దీపావళి బాణసంచా మోతపై షరతులు.. కేవలం ఆ 2 గంటలే! | Tamil Nadu Allows Bursting of Crackers With Restrictions for Deepavali | Sakshi
Sakshi News home page

దీపావళి బాణసంచా మోతపై షరతులు.. కేవలం ఆ 2 గంటలే!

Oct 11 2022 8:06 PM | Updated on Oct 11 2022 9:35 PM

Tamil Nadu Allows Bursting of Crackers With Restrictions for Deepavali - Sakshi

సాక్షి, చెన్నై: దీపావళి రోజున కేవలం 2 గంటల మాత్రమే బాణసంచా కాల్చాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. దీపావళి పండుగను ఈనెల 24న జరుపుకోనున్న విషయం తెలిసిందే. పండుగ వేళ బాణసంచా ఏఏ సమయాల్లో పేల్చాలో అనే వివరాలను అందులో వెల్లడించారు.

ఈ మేరకు ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే టపాకాయలు కాల్చాలని స్పష్టం చేశారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు పోలీసులు, స్థానిక సంస్థల అధికారులు ఈ విషయంపై అవగాహన కలిగించాలని సూచించారు. నిబంధనలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు. అలాగే, భారీ శబ్దంతో కూడిన బాణసంచా ఉపయోగించవద్దని, గ్రీన్‌ టపాసులనే పేల్చాలని సూచించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement