విభజన తర్వాత తొలిసారి కశ్మీర్‌కు రాష్ట్రపతి | Sakshi
Sakshi News home page

నాలుగు రోజుల పాటు జమ్మూ కశ్మీర్‌లో బిజీబిజీ

Published Sat, Jul 24 2021 5:59 PM

President Ramnath Kovind 4 Days Tour In Jammu And Kashmir - Sakshi

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లో నాలుగు రోజుల పాటు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ పర్యటించనున్నారు.  రేపటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు జమ్ము కశ్మీర్‌లో త్రివిధ దళాల అధిపతిగా ఉన్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కశ్మీర్‌లో పర్యటిస్తారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి జమ్ముకశ్మీర్‌, లద్దాక్‌లో నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అందులో భాగంగా ఈ నెల 26వ తేదీన కార్గిల్ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులర్పించనున్నారు. అనంతరం 27వ తేదీన కశ్మీర్ విశ్వవిద్యాలయం 19వ స్నాతకోత్సవం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.

వాస్తవంగా 2019లోనే రాష్ట్రపతి పర్యటించాల్సి ఉండగా అప్పుడు వాతావరణం సహకరించక పర్యటన రద్దయ్యింది. ఇప్పుడు ఈసారి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జమ్మూ కశ్మీర్‌ విభజన అనంతరం రాష్ట్రపతి తొలిసారిగా పర్యటించనుండడం విశేషం. జమ్మూ, లఢక్‌గా 2019లో కేంద్ర ప్రభుత్వం విభజించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కశ్మీర్‌ లోయలో శాంతియుత వాతావరణం ఏర్పడింది.

Advertisement
Advertisement