రికార్డు కొట్టేసిన ‘వంటలక్క’, లక్కీ చాన్స్‌!

Record 134 Types of Food prepared in 30 Minutes - Sakshi

30 నిమిషాల్లో 134 రకాల వంటలు

తమిళనాడుకు చెందిన  మహిళ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌

సాక్షి, చెన్నై: త‌మిళ‌నాడులోని మదురై తిరుమంగళానికి చెందిన ఒక మహిళ 30 నిమిషాల్లో 134 రకాల ఆహార పదార్థాలను తయారు చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. తనకున్న ప్రత్యేక టాలెంట్‌తో ఆమె ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో రికార్డు  సొంతం చేసుకున్నారు. ఈ  అరగంట వ్యవధిలో 130 రకాల శాఖాహార, మాంసాహార  వంటకాలు ఉండటం విశేషం. 

చిన్న‌త‌నం నుంచే వంట‌ల‌పై ఆస‌క్తి  ఉన్న ఇందిరా రవిచంద్రన్‌ పాక కళలో కొత్త రికార్డు సృష్టించారు.అతి త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ ర‌కాల వంట‌లు చేసిన ఇందిరా ర‌విచంద్ర‌న్ పేరును ఇండియా రికార్డ్‌లో న‌మోదు చేశారు. చాలా రోజుల శిక్షణ తర్వాత, రికార్డు సృష్టించే ప్రయత్నంలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అడ్మినిస్ట్రేటర్ పర్యవేక్షణలో దోస, ఇడ్లీ, ఉతప్పం, ఆమ్లెట్, ఓఫయిల్, వడ, బజ్జీ, ఐస్ క్రీం, పుడ్డింగ్‌తోపాటు, చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ, ఫిష్ కర్రీ, వంటి అనేక రకాల మాంసాహార వంటకాలు ఉన్నాయి.  అంతేకాదు వివిధ రకాల రసాలు, కేకులు కూడా ఉన్నాయి. 

చదవండి : అలా నటిద్దామనుకున్నాడు.. కనీసం మంచం కూడా దిగ‌లేక పాట్లు!

అంతకుముందు ఎవరి పేరుతో ఉందీ రికార్డు
కాగా ఇంతకు ముందు, కేరళకు చెందిన 10 ఏళ్ల బాలుడు హాయెన్ ఒక గంటలో 122 వంటకాలను తయారు చేసాడు. తాజాగా రవిచంద్రన్ అధిగమించారు. దీంతో ఆమెపైప్రశంసల వెల్లువ కురుస్తోంది.  అంతేకాదు రాబోయే రోజుల్లో ఆమె రియాలిటీ వంట కార్యక్రమాల్లో  కూడా సందడి చేయనున్నారు.  అనేక ఛానెల్‌లు ఇప్పుడు ఆమెను వంట కార్యక్రమాలకు జడ్జ్‌గా రమ్మని ఆహ్వానిస్తున్నారట.

చదవండి : Kukatpally: కూకట్‌పల్లిలో ఉచిత ఫిజియోథెరపీ సేవలు, టైమింగ్స్‌ ఇవే..

చదవండి : న్యూలుక్‌లో అదరగొట్టిన నటి, పెళ్లి ప్రపోజల్‌కు రిప్లై

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top