TMC To Maintain Equidistant From BJP And Congress - Sakshi
Sakshi News home page

వ్యూహం మార్చుకున్న టీఎంసీ.. బీజేపీ, కాంగ్రెస్‌లకు దూరమైనట్లేనా?

Mar 7 2023 4:28 AM | Updated on Mar 7 2023 10:55 AM

TMC to maintain equidistance from BJP and Congress - Sakshi

కోల్‌కతా: ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయిన తృణమూల్‌ కాంగ్రెస్‌ రాజకీయ వ్యూహాన్ని మార్చుకుంది. ఇకపై బీజేపీ, కాంగ్రెస్‌లకు సమదూరం పాటించనుంది. అవంటే గిట్టని ప్రాంతీయ పార్టీలతో మరో ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ‘బీఆర్‌ఎస్, ఆప్‌ తదితర పార్టీలతో చర్చలు ప్రారంభించాం.

మా వ్యూహమేంటో వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో తెలుస్తుంది’ అని టీఎంసీ నేత సుదీప్‌ బందోపాధ్యాయ్‌ తెలిపారు. ఓట్లను చీల్చడం ద్వారా బీజేపీకి టీఎంసీ సాయం చేస్తోందంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, సీపీఎం నేతలు విమర్శలు గుప్పించడంతో, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామంటూ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఇటీవల ప్రకటించడం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement