breaking news
	
		
	
  6G Technology
- 
      
                   
                                                       6జీ కనెక్టివిటీ టెస్ట్ విజయవంతంయూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) 6జీ కనెక్టివిటీ పరీక్షల్లో రికార్డు స్థాయిలో 145 గిగాబిట్స్ పర్ సెకన్ (Gbps) ఇంటర్నెట్ వేగాన్ని సాధించినట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వెలిశాయి. ఈ టెక్నాలజీ టెలికమ్యూనికేషన్స్ రంగంలో కీలక మైలురాయిగా నిలవనుంది. కనెక్టివిటీలో అసాధారణ వేగం, అతి తక్కువ జాప్యం (Ultra low Latency) వంటి అంశాలు భవిష్యత్ డిజిటల్ ప్రపంచానికి సరికొత్త మార్గాన్ని సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా 6జీ టెక్నాలజీ అభివృద్ధిలో చురుకుగా ముందుకు సాగుతోంది.భారత్‌లో పరిశోధనలుభారతదేశం కేవలం 6జీ టెక్నాలజీని స్వీకరించే దేశంగా కాకుండా దాని రూపకల్పన, అభివృద్ధి, ప్రమాణాలను నిర్దేశించడంలో ప్రపంచానికి నాయకత్వం వహించే దేశంగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దాంతో భారత్ 6జీ విజన్‌ను ప్రారంభించింది. 2023 మార్చి 23న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్ 6జీ విజన్ పత్రాన్ని ఆవిష్కరించారు. 2030 నాటికి ఈ టెక్నాలజీలను రూపొందించి దేశీయంగా అమలు చేయాలనేది దీని ముఖ్య ఉద్దేశం. దేశీయ పరిశ్రమ, విద్యాసంస్థలు, జాతీయ పరిశోధనా సంస్థలు, ప్రమాణాల సంస్థల సహకారంతో 2023 జులై 3న భారత్ 6జీ కూటమిని ప్రారంభించారు. భారత్ 6జీ విజన్‌కు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి ఇది ఒక వేదికగా పనిచేస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాల చర్చల్లో చురుకుగా పాల్గొనడం, పరిశోధనలకు నిధులు సమకూర్చడం దీని విధుల్లో భాగం.టెలికాం టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ (TTDF) పథకం కింద 6జీ టెక్నాలజీకి సంబంధించిన 104కి పైగా పరిశోధన ప్రాజెక్టులకు రూ.275.88 కోట్లకు పైగా నిధులు మంజూరు చేశారు. దేశంలోని కొన్ని ప్రముఖ విద్యాసంస్థల్లో 6జీకి సిద్ధంగా ఉండే పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి 100 5జీ ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. ఇవి భవిష్యత్తులో 6జీ పరిశోధనలకు వేదికగా మారుతాయి.🚨 The UAE has successfully completed its first 6G testing, achieving a record speed of 145 Gbps. pic.twitter.com/uhtmRk6Zrv— Indian Tech & Infra (@IndianTechGuide) October 15, 2025ఇండియాలో 6జీ వస్తే చోటు చేసుకోనున్న పరిణామాలుఇండియాలో ‘భారత్ 6జీ విజన్’ కింద 6జీ సాంకేతికతను 2030 నాటికి అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత్ వంటి అతిపెద్ద జనాభా గల దేశంలో 6జీ రాక వల్ల భారీ పరివర్తనలు సంభవిస్తాయి.డిజిటల్ విప్లవం: 6జీ గ్రామీణ, సరైన కనెక్టివిటీలేని ప్రాంతాలకు సైతం మెరుగైన కమ్యునికేషన్ అందిస్తుంది.ఆరోగ్య సంరక్షణ (Healthcare): రియల్-టైమ్ టెలిసర్జరీలు, రిమోట్ పేషెంట్ మానిటరింగ్, ఏఐ-ఆధారిత డయాగ్నోస్టిక్స్ వంటివి విస్తృతం అవుతాయి. అంబులెన్స్‌లు, ఆసుపత్రులు సహా అన్ని వైద్య మౌలిక సదుపాయాలు ఏఐ ఆధారితంగా అనుసంధానమవుతాయి.విద్య (Education): విద్యార్థులు వర్చువల్ టీచర్లతో, క్లాస్‌మేట్స్‌తో ఇంటరాక్ట్ అవ్వడం, ఎక్కడైనా, ఎప్పుడైనా నాణ్యమైన విద్యా వనరులను పొందేందుకు 6జీ ఉపయోగపడుతుంది.పరిశ్రమల ఆటోమేషన్ (Industrial Automation): స్మార్ట్ ఫ్యాక్టరీల్లో యంత్రాల రియల్-టైమ్ రిమోట్ కంట్రోల్, ఏఐ-ఆధారిత ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్, రోబోటిక్స్ వంటివి ఉత్పత్తి సామర్థ్యాన్ని, నాణ్యతను అసాధారణంగా పెంచుతాయి.రవాణా (Transportation): అర్బన్ ఎయిర్ మొబిలిటీ (UAM), అటానమస్ వాహనాల (Self-Driving Cars) కోసం 6జీ కమ్యూనికేషన్ అత్యంత అవసరం. ట్రాఫిక్ నిర్వహణ, లాజిస్టిక్స్‌లో డ్రోన్ ఫ్లీట్ల వాడకం పెరుగుతుంది.రక్షణ రంగం (Defence): కమాండర్లకు వేగవంతమైన, రియల్-టైమ్ క్షేత్ర సమాచారం అందించేందుకు వీలవుతుంది. సురక్షితమైన కమ్యూనికేషన్, డ్రోన్లు, హైపర్సోనిక్ ఆయుధాలకు కమ్యూనికేషన్ లింక్‌లు అందించడం ద్వారా రక్షణ సామర్థ్యం పెరుగుతుంది.ఈ టెక్నాలజీ వివిధ దేశాల పరిశోధనలుప్రస్తుతానికి ప్రపంచంలో ఏ దేశంలోనూ పూర్తిగా వాణిజ్యపరమైన (Commercial) 6జీ నెట్వర్క్ వాడుకలో లేదు. 6జీ సాంకేతికతను 2030 నాటికి వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుని అభివృద్ధి, పరిశోధన (R&D)లో వివిధ దేశాలు, టెక్ కంపెనీలు చురుగ్గా పోటీ పడుతున్నాయి.6జీ అభివృద్ధిలో ముందున్న దేశాలుచైనా: 6జీ పరిశోధన, అభివృద్ధిలో ముందంజలో ఉంది. చైనా భారీగా పెట్టుబడులు పెడుతోంది. టెరాహెర్ట్జ్ సిగ్నల్ ప్రసారాన్ని పరీక్షించేందుకు ఇప్పటికే ప్రయోగాత్మక ఉపగ్రహాన్ని (Experimental Satellite) ప్రయోగించింది. 6జీ పేటెంట్ ఫైలింగ్స్‌లో చైనా అగ్రస్థానంలో ఉంది.దక్షిణ కొరియా: 5జీని వేగంగా అమలు చేసిన దక్షిణ కొరియా 6జీలో కూడా బలమైన పోటీదారుగా ఉంది. శాంసంగ్, ఎల్జీ వంటి దిగ్గజ సంస్థలు 6జీ R&D కేంద్రాలను ఏర్పాటు చేశాయి. 2028 నాటికి 6జీని వాణిజ్యపరంగా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.జపాన్: టెక్నాలజీ అభివృద్ధిలో తన నైపుణ్యాన్ని కొనసాగిస్తూ 2030 నాటికి 6జీని ఆవిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.యునైటెడ్ స్టేట్స్, యూరప్: యూఎస్ ‘నెక్స్ట్ G అలయన్స్’ ద్వారా ఈయూ ఆధ్వర్యంలో ‘హెక్సా-ఎక్స్’ (Hexa-X) వంటి చొరవలతో 6జీ పరిశోధనలో చురుకుగా పాల్గొంటున్నాయి.ఇదీ చదవండి: ఓ మై గోల్డ్!
- 
      
                   
                                                       6జీ వ్యవస్థపై ఢిల్లీ డిక్లరేషన్న్యూఢిల్లీ: 6జీ వ్యవస్థను సురక్షితంగా, స్వేచ్ఛగా, సమ్మిళితంగా ఉంచేందుకు ఉపయోగపడే సూత్రాలకు సంబంధించిన ఢిల్లీ డిక్లరేషన్‌పై భారత్ 6జీ అలయెన్స్‌తో పాటు తొమ్మిది అంతర్జాతీయ సంస్థలు సంతకాలు చేశాయి. నెక్ట్స్జీ అలయెన్స్, 6జీ బ్రెజిల్, జపాన్‌కి చెందిన ఎక్స్‌జీ మొబైల్ ప్రమోషన్ ఫోరం మొదలైనవి వీటిలో ఉన్నాయి. ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో భాగంగా నిర్వహించిన ఇంటర్నేషనల్ భారత్ 6జీ సింపోజియంలో దీన్ని ప్రకటించారు. డిజిటల్ అంతరాలను భర్తీ చేసే విధంగా, పట్టణ, గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోనూ విశ్వసనీయమైన.. అఫోర్డబుల్ కవరేజీని అందించే విధంగా 6జీ ఉండాలని సంయుక్త ప్రకటనలో తెలిపాయి. స్వేచ్ఛాయుతమైన, పారదర్శకమైన, నిష్పాక్షికమైన వాతావరణంలో ప్రపంచ దేశాల, ప్రాంతాల, భాగస్వాముల సమాన ప్రాతినిధ్యంతో ప్రమాణాలను రూపొందించాల్సి ఉంటుందని వివరించాయి. పరిశోధనలు, అభివృద్ధి కార్యకలాపాలు, టెస్ట్‌బెడ్స్, పైలట్ ప్రాజెక్టుల విషయంలో కలిసి పనిచేయాలని పేర్కొన్నాయి. విశ్వసనీయమైన టెక్నాలజీలను, ఓపెన్ ప్రమాణాలను, సుస్థిర నెట్‌వర్క్‌లను సమిష్టిగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యతను ఈ డిక్లరేషన్ సూచిస్తోందని భారత్ 6జీ అలయెన్స్ డైరెక్టర్ జనరల్ ఆర్కే పాఠక్ తెలిపారు. 6జీ ట్రయల్స్ 2028లో ప్రారంభమవుతాయని, వాణిజ్యపరంగా వినియోగంలోకి తేవడానికి మరికొన్నాళ్లు పడుతుందనే అంచనాలు నెలకొన్నాయి. ఏఐతో కస్టమర్లకు మెరుగైన సరీ్వసులు .. టెలికం సేవలు 5జీ నుంచి 6జీకి మారుతున్న తరుణంలో సమస్యలేవైనా వస్తే టెలికం నెట్వర్క్ దానంతటదే పరిష్కరించుకునేలా, కస్టమర్లకు మరింత మెరుగైన సరీ్వసులను అందించేలా కృత్రిమ మేథ (ఏఐ) ఉపయోగపడుతుందని ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో పాల్గొన్న సందర్భంగా కేంద్ర టెలికం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ తెలిపారు. ఏఐని మంచికే ఉపయోగిస్తున్నప్పటికీ దుర్వినియోగమయ్యే రిసు్కలు కూడా ఉన్నందున, ఈ టెక్నాలజీ వినియోగంపై అప్రమత్తత వహించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ‘ఏఐ ఆధారిత టూల్స్ ఏ విధంగా డీప్ ఫేక్స్, వాయిస్ క్లోనింగ్, ఆర్థిక మోసాలు చేసేందుకు దుర్వినియోగమవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి మనం టెలికం నెట్‌వర్క్‌లో ఏఐ విషయంలో చాలా అప్రమత్తంగా కూడా ఉండాలి‘ అని మిట్టల్ వివరించారు. టెలికం శాఖ రూపొందించిన ఏఐ ఆధారిత ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ టూల్‌ని ఉపయోగించి 48 లక్షల అనుమాస్పద లావాదేవీలను బ్లాక్ చేసినట్లు, రూ. 200 కోట్ల నష్టాన్ని నివారించినట్లు పేమెంట్ యాప్స్ అయిన ఫోన్‌పే, పేటీఎం ప్రకటించాయి.
- 
      
                   
                                                       6జీ అభివృద్ధిలో భారత్ పాత్ర కీలకంభారతదేశం 6జీ టెక్నాలజీ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో, ప్రపంచవ్యాప్త భాగస్వామ్యాలను ఏర్పాటు చేయడంలో చురుకుగా ముందుకు సాగుతోంది. విశ్వసనీయ భాగస్వామిగా భారత్‌కు ఉన్న అంతర్జాతీయ గుర్తింపు 6జీ వ్యవస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు గట్టిగా నమ్ముతున్నారు. ఈ నెల 8 నుంచి 11 వరకు న్యూఢిల్లీలో నిర్వహించే ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2025లో ఈమేరకు చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో 6జీ టెక్నాలజీ, దాని స్పెక్ట్రమ్ పరిమితులు, భారత్‌పై ప్రభావం, ప్రపంచవ్యాప్త అభివృద్ధి గురించి వివరంగా తెలుసుకుందాం.6జీ టెక్నాలజీ అంటే ఏమిటి?6జీ అనేది వైర్లెస్ కమ్యూనికేషన్ ఆరో తరం సాంకేతికత. ఇది ప్రస్తుతం ఉన్న 5జీ నెట్‌వర్క్‌ల సామర్థ్యాన్ని, వేగాన్ని, విశ్వసనీయతను గణనీయంగా పెంచుతుంది. 6జీ సాంకేతికత ప్రధాన లక్ష్యం అల్ట్రా-హైస్పీడ్, అల్ట్రా-లో లేటెన్సీ (చాలా తక్కువ జాప్యం), భారీ కనెక్టివిటీతో కూడిన కమ్యునికేషన్‌ను సృష్టించడం.6జీ ముఖ్య లక్షణాలుఅత్యధిక వేగం (Ultra-High Speed)6జీ నెట్‌వర్క్‌లు సెకనుకు 1 టెరాబిట్ (Tbps) లేదా అంతకంటే ఎక్కువ గరిష్ట డేటా ట్రాన్స్ఫర్ రేటును అందించగలవని అంచనా. ఇది 5జీ కంటే 100 రెట్లు ఎక్కువగా ఉంటుందని కొందరు చెబుతున్నారు.చాలా తక్కువ జాప్యం (Ultra-Low Latency)డేటా బదిలీకి పట్టే సమయం 100 మైక్రోసెకన్ల కంటే తక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ అతి తక్కువ జాప్యం వల్ల రియల్-టైమ్ ఆపరేషన్స్, క్లిష్టమైన అప్లికేషన్లు మరింత సులభతరం అవుతాయి.విస్తృత కనెక్టివిటీ (Massive Connectivity)ఒక చదరపు కిలోమీటరుకు కోట్లాది డివైజ్‌లను కనెక్ట్ చేసే సామర్థ్యం 6జీకి ఉంటుంది. ఇది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), స్మార్ట్ సిటీస్ విస్తరణకు ఎంతో తోడ్పడుతుంది.ఏఐ ఏకీకరణ (AI Integration)ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML) నెట్‌వర్క్‌తో పూర్తిగా కలిసిపోయి ఆటోమేటెడ్, సమర్థవంతమైన నెట్వర్క్ నిర్వహణను అందిస్తుంది.హోలోగ్రాఫిక్ కమ్యూనికేషన్6జీ ద్వారా త్రీ-డైమెన్షనల్ (3D) హోలోగ్రాఫిక్ కమ్యూనికేషన్, వర్చువల్ రియాలిటీ (VR), ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) వంటి ఇమ్మర్సివ్ అనుభవాలు సాధ్యమవుతాయి.6జీకి కావాల్సిన స్పెక్ట్రమ్ పరిమితులు6జీ నెట్‌వర్క్‌లకు కావాల్సిన అత్యంత వేగం, సామర్థ్యం కోసం ప్రస్తుతం వాడుకలో ఉన్న ఫ్రీక్వెన్సీ బ్యాండ్లతో పాటు కొత్త, విశాలమైన స్పెక్ట్రమ్ బ్యాండ్లు అవసరం. 6జీ కోసం దృష్టి సారిస్తున్న ప్రధాన స్పెక్ట్రమ్ పరిమితులు కింది విధంగా ఉంటాయి.సబ్-టెరాహెర్ట్జ్ (Sub-Terahertz - Sub-THz) బ్యాండ్ఇది 90 GHz (గిగాహెర్ట్జ్) నుంచి 3 THz (టెరాహెర్ట్జ్) మధ్య ఉండే ఫ్రీక్వెన్సీ పరిధి. ఈ బ్యాండ్ చాలా విశాలమైన బ్యాండ్‌విడ్త్‌ను అందిస్తుంది. దీని ద్వారానే 1 Tbps వేగం సాధ్యమవుతుందని అంచనా. అయితే ఈ ఫ్రీక్వెన్సీల్లో సిగ్నల్స్ పరిధి తక్కువగా ఉండి భవనాలు వంటి అడ్డంకులను దాటడం కష్టం. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.సెంటీమీటర్ వేవ్ (cmWave) బ్యాండ్ప్రస్తుతం 5జీకి వాడుతున్న మిడ్-బ్యాండ్ ఫ్రీక్వెన్సీలకు దగ్గరగా ఉండే 7 GHz నుంచి 15 GHz మధ్య ఉన్న ఈ బ్యాండ్‌ను ‘6జీ గోల్డెన్ బ్యాండ్’గా పరిగణిస్తున్నారు. ఇది మంచి కవరేజ్, సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 6జీ కోసం 1.5-2 GHz మిడ్-బ్యాండ్ స్పెక్ట్రమ్ అవసరమని పరిశోధకులు భావిస్తున్నారు.ఇండియాలో 6జీ వస్తే చోటు చేసుకోనున్న పరిణామాలుఇండియాలో ‘భారత్ 6జీ విజన్’ కింద 6జీ సాంకేతికతను 2030 నాటికి అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత్ వంటి అతిపెద్ద జనాభా గల దేశంలో 6జీ రాక వల్ల భారీ పరివర్తనలు సంభవిస్తాయి.డిజిటల్ విప్లవం: 6జీ గ్రామీణ, సరైన కనెక్టివిటీలేని ప్రాంతాలకు సైతం మెరుగైన కమ్యునికేషన్ అందిస్తుంది.ఆరోగ్య సంరక్షణ (Healthcare): రియల్-టైమ్ టెలిసర్జరీలు, రిమోట్ పేషెంట్ మానిటరింగ్, ఏఐ-ఆధారిత డయాగ్నోస్టిక్స్ వంటివి విస్తృతం అవుతాయి. అంబులెన్స్‌లు, ఆసుపత్రులు సహా అన్ని వైద్య మౌలిక సదుపాయాలు ఏఐ ఆధారితంగా అనుసంధానమవుతాయి.విద్య (Education): విద్యార్థులు వర్చువల్ టీచర్లతో, క్లాస్‌మేట్స్‌తో ఇంటరాక్ట్ అవ్వడం, ఎక్కడైనా, ఎప్పుడైనా నాణ్యమైన విద్యా వనరులను పొందేందుకు 6జీ ఉపయోగపడుతుంది.పరిశ్రమల ఆటోమేషన్ (Industrial Automation): స్మార్ట్ ఫ్యాక్టరీల్లో యంత్రాల రియల్-టైమ్ రిమోట్ కంట్రోల్, ఏఐ-ఆధారిత ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్, రోబోటిక్స్ వంటివి ఉత్పత్తి సామర్థ్యాన్ని, నాణ్యతను అసాధారణంగా పెంచుతాయి.రవాణా (Transportation): అర్బన్ ఎయిర్ మొబిలిటీ (UAM), అటానమస్ వాహనాల (Self-Driving Cars) కోసం 6జీ కమ్యూనికేషన్ అత్యంత అవసరం. ట్రాఫిక్ నిర్వహణ, లాజిస్టిక్స్‌లో డ్రోన్ ఫ్లీట్ల వాడకం పెరుగుతుంది.రక్షణ రంగం (Defence): కమాండర్లకు వేగవంతమైన, రియల్-టైమ్ క్షేత్ర సమాచారం అందించేందుకు వీలవుతుంది. సురక్షితమైన కమ్యూనికేషన్, డ్రోన్లు, హైపర్సోనిక్ ఆయుధాలకు కమ్యూనికేషన్ లింక్‌లు అందించడం ద్వారా రక్షణ సామర్థ్యం పెరుగుతుంది.ఈ టెక్నాలజీ వివిధ దేశాల పరిశోధనలుప్రస్తుతానికి ప్రపంచంలో ఏ దేశంలోనూ పూర్తిగా వాణిజ్యపరమైన (Commercial) 6జీ నెట్వర్క్ వాడుకలో లేదు. 6జీ సాంకేతికతను 2030 నాటికి వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుని అభివృద్ధి, పరిశోధన (R&D)లో వివిధ దేశాలు, టెక్ కంపెనీలు చురుగ్గా పోటీ పడుతున్నాయి.6జీ అభివృద్ధిలో ముందున్న దేశాలుచైనా: 6జీ పరిశోధన, అభివృద్ధిలో ముందంజలో ఉంది. చైనా భారీగా పెట్టుబడులు పెడుతోంది. టెరాహెర్ట్జ్ సిగ్నల్ ప్రసారాన్ని పరీక్షించేందుకు ఇప్పటికే ప్రయోగాత్మక ఉపగ్రహాన్ని (Experimental Satellite) ప్రయోగించింది. 6జీ పేటెంట్ ఫైలింగ్స్‌లో చైనా అగ్రస్థానంలో ఉంది.దక్షిణ కొరియా: 5జీని వేగంగా అమలు చేసిన దక్షిణ కొరియా 6జీలో కూడా బలమైన పోటీదారుగా ఉంది. శాంసంగ్, ఎల్జీ వంటి దిగ్గజ సంస్థలు 6జీ R&D కేంద్రాలను ఏర్పాటు చేశాయి. 2028 నాటికి 6జీని వాణిజ్యపరంగా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.జపాన్: టెక్నాలజీ అభివృద్ధిలో తన నైపుణ్యాన్ని కొనసాగిస్తూ 2030 నాటికి 6జీని ఆవిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.యునైటెడ్ స్టేట్స్, యూరప్: యూఎస్ ‘నెక్స్ట్ G అలయన్స్’ ద్వారా ఈయూ ఆధ్వర్యంలో ‘హెక్సా-ఎక్స్’ (Hexa-X) వంటి చొరవలతో 6జీ పరిశోధనలో చురుకుగా పాల్గొంటున్నాయి.ప్రస్తుత డిజిటల్ అభివృద్ధిపైన తెలిపిన దేశాలు ఇంకా 6జీని వాడకపోయినా 5జీని వేగంగా, విస్తృతంగా అమలు చేస్తున్నాయి. ఉదాహరణకు దక్షిణ కొరియా వంటి దేశాలు ప్రపంచంలోనే అత్యధిక 5జీ కవరేజ్, వేగాన్ని కలిగి ఉన్నాయి. ఇది ఇప్పటికే రిమోట్ సర్జరీ, ఏఐ-ఆధారిత స్మార్ట్ ఫ్యాక్టరీలు వంటి డిజిటల్ ఆవిష్కరణలకు మార్గం సుగమం చేస్తోంది. 6జీ రాకతో ఈ డిజిటల్ అభివృద్ధి మరింత వేగవంతమై ఊహించని పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.చివరగా..6జీ టెక్నాలజీ అనేది కేవలం మొబైల్ స్పీడ్‌ను పెంచేది మాత్రమే కాదు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీ, హోలోగ్రాఫిక్స్, అటానమస్ సిస్టమ్స్ వంటి వాటిని అనుసంధానించే ఒక కొత్త డిజిటల్ ఫ్రేమ్‌వర్క్. భారత్ తన ‘భారత్ 6జీ విజన్’తో ఈ రేసులో దూసుకుపోతోంది. విశ్వసనీయ భాగస్వామిగా ఉన్న భారత్ అంతర్జాతీయ సహకారంతో 6జీ సాంకేతికతను అభివృద్ధి చేయడంలో విజయం సాధిస్తే అది దేశ సామాజిక-ఆర్థిక పురోగతిని, ప్రపంచ టెక్నాలజీ రంగంలో దాని నాయకత్వాన్ని బలోపేతం చేస్తుంది. ఈ ఆవిష్కరణతో ప్రజల జీవన నాణ్యత మెరుగుపడటంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు వస్తుందని చెప్పవచ్చు.ఇదీ చదవండి: సోషల్ మీడియాలో మోసపూరిత కంటెంట్ తొలగింపు
- 
      
                   
                                                       ఇక ఫోకస్ అంతా 6జీపైనే.. 8 నుంచి ఇండియా మొబైల్ కాంగ్రెస్ఈ నెల 8 నుంచి 11 వరకు న్యూఢిల్లీలో నిర్వహించే ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2025 సదస్సులో ప్రధానంగా 6జీ వ్యవస్థను అభివృద్ధి చేయడం, భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకోవడంపై దృష్టి పెట్టనున్నారు. విశ్వసనీయ భాగస్వామిగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన భారత్, 6జీ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించగలదని డిజిటల్ టెక్నాలజీ ప్లాట్‌ఫాం ఐఎంసీ సీఈవో పి. రామకృష్ణ తెలిపారు.’6జీ వ్యవస్థకు ప్రధానమైన అంశాలను అనుసంధానం చేయగలిగే కీలక ప్లాట్‌ఫాంగా ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఎదుగుతోంది. ఇందులో భారత్‌తో పాటు యూరప్, బ్రిటన్, అమెరికా, జపాన్, దక్షిణ కొరియా తదితర దేశాల నుంచి పరిశ్రమకు చెందిన సీనియర్ నేతలు, నిపుణులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు’ అని ఆయన పేర్కొన్నారు. 6జీ సిపోజియంలో టెక్నాలజీ దిగ్గజాలతో పాటు ఐఐటీ, అంతర్జాతీయ యూనివర్సిటీల్లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల నుంచి విద్యావేత్తలు పాల్గోనున్నారు.6జీకి సంబంధించిన టెక్నాలజీలు, కృత్రిమ మేథ నెట్‌వర్క్‌లు, స్పెక్ట్రం క్రమబద్ధీకరణ తదితర అంశాలపై అత్యున్నత స్థాయిలో చర్చలు జరపనున్నట్లు రామకృష్ణ చెప్పారు. 7,000 మంది పైగా గ్లోబల్ ప్రతినిధులు, 800 మంది వక్తలు, 150 దేశాల నుంచి 400 మంది ఎగ్జిబిటర్లు ఇందులో పాల్గొంటారని అంచనా. 6జీ గ్లోబల్ రేసుకు భారత్ సారథ్యం వహించనుందని సెల్యులార్ ఆపరేటర్స్ సమాఖ్య సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచ్చర్ తెలిపారు.ఏఐ, జెన్ఏఐ టెక్నాలజీల్లో భారతీయ డిజిటల్ ఆవిష్కరణలు, దేశీయంగా టెలికం రంగాన్ని సరికొత్తగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. 5జీ విస్తరణ, 6జీ సన్నద్ధతకు 6 గిగాహెట్జ్ బ్యాండ్‌ను సమర్ధవంతంగా కేటాయించడం కీలకంగా ఉంటుందని వివరించారు.
- 
      
                   
                                                       6జీ పేటెంట్లలో భారత్ టాప్6న్యూఢిల్లీ: 6జీ పేటెంట్ ఫైలింగ్స్‌కి సంబంధించి అంతర్జాతీయంగా టాప్ ఆరు దేశాల్లో భారత్ కూడా ఉన్నట్లు కేంద్ర టెలికం శాఖ సహాయ మంత్రి చంద్రశేఖర్ పెమ్మసాని తెలిపారు. దేశీయంగా 111 రీసెర్చ్ ప్రాజెక్టులకు రూ. 300 కోట్లకు పైగా నిధులు మంజూరైనట్లు ఆయన వివరించారు. 6జీ సేవలు 5జీ కన్నా 100 రెట్లు వేగంగా ఉంటాయన్నారు.టెక్నాలజీలో అంతర్జాతీయంగా భారత్ అగ్రగామిగా ఎదిగే క్రమంలో పలు దశాబ్దాల పాటు ఈ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. దీనితో కొత్త పరిశ్రమలు వస్తాయని, ప్రస్తుతమున్న వాటిలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయని భారత్ 6జీ 2025 సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు.ఫలితంగా 2035 నాటికి భారత ఎకానమీ 1 లక్ష కోట్ల డాలర్ల మేర పెరుగుతుందని చంద్రశేఖర్ చెప్పారు. దేశీయంగా 6జీని అభివృద్ధి చేసుకోవడం వల్ల మన కమ్యూనికేషన్స్ వ్యవస్థ సురక్షితంగా ఉంటుందని పేర్కొన్నారు.
- 
      
                   
                                                       భారత్‌లో 5జీ జోరు.. 6జీ సేవల ప్రారంభం అప్పుడే..టెలికం రంగంలో భారత్‌లో 5జీ కొత్త పుంతలు తొక్కుతోంది. 2030 నాటికి 5జీ చందాదార్ల సంఖ్య మూడురెట్లు దూసుకెళ్లి 97 కోట్లకు చేరుతుందని నెట్వర్కింగ్, టెలికమ్యూనికేషన్స్ దిగ్గజం ఎరిక్సన్ రూపొందించిన కంజ్యూమర్ల్యాబ్ రిసర్చ్ నివేదిక వెల్లడించింది. ఆ సమయానికి మొత్తం మొబైల్ కస్టమర్లలో 5జీ యూజర్ల వాటా ఏకంగా 74 శాతానికి ఎగబాకుతుందని తెలిపింది.ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్ ప్రకారం 2024 చివరి నాటికి భారత్‌లో 5జీ సబ్స్క్రిప్షన్లు 27 కోట్లు నమోదు కావొచ్చని అంచనా. ఇది దేశంలోని మొత్తం మొబైల్ కస్టమర్లలో 23 శాతం. ఇక అంతర్జాతీయంగా 5జీ చందాదార్ల సంఖ్య ఈ ఏడాది చివరికల్లా దాదాపు 230 కోట్లుగా ఉంటుంది. ఇది మొత్తం గ్లోబల్ మొబైల్ సబ్స్క్రిప్షన్లలో 25 శాతానికి సమానం. అలాగే 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 630 కోట్ల మంది 5జీ మొబైల్ సేవలను వినియోగిస్తారని నివేదిక అంచనా వేస్తోంది. 2027 నాటికి 4జీని దాటి.. 5జీ వినియోగదార్ల సంఖ్య 2027లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 4జీ సబ్స్క్రిప్షన్లను అధిగమిస్తాయని అంచనా. మొదటిసారిగా 6జీ సేవలు 2030లో ప్రారంభం కావొచ్చు. భారత్‌లోని స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు మెరుగైన పనితీరు కోసం వీడియో కాలింగ్, స్ట్రీమింగ్, ఆన్లైన్ చెల్లింపులకు అదనంగా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 5జీ వినియోగదార్లలో ఆరుగురిలో ఒకరు తమ ప్రస్తుత నెలవారీ మొబైల్ ఖర్చులో 20 శాతం ఎక్కువ చెల్లించడానికి రెడీగా ఉన్నారని ఎరిక్సన్ ఆగ్నేయాసియా, భారత్ నెట్వర్క్ సొల్యూషన్స్ హెడ్ ఉమాంగ్ జిందాల్ తెలిపారు.జనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (జెన్ ఏఐ) అప్లికేషన్లు 5జీ పనితీరును నడిపించే కీలక సాధనాలుగా ఉద్భవించాయి. జెన్ ఏఐ యాప్‌లను ఉపయోగించే స్మార్ట్‌ఫోన్ యూజర్ల సంఖ్య వచ్చే ఐదేళ్లలో పెరుగుతుంది. భారత్‌లోని 5జీ స్మార్ట్‌ఫోన్ కస్టమర్లలో 67 శాతం మంది వచ్చే ఐదేళ్లలో ప్రతీ వారం జెన్ ఏఐ యాప్‌లను ఉపయోగిస్తారని నివేదిక వివరించింది.
- 
      
                   
                                                       ఏఐపై ఎరిక్సన్ ఫోకస్న్యూఢిల్లీ: స్వీడన్‌కి చెందిన టెలికం పరికరాల తయారీ దిగ్గజం ఎరిక్సన్ భారత్‌లో తమ పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను మరింతగా విస్తరించనుంది. కృత్రిమ మేథ (ఏఐ), జనరేటివ్ ఏఐ, నెట్వర్క్ ఏపీఐలు, 6జీ టెక్నాలజీ అభివృద్ధి మొదలైన వాటిపై దృష్టి పెట్టనుంది. ఇందుకోసం గణనీయంగా ఇన్వెస్ట్ చేయనుంది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2024లో పాల్గొన్న సందర్భంగా కంపెనీ భారత విభాగం హెడ్ ఆండ్రెస్ విసెంటి ఈ విషయాలు తెలిపారు. 1994లో నుంచి భారత్‌లో తాము ఉత్పత్తి చేస్తున్నామని, అంతర్జాతీయంగా తమకు కీలక మార్కెట్లలో ఇది కూడా ఒకటని వివరించారు. 5జీ సాంకేతికతను వినియోగంలోకి తేవడంలో భారత్ వేగంగా పనిచేసిందని ఆండ్రెస్ తెలిపారు. కేవలం 22 నెలల్లోనే అయిదు లక్షల పైగా బేస్ స్టేషన్లు ఏర్పాటు చేసి, దేశవ్యాప్తంగా 90 శాతం మేర కవరేజీ సాధించిందని చెప్పారు. దీంతో నెట్వర్క్ పనితీరుకు సంబంధించి భారత్ 86వ స్థానం నుంచి 16వ స్థానానికి చేరిందని పేర్కొన్నారు. టెలికం దిగ్గజాలు భారతి ఎయిర్టెల్, జియోతో ఎరిక్సన్కి గతంలో ఒప్పందాలు ఉన్నాయి. ఇటీవలే 4జీ, 5జీ రేడియో యాక్సెస్ నెట్‌వర్క్‌నకు సంబంధించి వొడాఫోన్ ఐడియాతో కాంట్రాక్టు కుదుర్చుకుంది. ప్రస్తుతం దేశీయంగా ఎరిక్సన్కి చెన్నై, బెంగళూరు, గురుగ్రామ్‌లో ఆర్అండ్డీ కేంద్రాలు ఉన్నాయి. టెలికం రంగంలో రవాణా, క్లౌడ్ తదితర విభాగాలకు సంబంధించిన సాంకేతికతలపై ఇవి పని చేస్తున్నాయి.
