న్యూఢిల్లీ: ఈసారి రాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యుల ఓటు విలువ 700కు పడిపోనుంది. గతంలో ఇది 708గా ఉండేది. 83 స్థానాలున్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీ రద్దవడమే ఇందుకు కారణం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత లద్దాఖ్, జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూ కశ్మీర్ విభజన జరగడం తెలిసిందే. జమ్మూకశ్మీర్‌లో శాసనసభ ఉనికిలో లేకపోవడంతో దేశవ్యాప్తంగా ఎంపీల ఓటు విలువ తగ్గిపోతున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రపతి ఎన్నిక జూలైలో జరగనుంది. ఎంపీల ఓటు విలువ రాష్ట్రాల్లో శాసనసభ సభ్యుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది.   
చదవండి: తల్లిని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రేమతో ముద్దాడిన సీఎం

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
