దేశంలోనే తొలి సెల్ఫ్‌ బ్లడ్‌ టెస్టింగ్‌ కిట్‌ | Self Blood Testing Kit Introduced In Tamilnadu | Sakshi
Sakshi News home page

దేశంలోనే తొలి సెల్ఫ్‌ బ్లడ్‌ టెస్టింగ్‌ కిట్‌

Dec 10 2021 1:59 PM | Updated on Dec 10 2021 2:09 PM

Self Blood Testing Kit Introduced In Tamilnadu - Sakshi

సాక్షి, కొరుక్కుపేట(తమిళనాడు): దేశంలోనే తొలిసారిగా కాంటాక్ట్‌ లెస్‌ సెల్ఫ్‌ బ్లడ్‌ టెస్టింగ్‌ కిట్‌ను చెన్నైలో అందుబాటులోకి తెచ్చారు. బుధవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్‌ జె.రాధాకృష్ణన్, సినీ దర్శకురాలు కృతికా ఉదయనిధి అతిథులుగా పాల్గొని సెల్ఫ్‌ బ్లడ్‌ టెస్టింగ్‌ కిట్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆప్టిమిస్ట్‌ సంస్థకు చెందిన వేల్‌ మురుగన్, సరస్వతి మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణలో భాగంగా రక్త పరీక్షల కోసం వినూత్నమైన, సులువైన విధానాన్ని తీసుకొచ్చామని తెలిపారు. ఆరోగ్య కార్యదర్శి డాక్టర్‌ జె.రాధాకృష్ణన్‌ మాట్లాడుతూ పేదలకు ఉపయోగకరంగా సెల్ఫ్‌ బ్లడ్‌ టెస్టింగ్‌ కిట్‌ ఎంతో దోహదపడుతుందని దీనిని రూపొందించిన నిర్వాహకులను అభినందించారు. 

చదవండి: Helicoter Crash: మృత్యువుతో పోరాడుతున్న వరుణ్‌ సింగ్‌.. వైరలవుతోన్న లేఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement