నెవెర్‌ బిఫోర్‌..ఎవర్‌ ఆఫ్టర్‌ ఫైట్‌ సీన్‌!

Stray Dog Fight With Lioness Viral Video - Sakshi

బలవంతుడ్ని చూసి భయపడాల్సిన బలహీనుడు తిరగబడితే ఎలా ఉంటుంది?... గెలుపు ఎవరిదన్న సంగతి పక్కన పెడితే.. ఓ చిన్న ప్రయత్నం.. పోయేదేముంది. చరిత్రలో మిగిలిపోతాము లేదా మనమేం పిరికివాళ్లం కాదని లోకానికి చాటి చెబుతాం. ఉద్దేశ్యం వేరైనా ఓ కుక్క ఏకంగా సివంగితోనే కయ్యానికి కాలు దువ్వింది. దాని దెబ్బలకు ఎదురొడ్డి కొద్దిసేపు తలపడింది. కానీ, సివంగి బలం ముందు తన బలం ఎందుకూ కొరగాదన్న సత్యం తెలుసుకుని కాళ్లకు బుద్ధి చెప్పింది. అలా కాకుండా మొండి ధైర్యంతో ముందుకు పోయింటే మాత్రం కుక్క తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి ఉండేది. ( చిరుతకు ఝలక్: ఈ జింక చర్య ఊహాతీతం‌ )

ఈ సంఘటనకు సంబంధించిన 1:34 సెకన్ల వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు 1.6 లక్షల వ్యూస్‌ సంపాదించుకుంది. ఐఎఫ్‌ఎస్‌ అధికారి పర్వీన్‌ కశ్వాన్‌ ఈ వీడియో తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు.  ‘‘ జీవితంలో ఈ మాత్రం నమ్మకం ఉంటే చాలు. సివంగితో కుక్క పోరాటం. వీధి కుక్కలు, క్రూర మృగాల పోరాటాలలో ఇదే హైలెట్‌ సంఘటన’’ అని పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top