వ్యాక్సిన్‌పై వాస్తవాలేంటి?

Sakshi Special Story About Corona Virus Vaccine

ఇంకొన్ని రోజుల్లో భారత్‌లో కోవిడ్‌ టీకాలు వచ్చేస్తున్నాయి. ఆరోగ్య సిబ్బందితో మొదలుపెట్టి వృద్ధులు.. ఆరోగ్య సమస్యలున్న వారు అన్న క్రమంలో... వరుసగా టీకాలు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి! మరి గడ్డుకాలమిక తొలగిపోయినట్లేనా? ఇక అంతా మంచేనా? ఊహూ.. కానేకాదు! టీకా తీసుకున్నా మరికొంత కాలం జాగ్రత్తలు కొనసాగాల్సిందే అంటున్నారు నిపుణులు. ఈ అంశంతోపాటు టీకాలకు సంబంధించిన ఇతర సందేహాలకు సమాధానాలివిగో..              

వ్యాక్సిన్లలో రకాలేమిటి?  
హా ఫైజర్, మోడెర్నా సంస్థలు మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏతో(ప్రొటీన్‌ తయారీకి పనికొచ్చే డీఎన్‌ఏ పోగు)టీకాను అభివృద్ధి చేస్తున్నాయి. హా భారత్‌లోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్‌ టీకాలో వాడే వైరస్‌లు రోగ నిరోధక కణాలు గుర్తించే యాంటిజెన్లను సిద్ధం చేస్తాయి. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకాలు తయారు చేస్తున్న కోవిషీల్డ్‌ను చింపాంజీకి చెందిన అడినోవైరస్‌ను వాహకంగా వాడుతున్నారు. హా భారత్‌ బయోటెక్‌ (హైదరాబాద్‌), గమలేయా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (రష్యా) నిర్వీర్యం చేసిన వైరస్‌ ఆధారంగా టీకాను తయారు చేస్తున్నాయి. ఈ వైరస్‌లు వ్యాధిని కలిగించవు కానీ.. రోగ నిరోధక వ్యవస్థ తాలూకూ కణాలు గుర్తించేందుకు ఉపయోగపడతాయి.   

ఏ వ్యాక్సిన్‌ సామర్థ్యం ఎంత?
కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ కోవిడ్‌–19 లక్షణాలు కనబరిచే వారిలో 70.4 శాతం సామర్థ్యంతో పనిచేస్తుంది. తీవ్రమైన లక్షణాలతో బాధపడుతున్న వారిలో 100 శాతం పనిచేస్తుందని అంచనా. ఫైజర్‌ టీకా సామర్థ్యం 95 శాతం కాగా, రష్యా టీకా స్పుత్నిక్‌–వీ 92 శాతం సామర్థ్యాన్ని కనబరిచింది.  

టీకాలు ఎవరెవరికి ఇవ్వవచ్చు?
పైన పేర్కొన్న  టీకాలను 18 లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారికి ఇవ్వవచ్చు. ఇందుకు తగ్గట్టుగా  ప్రయోగాలు జరిగాయి. ప్రస్తుతం 12–18 ఏళ్ల వారిపై ఈ టీకాలు ఎలా పనిచేస్తాయన్నది పరీక్షిస్తున్నారు.   

అందుబాటులో ఉన్నాయా?
కోవిషీల్డ్‌ టీకా అత్యవసర వాడకంపై అనుమతికి సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ దరఖాస్తు చేసుకుంది. భారత్‌ బయోటెక్, స్పుత్నిక్‌–వీ  మూడో దశ ప్రయోగాలను పూర్తి చేయాల్సి ఉంది. ఫైజర్‌ వ్యాక్సిన్‌ ప్రైవేట్‌ రంగంలో అందుబాటులోకి రావచ్చు. 18 ఏళ్ల లోపువయసున్న వారికి ఏ టీకా అందుబాటులో లేదు.  

