కుటుంబలోని ఐదుగురిని హత్య చేసి తానూ..  | Tamil Nadu Man Killed Five Family Members And Committed Suicide | Sakshi
Sakshi News home page

ఐదుగురు కుటుంబ సభ్యులను హత్య చేసి.. ఆపై ఆత్మహత్య

Dec 13 2022 11:37 AM | Updated on Dec 13 2022 11:48 AM

Tamil Nadu Man Killed Five Family Members And Committed Suicide - Sakshi

గంజాయి మత్తులో ఓ వ్యక్తి ఘాతుకానికి ఒడిగట్టాడు. కుటుంబంలోని ఐదుగురిని హత్య చేసి

సాక్షి, చెన్నై: తమిళనాడు తిరువణ్ణామలై జిల్లాలో దారుణం జరిగింది. గంజాయి మత్తులో ఓ వ్యక్తి ఘాతుకానికి ఒడిగట్టాడు. కుటుంబంలోని ఐదుగురిని హత్య చేసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. 

ఓరంతాడి గ్రామంలోని పళని అనే రైతు కొద్ది రోజులుగా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. కొద్ది రోజుల క్రితం తన భార్య వల్లి అనారోగ్యంతో చనిపోవడంతో మానసిక క్షోభకు గురయ్యాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి తన బిడ్డలను దారుణంగా గొడ్డలితో నరికి హత్య చేశాడు. మృతుల్లో త్రిష(15), మోనిషా (14), శివశక్తి (6), ధనుష్‌(4), భూమిక(9 నెలలు)గా గుర్తించారు. స్థానికులు గమనించి వారిని హుటాహుటిన తిరువణ్ణామలై జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. 

ఈ ఘాతుకానికి పాల్పడిన ‍అనంతరం నిందితుడు పళని తన పొలం వద్దకు వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: అమ్మానాన్నకు ఏమైంది అన్నయ్య?

Advertisement
 
Advertisement
Advertisement