‘ఆశారాంకు జైలులోనే ఆయుర్వేద చికిత్స అందించండి’

Supre Court Rejected Bail Petition Of Asaram Bapu In New Delhi - Sakshi

న్యూఢిల్లీ: ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీం కోర్టు మంగళవారం తిరస్కరించింది. కాగా, ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని.. దీనికోసం ఉత్తర ఖండ్‌ వెళ్లి చికిత్స తీసుకోవడానికి ​రెండు నెలల పాటు మధ్యంతర బెయిల్‌ను కోరుతూ ఆశారాం బాపూ సుప్రీంకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు ఆయన బెయిల్‌ అభ్యర్థనను తిరస్కరిస్తూనే ఆయనకు జైలులోనే ఆయుర్వేద చికిత్సను అందించాలని జైలు అధికారులను ఆదేశించింది..

ఆశారాం బాపూ 2013 తన ఆశ్రమంలో 16 ఏళ్ల మైనర్‌ బాలికను అత్యాచారం చేశారు. ఈ ఘటన రుజువు కావడంతో ఆయనకు జోధ్‌పూర్‌ కోర్టు జీవిత ఖైదు శిక్షను విధించిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు మరో ఇద్దరు నిందితులకు జోధ్‌పూర్‌ కోర్టు 20 ఏళ్ల  జైలు శిక్షను విధించింది. గతంలో.. ఆశారాం బాపూకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన 9 మందిపై ఆయన అనుచరులు దాడిచేశారు.

దీనిలో ఇప్పటికే ముగ్గురు మృతి చెందారు. ఆయన గతంలో కూడా పలుసార్లు ఆరోగ్యం నిలకడగా లేదని బెయిల్‌ కోరుతూ పిటిషన్‌ దాఖలు  కోరారు. అయితే, దీనిపై  గతంలో సుప్రీంకోర్టు ఆయన ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించడానికి ప్రత్యేక వైద్యులను నియమించింది. కాగా,  ఆశారాం బాపూను పరీక్షించిన వైద్యులు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని సుప్రీం కోర్టుకు తెలియజేశారు.   

చదవండి: అన్నీ తెరిచాక ఇంకేం... డ్రామా మాత్రమే

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top