6జీ.. భారత ఆత్మవిశ్వాస ప్రతీక: మోదీ

PM Narendra Modi reveals Bharat 6G Vision for India - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో 5జీ సాంకేతికత అందుబాటులోకి వచ్చిన కేవలం ఆరు నెలల్లోనే 6జీ టెక్నాలజీపై పరిశోధనలు చేసే స్థాయికి భారత్‌ ఎదిగిందని ప్రధాని మోదీ ప్రకటించారు. ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ టెలీకమ్యూనికేషన్‌ సంఘం(ఐటీయూ) ప్రాంతీయ కార్యాలయం, ఇన్నోవేషన్‌ సెంటర్‌ను బుధవారం ఢిల్లీలో ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ప్రసంగించారు.

‘ దేశంలోకి 5జీ సేవలు మొదలైన 6 నెలల్లోనే 6జీ టెక్నాలజీపై పరిశోధన మొదలవుతోంది. ఇది భారత ఆత్మవిశ్వాసానికి దర్పణం పడుతోంది. 4జీ కంటే ముందు టెలికం సాంకేతికతలో భారత్‌ కేవలం ఒక యూజర్‌గా ఉండేది. కానీ ఇప్పుడు భారీ టెలికం టెక్నాలజీని ఎగుమతి చేసే దిశగా అడుగులు వేస్తోంది. దేశీయంగా అభివృద్ధిని సాధించిన టెక్నాలజీ వైపు ప్రపంచం దృష్టి సారించింది.

ఇది భారత సాంకేతిక దశాబ్దం
‘సమ్మిళిత సాంకేతికత వల్లే డిజిటల్‌ చెల్లింపులు, ప్రత్యక్ష నగదు బదిలీ, జన్‌ధన్, ఆధార్, బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు సాధ్యమయ్యాయి. టెలికం టెక్నాలజీ భారత్‌లో కేవలం శక్తి మాధ్యమం మాత్రమేకాదు సాధికారతకు సోపానం. ఇంటర్నెట్‌ యూజర్ల సంఖ్య 85 కోట్లకు పెరిగింది. దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగంలో మొత్తంగా 25 లక్షల కి.మీ.ల ఆప్టికల్‌ ఫైబర్‌ వేశాం. త్వరలో వంద 5జీ ల్యాబ్‌లు ఏర్పాటుచేస్తాం. దేశీయ అవసరాల తీర్చేలా 5జీ అప్లికేషన్లను ఇవి అభివృద్ధిచేస్తాయి. దేశంలో 5జీ సేవలు మొదలైన 120 రోజుల్లోనే 125 నగరాలకు విస్తరింపజేశాం. ఈ దశాబ్దం భారత సాంకేతికదశాబ్దం(టెక్‌ఏడ్‌)’ అని మోదీ అభివర్ణించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top