జైలుకు కాదు.. ఖైదీని షాపింగ్‌కు తీసుకెళ్లిన పోలీసులు.. వైరల్‌ వీడియో

Police Suspended For Taking Prisoners To Shopping Mall In Up Goes Viral - Sakshi

లక్నో: విధి నిర్వహణలో ఉన్న పోలీసులు ఓ ఖైదీని తమ వెంటబెట్టుకుని షాపింగ్‌ మాల్‌కు వెళ్లారు. జైలుకి తీసుకెళ్లాల్సిన వ్యక్తిని షాపింగ్‌కు తీసుకెళ్లిన పోలీసుల ఘనకార్యం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ షాకింగ్‌ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర పోలీసు శాఖ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఎస్‌ఐ పాటు కానిస్టేబుళ్లను ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రిషబ్ రాయ్ అనే వ్యక్తిని అక్రమ ఆయుధాల కేసులో గత జూన్‌లో అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు.  అయితే ఇటీవల తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, ఆసుప్రతి వెళ్లేందుకు కోర్టును అనుమతి కోరాడు రిషబ్‌ రాయ్‌. అతని దరఖాస్తుని పరిశీలించిన కోర్టు రిషబ్‌కు అనుమతిని కూడా మంజూరు చేసింది. ఈ క్రమంలో పోలీసు అధికారులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించడంతో పాటు వైద్య పరీక్షలు జరిపారు. అనంతరం వాళ్లు తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంది. అయితే నేరుగా జైలుకు కాకుండా దారిలో షాపింగ్ మాల్‌కు వెళ్లారు పోలీసులు. వెళ్తూ తమతో పాటు ఆ ఖైదీని కూడా మాల్‌ లోపలికి తీసుకెళ్లారు. ఇదంతా ఆ పరిసరాల్లోని సీసీటీవీ పుటేజ్‌లో రికార్డ్‌ కాగా.. ఈ వీడియోని ఓ ట్విటర్‌ యూజర్‌ షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్‌గా మారింది.

చదవండి   Viral Video: ఇంత బలుపేంటి భయ్యా.. దెబ్బకు తిక్క కుదిరిందిగా..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top