Aryan Khan: ఆర్యన్ ఖాన్ కేసు నిరూపణ అయితే శిక్ష ఎన్నేళ్లంటే..

Sections of NDPS Act invoked against Aryan Khan in drugs bust case - Sakshi

నిరూపణ అయితే పదేళ్ల జైలు.. రూ.లక్ష వరకూ జరిమానా 

ఆర్యన్‌పై నమోదైన చట్టం ఇదే 

సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ తనయుడు ఆర్యన్‌ డ్రగ్స్‌ కేసులో అరెస్టు కావడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. నార్కోటిక్‌ డ్రగ్స్, సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్‌ యాక్ట్‌ 1985 (ఎన్‌డీపీఎస్‌) చట్టంలోని పలు నిబంధనలు అభియోగాలుగా ఎన్‌సీబీ నమోదు చేసింది. ఆర్యన్‌పై నమోదైన సెక్షన్లు వాటికి పడే శిక్షలను ఓసారి చూద్దాం.. ఆర్యన్, మరో ఏడుగురి అరెస్టు మెమో ప్రకారం 13 గ్రాముల కొకైన్, ఐదు గ్రాముల ఎండీ, 21 గ్రాముల చరస్, ఎండీఎంఏ 22 టాబ్లెట్లు ఎన్‌సీబీ సీజ్‌ చేసింది. అరెస్టయిన వారిపై ఎన్‌డీపీఎస్‌ చట్టంలోని సెక్షన్‌ 8(సీ), 20 (బీ), 27 రెడ్‌ విత్‌ సెక్షన్‌ 35లు నమోదు చేసింది. దోషులుగా తేలితే ఆయా సెక్షన్ల వల్ల శిక్ష, జరిమానా ఇలా...  

సెక్షన్‌8(సీ): ఈ సెక్షన్‌ ప్రకారం ఎలాంటి మాదక ద్రవ్యాలను ఎవరూ ఉత్పత్తి, అమ్మకం, కొనుగోలు, రవాణా,  నిల్వ,  వినియోగం, కలిగి ఉండడం, విదేశాల నుంచి ఎగుమతి, దిగుమతి, సరఫరా వంటివి చేయకూడదు.  

చదవండి: (ఆర్యన్‌ ఖాన్‌కు దొరకని బెయిల్‌)

సెక్షన్‌ 20 (బీ): గంజాయి (కన్నాబిస్‌) ఉల్లంఘనకు సంబంధించిన సెక్షన్‌.  తక్కువ మొత్తంలో మాదక ద్రవ్యాలు దొరికతే కఠిన కారాగార శిక్ష(ఏడాది వరకూ) లేదా రూ.10 వేల జరిమానా లేదా రెండు అమలు చేస్తారు. ఎక్కువ మొత్తం దొరికితే.. పదేళ్ల వరకూ కఠిన కారాగార శిక్ష, రూ.లక్ష వరకూ జరిమానా. ఒకవేళ వాణిజ్యపరమైన మొత్తంలో దొరికితే.. పదేళ్ల నుంచి 20 ఏళ్ల వరకూ కఠిన కారాగార శిక్ష, రూ లక్ష నుంచి రూ.2 లక్షల వరకూ జరిమానా విధించొచ్చు.  

సెక్షన్‌ 27:  ఈ సెక్షన్‌ ప్రకారం... ఎ). కొకైన్, మార్ఫైన్, డయాసైటైల్మోర్ఫిన్, ఇతర నార్కొటిక్‌ డ్రగ్, సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్స్‌ను వినియోగించినట్లైతే ఏడాది కఠిన కారాగారం, రూ. 20 వేల జరి మానా లేదా రెండూ విధించొచ్చు. బి). తక్కువ మొత్తంలో అయితే 6 నెలల జైలు, రూ.10 వేల జరిమానా లేదా రెండు విధిం చొచ్చు. దాడిలో దొరికిన నిషేధిత డ్రగ్‌ పరిమాణాన్ని బట్టి సెక్షన్‌ 20 కింద శిక్ష ఉంటుంది. వాణిజ్యపరంగా డ్రగ్స్‌ కలిగి ఉంటే ప్రభుత్వ న్యాయవాది అంగీకారం లేకుండా బెయిలు రావడం కుదరదు.  

చదవండి: (Mumbai Cruise Rave Party: ఎవరీ సమీర్‌ వాంఖెడే..?)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top