సంతూర్‌ విద్వాంసుడు సొపోరి కన్నుమూత

Santoor Maestro Bhajan Sopori Dies in Gurugram Hospital - Sakshi

న్యూఢిల్లీ: సంతూర్‌ విద్వాంసుడు భజన్‌ సొపోరి (73) కన్నుమూశారు. కొన్నాళ్లుగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన గురుగ్రాం ఆస్పత్రిలో గురవారం తుదిశ్వాస విడిచినట్టు కుమారుడు అభయ్‌ తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు.

సంతూర్‌ మేస్ట్రో పండిట్‌ శివకుమార్‌ శర్మ మరణించిన కొన్ని వారాలకే సొపోరి కూడా వెళ్లిపోవడం సంగీత ప్రపంచంలో విషాదం నింపింది. కశ్మీర్‌కు చెందిన సొపోరి పదేళ్ల వయసులోనే కచేరి చేశారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై అలరించారు. హిందీ కశ్మీరీ, డోగ్రీ, సింధీ, ఉర్దూ, భోజ్‌పురీ, పర్షియన్, అరబిక్‌ భాషల్లో 6 వేలకుపైగా పాటలు కంపోజ్‌ చేశారు. గాలిబ్‌ గజల్స్‌కూ బాణీలు కట్టారు. 2004లో పద్మశ్రీ అందుకున్నారు.  
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top