ఇంట్లోకి చొరబడిన చిరుత.. దాడిలో ఆరుగురికి గాయాలు | Six injured after leopard attack in Nilgiris district Tamil Nadu | Sakshi
Sakshi News home page

ఇంట్లోకి చొరబడిన చిరుత.. దాడిలో ఆరుగురికి గాయాలు

Published Sun, Nov 12 2023 3:37 PM | Last Updated on Sun, Nov 12 2023 3:45 PM

Six injured after leopard attack in Nilgiris district Tamil Nadu - Sakshi

తమిళనాడులోని నీలగిరి జిల్లా కూనూరు అటవీ ప్రాంతంలో చిరుత దాడిలో ఆరుగురు గాయపడ్డారు. వీరిలో విధుల్లో ఉన్న జర్నలిస్ట్‌ ఒకరు ఉన్నారు. ఆహారం కోసం అడవి నుంచి బయటకు వచ్చిన చిరుత కూనూరు సమీపంలోని గ్రామంలో ఓ వీధి కుక్కను వెంబడిస్తూ ఓ ఇంట్లోకి ప్రవేశించింది. భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు.

 

వెంటనే అక్కడి చేరుకున్న అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించేందుకు చర్యలు చేపట్టారు. చిరుత చొరబడిన ఇంట్లో ఓ వ్యక్తి ఉండటంతో అతన్ని రక్షించేందుకు ప్రయత్నించిన ఆరుగురిపై చిరుత దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన వీరిలో విధుల్లో ఉన్న ఓ జర్నలిస్ట్‌ కూడా ఉన్నారు. వీరందరినీ కూనూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిరుత ఇంకా ఇంట్లోనే ఉందని, దాన్ని బంధించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement