1857 సిపాయిల తిరుగుబాటు: వీర సైనికుల అస్థిపంజరాలు లభ్యం

Skeletons Of Indian Soldiers Found In Punjab - Sakshi

బ్రిటిష్‌ పాలనలో 1857 సిపాయిల తిరుగుబాటుకు ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో భారతీయులకు తెలిసిందే. 1857 సిపాయిల తిరుగుబాటును భారత తొలి స్వాతంత్ర్య సంగ్రామంగా చరిత్రకారులు అభివర్ణిస్తారు. బ్రిటిష్‌ పాలనకు తిరుగుబాటు ఇక్కడి నుంచే ప్రారంభమైంది. 

అయితే, తాజాగా సిపాయిల తిరుగుబాటులో మరణించిన 282 మంది భారత సైనికుల అస్థిపంజరాలు పంజాబ్‌లోని బయటపడ్డాయి. అమృత్‌సర్‌ సమీపంలో జరిపిన తవ్వకాల్లో సైనికుల అస్థిపంజరాలను కనుకొన్నట్లు పంజాబ్‌ యూనివర్సిటీలోని ఆంత్రోపాలజీ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జేఎస్‌ సెహ్రావత్‌ తెలిపారు. అజ్నాలాలో మతపరమైన కట్టడం కింద ఉన్న బావిలో జరిపిన తవ్వకాల్లో 282 మంది భారత సైనికుల అస్థిపంజరాలను గుర్తించినట్లు బుధవారం వెల్లడించారు. 

కాగా, సిపాయిల తిరుగుబాటులోనే సైనికులు మరణించినట్టుగా ఆ ప్రాంతంలో లభించిన నాణేలు, డీఎన్‌యే అధ్యయనం, ఆంత్రోపోలాజికల్ ఎలిమెంటల్ అనాలిసిస్, రేడియో-కార్బన్ డేటింగ్ వంటి వాటి పరిశీలనల ద్వారా తెలుస్తున్నదని ఆయన తెలిపారు. అయితే, బ్రిటిష్‌ కాలంలో భారత సైనికులు.. తూటాలను పంది మాంసం, గొడ్డు మాంసంతో తయారుచేశారన్న కారణంగా తిరుగుబాటు మొదలైంది. దీంతో బ్రిటిష్‌ అధికారులకు ఎదురుతిరిగిన భారత సైనికులను కిరాతకంగా చంపారు. అనంతరం వారి మృతదేహాలను ఓ బావిలో పడేశారు. 

ఇది కూడా చదవండి: షాకింగ్‌ వీడియోను పోస్ట్‌ చేసిన కిరణ్‌ బేడి... మండిపడుతున్న నెటిజన్లు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top