ఆఫ్‌లైన్‌లోనే సీబీఎస్‌ఈ టర్మ్‌–1 పరీక్షలు

Term-1 board exams for Classes 10, 12 to be conducted offline - Sakshi

న్యూఢిల్లీ: 10, 12వ తరగతుల టర్మ్‌–1 బోర్డు పరీక్షలను ఆఫ్‌లైన్‌ విధానంలోనే నిర్వహించనున్నట్లు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకెండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ) గురువారం ప్రకటించింది. నవంబర్‌–డిసెంబర్‌లో ఈ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. పరీక్షల షెడ్యూల్‌ను ఈ నెల 18న ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది. ఆబ్జెక్టివ్‌ టైప్‌ పరీక్ష ఉంటుందని, ఒక్కో టెస్టు వ్యవధి 90 నిమిషాలని పేర్కొంది. చలి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఉదయం 10.30 గంటలకు కాకుండా 11.30 గంటలకు పరీక్షలు ప్రారంభించనున్నట్లు స్పష్టం చేసింది. టర్మ్‌–1, టర్మ్‌–2 పరీక్షల తర్వాత తుది ఫలితాలను ప్రకటించనున్నట్లు సీబీఎస్‌ఈ ఎగ్జామ్‌ కంట్రోలర్‌ భరద్వాజ్‌ తెలిపారు. టర్మ్‌–2 పరీక్షలను వచ్చే ఏడాది మార్చి–ఏప్రిల్‌లో నిర్వహించనున్నట్లు చెప్పారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top