
ఫుడ్ డెలివరీ యాప్‌లలో సాధారణంగా మారిపోయిన విషయంపై పెద్ద రాద్ధాంతమే..
వైరల్: సాధారణంగా ఫుడ్ డెలివరీ యాప్‌లలో.. ఆర్డర్ చేసేటప్పుడు కొందరు తమ టేస్టులకు తగ్గట్లుగా రెస్టారెంట్‌లకు కొన్ని సూచనలు చేస్తుంటారు. ఎక్స్‌ట్రా స్పైసీగా ఉండాలనో, ఉప్పు తక్కువగా ఉండాలనో లేదంటే ఇంకేదైనా సూచనను తమ అవసరాలకు అనుగుణంగా జత చేస్తుంటారు. అందుకే కస్టమర్లకు తగ్గట్లే.. కుకింగ్ ఇన్‌స్ట్రక‌్షన్స్ పేరుతో కాలమ్స్‌ను పెడుతుంటాయి ఆయా యాప్‌లు. అయితే..
ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో తన కస్టమర్లకు ఒక విజ్ఞప్తి చేసింది. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లలో సర్వసాధారణంగా మారిపోయిన ఓ కుకింగ్ సూచనను దయచేసి చేయొద్దంటూ ట్వీట్ చేసింది. అదే.. ‘‘భయ్యా.. ఫుడ్‌ను మంచిగా ప్రిపేర్ చెయ్యండి’’ అని. దయచేసి కుకింగ్ ఇన్‌స్ట్రక్షన్ ఈ సందేశాన్ని జత చేయొద్దంటూ విజ్ఞప్తి చేసింది జొమాటో.
అయితే జొమాటో రిక్వెస్ట్‌గా చేసిన ఈ ట్వీట్‌కు నెగెటివ్ కామెంట్లే ఎక్కువగా వచ్చి పడుతున్నాయి. అలాంటప్పుడు ఆ సూచన కాలమ్ ఎందుకని, ఏం రాయాలనే కస్టమర్లకు స్వేచ్ఛ ఉండదా?అని జొమాటోని ఏకిపడేస్తున్నారు. కస్టమర్ల అవసరాలకు తగ్గట్లు కంపెనీలు సేవలు అందించాలే తప్ప.. వాళ్లకు అడ్డు చెప్పడం సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
guys please stop writing “bhaiya accha banana” as cooking instructions 🤦♂️
— zomato (@zomato) December 22, 2022