breaking news
Jammu and Kashmir tour
-
విభజన తర్వాత తొలిసారి కశ్మీర్‌కు రాష్ట్రపతి
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో నాలుగు రోజుల పాటు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పర్యటించనున్నారు. రేపటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు జమ్ము కశ్మీర్లో త్రివిధ దళాల అధిపతిగా ఉన్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కశ్మీర్లో పర్యటిస్తారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి జమ్ముకశ్మీర్, లద్దాక్‌లో నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అందులో భాగంగా ఈ నెల 26వ తేదీన కార్గిల్ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులర్పించనున్నారు. అనంతరం 27వ తేదీన కశ్మీర్ విశ్వవిద్యాలయం 19వ స్నాతకోత్సవం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. వాస్తవంగా 2019లోనే రాష్ట్రపతి పర్యటించాల్సి ఉండగా అప్పుడు వాతావరణం సహకరించక పర్యటన రద్దయ్యింది. ఇప్పుడు ఈసారి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జమ్మూ కశ్మీర్ విభజన అనంతరం రాష్ట్రపతి తొలిసారిగా పర్యటించనుండడం విశేషం. జమ్మూ, లఢక్‌గా 2019లో కేంద్ర ప్రభుత్వం విభజించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కశ్మీర్ లోయలో శాంతియుత వాతావరణం ఏర్పడింది. -
జమ్ము కాశ్మీర్ చేరుకున్న ప్రధాని మోదీ
జమ్ము: జమ్ము కాశ్మీర్లో ఒక్క రోజు పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం జమ్ము ఎయిర్ పోర్టు చేరుకున్నారు. న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో జమ్మూ చేరుకున్న మోదీకి రాష్ట్ర గవర్నర్ ఎన్ ఎన్ వోహ్రా, ముఖ్యమంత్రి మహాబూబా ముఫ్తీ, డిప్యూటీ సీఎం నిర్మల్ సింగ్‌తోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారులు స్వాగతం తెలిపారు. అనంతరం ఎమ్ఐ 17 హెలికాప్టర్లో ఆయన కాట్రా పట్టణానికి బయలుదేరారు. ఆయన వెంటన గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం ఉన్నారు. ఈ రోజు జరగనున్న శ్రీ మాతా వైష్ణో దేవి యూనివర్సిటీ స్నాతకోత్సవంలో మోదీ ముఖ్య అతిథిగా పాల్లొనున్నారు. అలాగే 250 పడకల సూపర్ స్పెషాలటీ ఆసుపత్రిన్ని కూడా ఆయన ప్రారంభించనున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో మోదీ ప్రసంగించనున్నారు.