తోంది. వైఎస్సార్‌ పంట బీమాతో రైతాంగానికి భరోసా కల్పిస్తోంది. వాతావరణ పరిస్థితులతో సక్రమంగా దిగుబడి పొందలేని రైతులకు పరిహారం చెల్లించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీమా సొమ్మును ఆయా కర్షకుల ఖాతాల్లో జమచేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పూర్తి వివరాలు..

ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు సాధ్యం కాదు..
స్థానిక ఎన్నికలపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ప్రజలకు కరోనా వ్యాక్సిన్‌ వేయాల్సి ఉన్నందున స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని అడిషనల్‌ అఫిడవిట్‌లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకోగా, ఆ సమయంలో కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయనున్నామని.. పోలీసులు, సిబ్బందిని కేటాయించలేమని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. పూర్తి వివరాలు..

ఢిల్లీకి చేరుకున్న సీఎం జగన్‌
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన ఆయన సాయంత్రం 5 గంటల ప్రాంతంలో దేశ రాజధానిలో అడుగుపెట్టారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఈరోజు రాత్రి 9 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ కానున్నారు. పూర్తి వివరాలు.. 

హైదరాబాద్‌లో కరోనా వాక్సిన్‌ పంపిణీకి ఏర్పాట్లు
 కోవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీకి వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. జనవరి రెండో వారంలోగా వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం ఉందని, ఆ మేరకు వాక్సిన్‌ స్టోరేజీ, పంపిణీ ప్రక్రియ ముందే సిద్ధం చేసి ఉంచాలని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. కోవిడ్‌ ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా పని చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బందికి తొలి విడతగా వ్యాక్సిన్‌ వేయాలని నిర్ణయించింది. పూర్తి వివరాలు..

కరోనా ఎఫెక్ట్‌ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రద్దు
కరోనా  మహమ్మారి కారణంగా ఈ ఏడాది పార్లమెంట్  శీతాకాల సమావేశాలను రద్దుచేయాలని  కేంద్రం నిర్ణయించింది.  గతంలో పార్లమెంటు సమావేశాల సందర్భంగా కరోనా ప్రకంపనలు రేపిన నేపథ్యంతోపాటు, దేశంలో ఇంకా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న ఆందోళనల మధ్య ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు..

ఎలక్టోరల్‌ విజయం.. బైడెన్‌ భావోద్వేగం!
‘‘చాలా ఏళ్ల క్రితమే ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనే జ్యోతి వెలిగింది. మహమ్మారి గానీ, అధికార దుర్వినియోగం గానీ ఆ వెలుగును ఏమాత్రం మసకబార్చలేవు. ఐకమత్యానికి అద్దం పట్టేలా చరిత్రలో మరో పుటను తిరగవేసే సమయం ఆసన్నమైంది. ఈ యుద్ధంలో అమెరికా ఆత్మ, ప్రజాస్వామ్యం గెలుపొందాయి. తమ ఉనికిని చాటుకున్నాయి ’’ అని అమెరికా కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌ ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. పూర్తి వివరాలు..

డిజిటలైజేషన్‌తో స్పీడ్‌: జుకర్‌బర్గ్‌, ముకేశ్‌
ఫ్యూయల్ ఫర్‌ ఇండియా2020పేరుతో సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ నిర్వహిస్తున్న తొలి ఎడిషన్‌ నేడు ప్రారంభమైంది. వర్చువల్‌ పద్ధతిలో ప్రారంభమైన సదస్సులో భాగంగా ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ప్రసంగించారు. దేశీయంగా డిజిటల్‌ విభాగంలో గల అవకాశాలు, ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో డిజిటల్‌ ప్రభావం తదితర పలు అంశాలను ప్రస్తావించారు. పూర్తి వివరాలు..

మాకు బ్రేకప్‌.. ఏడుపుగొట్టు కథ: కంగన
‘అతడి ఏడుపుగొట్టు కథ మళ్లీ మొదలైంది. మాకు బ్రేకప్‌ అయ్యి, అతను విడాకులు తీసుకుని చాలా ఏళ్లు అవుతోంది. అయినా ముందుకు సాగేందుకు తను ఇంకా ఇష్టపడటం లేదు. వేరే మహిళతో డేటింగ్‌ చేయడానికి ఇష్టపడటం లేదు. వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదొడుకులు అధిగమించి నేను ధైర్యంగా ముందుకు వెళ్తుంటే అతడు మళ్లీ డ్రామా మొదలుపెట్టాడు. ఈ చిన్నపాటి అఫైర్‌ గురించి ఇంకెంత దూరం వెళ్తావు హృతిక్‌’అంటూ బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ తన మాజీ ప్రియుడు హృతిక్‌ రోషన్‌పై మండిపడ్డారు. పూర్తి వివరాలు..

ఆసీస్‌కు మరో దెబ్బ.. స్మిత్‌‌ అనుమానమే!
టీమిండియాతో టెస్టు సిరీస్‌ ఆరంభానికి ముందే ఆసీస్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఇప్పటికే స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ గాయంతో దూరం కాగా.. ఆసీస్‌ కీలక బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ తొలి టెస్టు ఆడేది అనుమానంగా కనిపిస్తుంది. మంగళవారం ఉదయం ప్రాక్టీస్‌ సమయంలో ఫీల్డింగ్‌ చేస్తున్న స్మిత్‌కు గాయమైనట్లు సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. పూర్తి వివరాలు..

'నీ చెల్లిని కాపురానికి పంపిస్తే ఇంట్లోకి రానిస్తా'
భార్య బతికి ఉండగానే ఆమె చెల్లిపై కన్నేశాడు ఒక ప్రబుద్దుడు. అంతటితో ఆగకుండా ఆమె చెల్లిని బలవంతంగా పెళ్లి చేసుకొని భార్య సహా తన నలుగురు పిల్లలను ఇంట్లో నుంచి గెంటేశాడు. చెల్లిని కాపురానికి పంపిస్తేనే ఇంట్లోకి అనుమతిస్తానని చెప్పాడు. భర్త మాటలు నమ్మి చెల్లిని తీసుకువచ్చిన భార్యకు మరో షాక్‌ తగిలింది. పూర్తి వివరాలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement