రోడ్డు మధ్యలో...హఠాత్తుగా గొయ్యి! అటుగా వచ్చిన బైకర్‌.. | Suddenly Ground Collapsed Into Whole In Middle Road Biker Fell Injured | Sakshi
Sakshi News home page

రోడ్డు మధ్యలో...హఠాత్తుగా గొయ్యి! అటుగా వచ్చిన బైకర్‌..

Published Fri, Jan 13 2023 8:06 AM | Last Updated on Fri, Jan 13 2023 8:06 AM

Suddenly Ground Collapsed Into Whole In Middle Road Biker Fell Injured - Sakshi

సాక్షి, శివాజీనగర: బెంగళూరులో గుంతల రహదారులతో సతమతమవుతున్న నగరవాసులకు సింక్‌ హోల్‌ తరహా ముప్పు ఎదురైంది. ఆకస్మాత్తుగా రోడ్డు మధ్య భాగంలో నేల కుంగిపోగా, ఆ గుంతలోకి బైకిస్టు పడిపోయి గాయపడిన ఉదంతం గురువారం మధ్యాహ్నం సంభవించింది. గత మంగళవారం మెట్రో పిల్లర్‌ కడ్డీలు కూలిపడి తల్లీ కొడుకు మృతి చెందిన దుర్ఘటన మరువక ముందే ఈ తరహా సంఘటన కలకలం రేపుతోంది.  

ఏం జరిగిందంటే  
అశోకనగర ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ వ్యాప్తిలో జాన్సన్‌ మార్కెట్‌ రోడ్డులో రోజులాగానే వాహనాలు వెళ్తుండగా రోడ్డు హఠాత్తుగా కుంగిపోయి 3 అడుగుల వ్యాసం, 3 మీటర్ల లోతుతో గొయ్యి ఏర్పడింది. వేగంగా వెళ్తున్న ఒక బైకిస్టు అదుపుతప్పి పడిపోవడంతో గాయాలు తగిలాయి. అతనిని ఆస్పత్రికి తరలించారు. నడి రోడ్డులో ఏర్పడిన ఈ సింక్‌ హోల్‌ అందరికీ ఆందోళన కలిగించింది.

సమాచారం అందుకొన్న తూర్పు విభాగపు డీసీపీ కళా కృష్ణమూర్తి స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ సంఘటనతో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ట్రాఫిక్‌ నియంత్రణ కోసం పోలీసులు ఈ రోడ్డు మొత్తాన్ని మూసివేసి ట్రాఫిక్‌ను ఇతర మార్గాల్లోకి మళ్లించారు. భూగర్భంలో మెట్రో రైల్‌ సొరంగ మార్గం పనుల వల్ల పైన రోడ్డు ఇలా కుంగిపోయిందని అనుమానం ఉంది.   

(చదవండి: వీడిన మిస్టరీ.. కూతురు వల్లే ఇలా జరిగిందా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement