మోదీకి బర్త్‌డే గిఫ్ట్‌గా ఇవి కావాలట! | PM Narendra Modi wants as his birthday gift | Sakshi
Sakshi News home page

మోదీకి బర్త్‌డే గిఫ్ట్‌గా ఇవి కావాలట!

Sep 19 2020 6:17 AM | Updated on Sep 19 2020 6:17 AM

PM Narendra Modi wants as his birthday gift - Sakshi

న్యూఢిల్లీ: ప్రజలంతా మాస్కు ధరించడం.. భౌతిక దూరం పాటించడం.. ఆరోగ్యవంతమైన భూగోళం కోసం అందరూ కృషి చేయడం..ఇవే ప్రధాని మోదీ తన పుట్టిన రోజు కానుకలుగా కోరుకున్నవి. ప్రధాని మోదీ గురువారం 70వ జన్మదిన వేడుకలు జరుపుకున్న విషయం తెలిసిందే. ఆయనకు దేశ, విదేశాల నుంచి ఎందరో శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్‌లో ప్రధాని వాటికి బదులిచ్చారు.

ఈ సందర్భంగా ప్రధాని ట్విట్టర్‌లో..‘పుట్టిన రోజు కానుకగా ఏం కావాలని ఎందరో నన్ను అడిగారు. ఇదే నా సమాధానం. మాస్కును సరైన రీతిలో ధరించడం కొనసాగించండి. రెండు గజాల భౌతిక దూరం పాటించండి. గుంపులుగా సంచరించకండి. రోగ నిరోధకత పెంచుకోండి. మన భూగ్రహాన్ని ఆరోగ్యవంతంగా చేద్దాం.. వీటినే పుట్టిన రోజు కానుకలుగా ఇవ్వండి’ అని ప్రజలను ఆయన కోరారు.

ప్రధానికి ట్రంప్‌ బర్త్‌డే విషెస్‌
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌  ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.  ‘భారత ప్రధాని నరేంద్ర మోదీకి 70వ జన్మదిన శుభాకాంక్షలు. గొప్పనేత, విశ్వాసపాత్రుడైన మోదీ ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలి’అని ట్విట్టర్‌లో ట్రంప్‌ ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement