పాక్‌ కోసం గూఢచర్యం.. ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు

Rajasthan Police Says Man Arrested For Allegedly Spying For Pakistan - Sakshi

జైపూర్‌: పాకిస్తాన్‌ కోసం గూఢచర్యం చేస్తున్న గజేంద్ర సింగ్‌(35) అనే ప్రభుత్వ ఉద్యోగిని అరెస్టు చేసినట్లు రాజస్తాన్‌ పోలీసులు గురువారం వెల్లడించారు. అతడు జోథ్‌పూర్‌లో మిలటరీ ఇంజనీరింగ్‌ సర్వీసు(ఎంఈఎస్‌)  చీఫ్‌ ఇంజనీర్‌ కార్యాలయంలో క్లాస్‌–4 ఉద్యోగిగా పని చేస్తున్నాడు.

వాట్సాప్‌ ద్వారా పాక్‌ మహిళతో సంబంధాలు కొనసాగిస్తున్నాడని, సైనిక రహస్యాలను ఆమెకు చేరవేస్తున్నాడని రాజస్తాన్‌ ఇంటెలిజెన్స్‌ డీజీపీ ఉమేశ్‌ మిశ్రా చెప్పారు. ఆఫీసులో జిరాక్స్‌ మిషన్‌ ఆపరేట్‌ చేస్తుంటాడని, కీలకమైన ఫైళ్లు, లెటర్లను సెల్‌ఫోన్‌లో ఫొటో తీసి, సదరు పాక్‌ మహిళకు వాట్సాప్‌లో పంపుతున్నట్లు తేలిందన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top