తమిళనాడులో ఉగ్రవాదులు.. హై అలర్ట్‌

Terror threat Tamil Nadu coast on high alerton high alert - Sakshi

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హెచ్చరిక

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోకి ఉగ్రవాదులు ప్రవేశించారని, జాగ్రత్తగా ఉండాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ హెచ్చరించింది. సుమారు 15 మంది సముద్ర మార్గం ద్వారా తమిళనాడులోకి ప్రవేశించారని, తీరం నుంచి కేరళకు వెళ్లి అక్కడి నుంచి పాకిస్తాన్‌ చేరుకునేందుకు పథకం వేశారని వెల్లడించింది. దీంతో రాష్ట్రంలోని కోస్ట్‌గార్డ్‌ దళాలు, ఎన్‌ఐఏ అధికారులు నిఘా పెట్టారు. ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తే సమాచారం ఇవ్వాలని స్థానికులను పోలీసులు ఆదేశించా రు. ఇదిలా ఉండగా చెన్నై పూందమల్లిలోని ఒక అపార్టుమెంటులో అనుమానాస్పదంగా ఉంటున్న ఇద్దరిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top