ఇంట్లో మకాం వేసిన కొండచిలువ.. ఇంటి యజమానిని చూసి..

Python Snake Hulchul In House Shivamogga Karnataka - Sakshi

శివమొగ్గ( బెంగళూరు): శివమొగ్గ తాలూకాలోని మత్తూరు వద్ద శ్రీకంఠపుర గ్రామంలో ఓ ఇంట్లో పై కప్పు దూలాల వద్ద ఒక పెద్ద కొండచిలువ మకాం వేసింది. ఇంటి యజమాని చూడడంతో ఒక్కసారి దాడి చేయబోయింది. తప్పించుకున్న అతను స్నేక్‌ కిరణ్‌కు సమాచారం ఇచ్చాడు. స్నేక్‌ కిరణ్‌ వచ్చి దానిని ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చాడు. దూరంగా అడవిలో వదిలిపెట్టారు. దగ్గరిలోని అటవీప్రాంతం నుంచి ఇంట్లోకి వచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు.  

మరో ఘటనలో..

సుందరమైన భాష కన్నడ 
బనశంకరి: భాషకు ఎలాంటి ద్వేషం లేదని, ప్రపంచంలో సుందరమైన భాష కన్నడ అని సాహితీవేత్త చెన్నబసస్ప అన్నారు. గురువారం బనశంకరిలోని శ్రీకృష్ణ పీయూ కళాశాలలో రాజ్యోత్సవాన్ని విద్యాసంస్థ చైర్మన్‌ డా. రుక్మాంగదనాయుడితో కలిసి చెన్నబసప్ప ప్రారంభించి మాట్లాడారు. రాజ్యోత్సవం నిత్యోత్సవం కావాలని అన్నారు. సంస్థ డైరెక్టర్‌ మనోహర్, ప్రిన్సిపాల్‌ డీఎం.గోపాల్, మల్లారి ఆర్‌.భట్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top