Rishab Shetty spotted with Karnataka CM Basavaraj Bommai in Kollur Temple - Sakshi
Sakshi News home page

సీఎం వెంట కాంతార రిషబ్‌.. బీజేపీ తరపున ప్రచారం చేస్తారా?

Apr 14 2023 10:23 AM | Updated on Apr 14 2023 11:55 AM

Rishab Shetty Spotted With Karnataka Cm Basavaraj Bommai During Temple Visit - Sakshi

యశవంతపుర: సీఎం బొమ్మై రాష్ట్రంలో దేవస్థానాల సందర్శన చేపట్టారు. గురువారం కొల్లూరు మూకాంబిక దేవస్థానాన్ని సతీసమేతంగా దర్శించారు. ఈ సమయంలో కాంతార నటుడు రిషబ్‌శెట్టి కూడా సీఎం వెంట ఉండడం విశేషం. తరువాత సీఎం విలేకరులతో మాట్లాడుతూ రిషబ్‌శెట్టి అనుకోకుండా కలిశారని చెప్పడం గమనార్హం.


సీఎం వెంట మంత్రి కోట శ్రీనివాస పూజారి, ప్రమోద్‌ మధ్వరాజ్‌లున్నారు. జిల్లాకు చెందిన అనేక మంది ఎమ్మెల్యేలు గైరాజరయ్యారు. కాగా, ఉడుపి జిల్లా శిరూరు వద్ద సీఎం హెలికాప్టర్‌ టేకాఫ్‌ అవుతుండగా అక్కడికి వంద మీటర్ల దూరంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఫైర్‌ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. హెలికాప్టర్‌ యథావిధిగా టేకాఫ్‌ అయ్యింది.

కాగా ఇటీవల సినీనటుడు కిచ్చా సుదీప్‌ బహిరంగంగానే సీఎం బసవరాజ్‌ బొమ్మై, బీజేపీకి మద్దతు ప్రకటించారు. దీని తర్వాత సీఎం బసవరాజ బొమ్మైతో కాంతారావు నటుడు రిషబ్ శెట్టి కనిపించడం ఆసక్తిని రేకెత్తించింది. కిచ్చా సుదీప్ లాగా కాంతారావు కూడా బీజేపీ తరపున ప్రచారం చేస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement