వీడియో: అన్నా చెల్లెలి అనురాగం.. చెల్లిపై ఉప్పోంగిన ఆప్యాయతతో..

Rahul Gandhi Kiss Priyanka Show His Affection Towards Sister - Sakshi

సృష్టిలో బంధాలు వేటికవే ప్రత్యేకం. అందునా అన్నాచెల్లెళ్ల అనుబంధం ఇంకా ప్రత్యేకం. ఒకవైపు అన్న రాజకీయాల్లో భాగంగా విరామం లేకుండా  భారత్‌ జోడో పాదయాత్ర చేపట్టి కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. మరోవైపు ఆ సోదరి పార్టీలో క్రియాశీలక వ్యవహారాల్లో పాలు పంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఇక ఈ ఇద్దరూ ఒకచోట చేరారు. అలిసి పోయిన అన్న రాహుల్‌ గాంధీతో సరదాగా సంభాషించింది సోదరి ప్రియాంక గాంధీ వాద్రా. ఉప్పోంగిన ఆప్యాయతతో సోదరి మెడ చుట్టూ చేతులేసి.. ప్రేమతో ఆమెను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టారాయన. 

తన జీవితంలో తన అన్న రాహుల్‌ బెస్ట్‌ ఫ్రెండ్‌ అని ఆమె గతంలోనే ప్రకటించుకున్నారు. ఇక రాహుల్‌ సైతం సోదరి విషయంలో అన్నగా ఏనాడూ తన బాధ్యతలను విస్మరించబోనని ప్రకటించుకున్నారు. ఈ అన్నాచెల్లెల అనుబంధం చిన్నప్పటి నుంచి ధృడంగా ఉంటోంది. యూపీలో భారత్‌ జోడో యాత్ర సందర్భంగా.. ఒకే వేదికపై వీళ్లిద్దరూ కూర్చని సరదాగా ముచ్చటించుకున్నారు. అన్న ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవడంతో ప్రియాంక నవ్వు ఆపుకోలేకపోయింది. ఆ ప్రత్యేక క్షణాలు కెమెరా కంటికి చిక్కాయి. 

వారిద్దరి ఆప్యాయత, అనురాగాన్ని తెలిపే ఈ సన్నివేశానికి సంబంధించిన దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి. ఎన్నికల నాటికి పార్టీని మళ్లీ ఉత్సాహ పరిచే లక్ష్యంతో కాంగ్రెస్‌ భారత్‌ జోడో యాత్ర చేపట్టింది. ప్రస్తుతం యూపీలో కొనసాగుతున్న ఈ యాత్ర.. నెలాఖరులో జమ్మూ కశ్మీర్‌లో చివరి దశకు చేరుకోనుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top