
పట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav) ఇంటిలో సంబరాల వాతావారణం నెలకొంది. ఆయన కుమారుడు, ఆర్జేడీ నేత, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌కు రెండవ సంతానం కలిగింది. ఈ విషయాన్ని తేజస్వి స్వయంగా తెలియజేశారు. తనకు రెండవ సంతానంగా మగబిడ్డ జన్మనిచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ సంతోషకరమైన వార్తను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. తేజస్వి తమ నవజాత శిశువు తొలి ఫోటోను కూడా పంచుకున్నారు.
Good Morning! The wait is finally over!
So grateful, blessed and pleased to announce the arrival of our little boy. Jai Hanuman! pic.twitter.com/iPHkgAkZ2g— Tejashwi Yadav (@yadavtejashwi) May 27, 2025
తేజస్వి యాదవ్ తన ఎక్స్ పోస్ట్‌లో ‘గుడ్ మార్నింగ్.. మా నిరీక్షణ చివరకు ముగిసింది. మా చిన్న కుమారుని రాకను ప్రకటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. జై హనుమాన్’ అని పేర్కొన్నారు. 2023 నవరాత్రులలో తేజస్వి దంపతులకు తొలికుమారుడు జన్మించాడు. తేజస్వి యాదవ్(Tejaswi Yadav) 2021లో తన స్నేహితురాలు రాచెల్ గోడిన్హోను(రాజశ్రీ) వివాహం చేసుకున్నారు. వీరి వివాహం హిందూ ఆచారాల ప్రకారం.. కొద్దిమంది అతిథుల మధ్య జరిగింది. రాజశ్రీ, తేజస్వి యాదవ్‌లు న్యూఢిల్లీలోని ఆర్కే పురంలో గల డీపీఎస్ పాఠశాలలో కలిసి చదువుకున్నారు.
ఇది కూడా చదవండి: ‘జగన్నాథ్’ పేరుపై హక్కులెవరివి?