వ్యాధి సోకి నయమైన వారికి టీకా అవసరమా?
కోవిడ్‌ బారిన పడి సహజసిద్ధంగా కోలుకున్న వారికి దీర్ఘకాలంలో వ్యాధి నుంచి రక్షణ ఉంటుందా?  అన్నది ఇప్పటికీ అస్పష్టం. కాలక్రమంలో శరీరంలో యాంటీబాడీలు బలహీన పడే అవకాశాలు ఎక్కువైనప్పటికీ వ్యాధి నుంచి రక్షణ తగ్గిపోతుందని చెప్పలేమని నిపుణులు అంటున్నారు. అందుకే కోవిడ్‌ నుంచి బయటపడిన వారికి ఆఖరులో టీకా ఇవ్వాలని యోచిస్తున్నారు.
 
ఒక్కో డోస్‌ ఎంత? ఎన్ని డోసులు?   

కోవిషీల్డ్‌ టీకా ఒక డోసుకు 0.5 మిల్లీలీటర్‌ ఉంటుంది. 28 రోజుల వ్యవధిలో 2 డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. ఫైజర్, మోడెర్నా, స్పుత్నిక్‌–వీ టీకాలను 21 రోజుల వ్యవధిలో 2 డోసులు ఇస్తారు. రెండు వారాల సమయంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని అంచనా. ఎంఆర్‌ఎన్‌ఏ టీకా మాత్రం తొలి డోసు తీసుకున్న 10 రోజుల్లోనే యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్లు  తెలిసింది. రెండు డోసుల స్థానంలో ఒకటే తీసుకున్నా ఓమోస్తరు ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

 రెండు డోసులతో రక్షణ ఎంత కాలం?
ప్రస్తుతానికి ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు. కోవిషీల్డ్‌ టీకా తీసుకున్న వారిలో నాలుగు నెలల కంటే ఎక్కువ కాలం వ్యాధి నుంచి రక్షణ లభించింది. యాంటీబాడీలు బలహీన పడినా వ్యాధి నుంచి రక్షణ లభిస్తుందని అంచనా. బూస్టర్‌ టీకా అవసరం రాకపోవచ్చనే అనుకుంటున్నారు. టీకా తీసుకున్న వారిలో నొప్పి, జ్వరం వంటి కొన్ని దుష్ప్రభావాలు కనిపించే అవకాశం ఉంది.

టీకా వేసుకున్నాక మామూలుగా తిరిగేయవచ్చా?  
ఏ వ్యాక్సిన్‌ అయినా 100 శాతం రక్షణ కల్పించదు. టీకా తీసుకున్న వారు మళ్లీ వ్యాధి బారిన పడకపోవచ్చుగానీ.. ఇతరులకు వైరస్‌ను అంటించే అవకాశం ఉంటుంది. అందుకే టీకా వేసుకున్న తరువాత కూడా మాస్కు ఉపయోగించడం, భౌతిక దూరాన్ని పాటించడం, చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం మరికొంత కాలం కొనసాగించాల్సి ఉంటుంది.

  – సాక్షి, హైదరాబాద్‌  

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

09-05-2021
May 09, 2021, 00:56 IST
సాక్షి, న్యూఢిల్లీ: వారం రోజులుగా దేశవ్యాప్తంగా 180 జిల్లాలు, 14 రోజులలో 18 జిల్లాలు, 21 రోజులుగా 54 జిల్లాలు,...
08-05-2021
May 08, 2021, 23:13 IST
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఘాటుగా స్పందించింది. కరోనా సెకండ్...
08-05-2021
May 08, 2021, 21:53 IST
ముంబై: ప్రముఖ బాలీవుడ్‌ పాప్‌ సింగర్‌ బాబా సెహగల్‌ కరోనాపై అవగాహన కల్పిస్తూ పాడిన పాట సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.....
08-05-2021
May 08, 2021, 20:46 IST
జైపూర్‌: ​కోవిడ్‌తో మరణించిన వ్యక్తి అంతిమయాత్రకు హాజరైనా వారిలో 21 మంది మృతి చెందారు. ఈ సంఘటన రాజస్థాన్‌ రాష్ట్రంలోని శిఖర్‌ జిల్లాలోని...
08-05-2021
May 08, 2021, 20:25 IST
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రధాని నరేంద్ర మోదీకి మచిలీపట్నం ఎంపీ బాలశౌరీ లేఖ రాశారు. మెడికల్‌ ఆక్సిజన్‌, రెమిడెసివిర్‌పై...
08-05-2021
May 08, 2021, 19:32 IST
ముంబై: టీమిండియా ఆటగాడు అజింక్య ర‌హానే క‌రోనా టీకా తీసుకున్నాడు. త‌న స‌తీమ‌ణి రాధిక‌తో క‌లిసి ముంబైలోని క‌రోనా వ్యాక్సిన్ కేంద్రంలో...
08-05-2021
May 08, 2021, 19:22 IST
సాక్షి, అమరావతి : గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 1,01,571 కరోనా పరీక్షలు నిర్వహించగా 20,065 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది....
08-05-2021
May 08, 2021, 18:44 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత లేకుండా చూస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.కరోనా రోగులకు...
08-05-2021
May 08, 2021, 18:01 IST
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ కట్టడికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 మంది సభ్యులతో టాస్క్‌ఫోర్స్‌...
08-05-2021
May 08, 2021, 17:28 IST
భారత హాకీ దిగ్గజం, మాస్కో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన భారత హాకీ జట్టు సభ్యుడు రవీందర్ పాల్ సింగ్ (60)...
08-05-2021
May 08, 2021, 17:00 IST
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ అల్లకల్లోలాన్ని సృష్టించింది. వైరస్‌ ఇప్పటికీ కొన్ని దేశాల్లో తన ప్రభావాన్ని భీకరంగా చూపిస్తోంది. భారత్‌ లాంటి...
08-05-2021
May 08, 2021, 16:26 IST
హైదరాబాద్ లోని డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సహకారంతో  ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఐఎన్‌ఎంఏఎస్‌ (ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్...
08-05-2021
May 08, 2021, 16:19 IST
న్యూఢిల్లీ: కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పలువురు ముఖ్యమంత్రులకు శనివారం ఫోన్‌ చేశారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌...
08-05-2021
May 08, 2021, 15:28 IST
రాగి జావ..కొర్ర బువ్వ..జొన్న రొట్టె.. ఇళ్లలో ఇప్పుడు ఇదే మెనూ. కుటుంబ సభ్యులంతా ఇష్టంగా తింటున్నారు. బయటి ఆహారానికి స్వస్తి...
08-05-2021
May 08, 2021, 15:20 IST
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌లో తీవ్రంగా విస్తరిస్తోంది.మరోవైపు ఇప్పటికే దేశంలో కోవీషీల్డ్‌, కోవాగ్జిన్‌, స్పుత్నిక్-వి అనే మూడు...
08-05-2021
May 08, 2021, 15:07 IST
ముంబై: కరోనా సెకండ్ వేవ్‌ విజృంభణ నేపథ్యంలో వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ రంగ దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌...
08-05-2021
May 08, 2021, 15:01 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా శనివారం నుంచి రెండో డోసు వేసుకునే లబ్ధిదారులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు రాష్ట్ర...
08-05-2021
May 08, 2021, 14:55 IST
హిమాచల్‌ ప్రదేశ్‌లో ఏకంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, బాలీవుడ్‌ మెగాస్టార్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ల...
08-05-2021
May 08, 2021, 14:04 IST
థర్డ్‌ వేవ్‌ కూడా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నప్పుడు హటాత్తుగా ఆకాశం మేఘావృతమై ఓ చినుకు రాలినట్లుగా వినిపించిన మాట ఇది!...
08-05-2021
May 08, 2021, 13:56 IST
లండన్‌: గత సంవత్సర కాలంగా కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అల్లాడిస్తోంది. ఇటీవలే కొన్ని దేశాలు ఈ వైరస్‌ బారినుంచి మెల్లగా కోలుకుంటున్నాయి....
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top