ఒక ఎండ్రికాయ.. ఐదు సింహాలు రౌండప్‌.. ఆ తర్వాత

Crab Movement Watched By Five Loins Fascinated Become Intresting - Sakshi

ఒక్క సింహం ఎదురుపడితేనే మనం గజగజ వణికిపోతుంటాం. అలాంటిది ఐదు సింహాలు ఒకేసారి దాడిచేస్తే.. అది ఊహించుకోవడానికి కష్టంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక ఎండ్రికాయ మాత్రం తనను ఐదు సింహాలు చుట్టుముట్టినా అది ఇంచు కూడా భయపడలేదు. అసలు ఆ సింహాలు దానిని ఏం చేద్దామనుకున్నాయో అ‍ర్థం చేసుకునేలోపే వీడియో పూర్తవుతుంది. ఈ అద్బుత దృశ్యాన్ని మాలా ప్రైవేట్‌గేమ్‌ రిజర్వ్‌కు చెందిన రేంజర్స్‌ రగ్గిరో బారెటో, రాబిన్ సెవెల్ తమ కెమెరాలో​ బంధించారు. 2.36 నిమిషాల నడివి గల వీడియో ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది.

వీడియో ప్రారంభంలో ఒక ఎండ్రికాయ ఇసుకలో నుంచి పైకి లేవగానే అక్కడే ఉన్న సింహం దానిని పరిశీలిస్తూ ఫాలో అవుతుంది. కొద్దిసేపటికి మరో నాలుగు సింహాలు వచ్చి దానిని వెంబడిస్తుంటాయి. కానీ ఆ ఎండ్రికాయ మాత్రం తనకేం పట్టనట్టుగా వ్యవహరిస్తూ తన దారిన తాను పోతునే ఉంది. చివరగా ఐదు సింహాలు దానిని చుట్టుముట్టడంతో వీడియో ముగుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ట్రెండింగ్‌గా మారింది. ఇప్పటివరకు 84, 136 మంది ఈ వీడియోను వీక్షించారు. వీలైతే మీరు ఒక లుక్కేయండి.

చదవండి: వధువును భుజాలపై ఎత్తుకొని నదిని దాటిన వరుడు; వీడియో

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top