మొదటి వారం రాజ్యసభ సమావేశాలు.. 52 శాతం సమయం వృథా

Rajya Sabha Time 52 Percant Lost To Disruptions In 1st Week Of Winter Session - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: శీతాలకాల పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రతిపక్ష ఎంపీలు పలు అంశాల మీద నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వర్షాకాల సమావేశాల్లో అనుచితంగా ప్రవర్తించిన 12 మంది ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. 12 మంది ఎంపీలను సస్పెండ్‌ చేసినందుకు ప్రతిపక్షాలు.. ఇది అప్రజాస్వామిక చర్య అని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. ఎంపీల సస్పెన్షన్‌ ఎత్తివేయటం పట్ల తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, కాని వారు సభకు క్షమాపణలు చెప్పాలని పార్లమెంట్‌ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లద్‌ జోషీ డిమాండ్‌ చేశారు.

చదవండి: గాంధీల దేశాన్ని గాడ్సే దేశంగా మారుస్తున్నారు: మెహబూబా ముఫ్తీ

ఈ నేపథ్యంలో మొదటి వారం రోజులు జరిగిన సమావేశాల్లో 52 శాతం సమయాన్ని రాజ్యసభ కోల్పోయింది. విపక్షాల నిరసన వల్ల సభా సమయం వృథా కావడంపై రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కొంతమంది ప్రతిపక్ష నాయకులు, కేంద్ర మంత్రులతో చర్చించారు. 12 మంది సభ్యుల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌పై ఇరు పక్షాలు చర్చించి ఒక అభిప్రాయానికి రావాలని తెలిపారు. మొదటి వారం రాజ్యసభ సమావేశాల్లో రెండు బిల్లులు ఆమోదం పొందాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top