- 
      
                   
                                                       6జీ రేసులో భారత్న్యూఢిల్లీ: ఆధునిక సాంకేతికతల ప్రయోజనాలను అందిపుచ్చుకునే దిశగా భారత్ మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ బాటలో 6జీ టెక్నాలజీకి సంబంధించి ఇప్పటికే గణనీయంగా పేటెంట్లు దాఖలు చేసింది. ఈ విషయంలో వివిధ అధ్యయనాల ప్రకారం భారత్ నాలుగు, ఆరు స్థానాల్లో ఉంది. బ్రిటన్‌కి చెందిన యూ స్విచ్ ప్లాట్‌ఫాం ప్రకారం గతేడాది ఏప్రిల్ నాటికి 265 పేటెంట్లతో (6జీ) భారత్ నాలుగో స్థానంలో ఉంది. చైనా (4,604), అమెరికా (2,229), దక్షిణ కొరియా (760) తొలి మూడు ర్యాంకుల్లో ఉన్నాయి. ఇక గ్లోబల్ ఐపీ మేనేజ్మెంట్ సంస్థ మ్యాక్స్‌వాల్ ప్రకారం 188 పేటెంట్లతో భారత్ ఆరో స్థానంలో ఉంది. (ప్రభుత్వ డేటా ప్రకారం ఈ సంఖ్య ఈ ఏడాది 200 దాటేసింది). ఈ విషయంలో బ్రిటన్ (151), జర్మనీ (84), స్వీడన్ (74), ఫ్రాన్స్ (73) కన్నా ముందుండటం గమనార్హం. 6,001 పేటెంట్లతో చైనా అగ్రస్థానంలో ఉండగా, అమెరికా (3,909), దక్షిణ కొరియా (1,417), జపాన్ (584), యూరోపియన్ యూనియన్ (214) వరుసగా టాప్ 5 ర్యాంకుల్లో ఉన్నాయి. భారత్ ప్రధానంగా బ్లాక్‌చెయిన్, డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ (డీఎల్టీ), 6జీ కమ్యూనికేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎనర్జీ హార్వెస్టింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్ వంటి విభాగాల్లో ఎక్కువగా పేటెంట్లు దాఖలు చేసినట్లు ఫ్రాన్స్‌కి చెందిన ఐపీ సొల్యూషన్స్ సంస్థ క్వెస్టెల్ తెలిపింది. 10 శాతం వాటా లక్ష్యం.. 6జీ సాంకేతికతకు సంబంధించి భారత్ భారీ లక్ష్యాలనే పెట్టుకుంది. వచ్చే మూడేళ్లలో అంతర్జాతీయంగా 6జీ పేటెంట్లలో 10 శాతం వాటా దక్కించుకోవాలని నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా భారత్ 6జీ అలయెన్స్ ఆవిష్కరణ, 6జీ ట్రయల్స్ కోసం టెస్ట్ బెడ్స్ ఏర్పాటు తదితర చర్యలు తీసుకుంది. పేటెంట్ల దాఖలుకే పరిమితం కాకుండా 6జీ ప్రమాణాలను ప్రభావితం చేసే దిశగా కూడా భారత్ కృషి చేస్తోంది. 160 పైగా దేశాల ప్రమాణాల సంస్థలకు సభ్యత్వం ఉన్న ఐఎస్‌వోలోని (ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్) టెక్నికల్ కమిటీలు, సబ్‌కమిటీల్లో మరింత క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. అక్టోబర్ 15 నుండి 24 వరకు భారత్‌లో వరల్డ్ టెలీకమ్యూనికేషన్స్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ (డబ్ల్యూటీఎస్ఏ) జరగనున్న నేపథ్యంలో ఈ విషయాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 6జీ, ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటాలాంటి కీలక టెక్నాలజీల భవిష్యత్ ప్రమాణాల గురించి చర్చించేందుకు 190 పైగా దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు.
- 
      
                   
                                                       6జీ టెక్నాలజీపై కేంద్రం దృష్టి: జ్యోతిరాదిత్య సింధియాన్యూఢిల్లీ: ప్రపంచంలోనే 5జీ నెట్‌వర్క్‌లో వేగంగా విస్తరిస్తున్న భారత్.. 6జీ టెక్నాలజీపై దృష్టిపెట్టినట్లు కేంద్ర టెలికం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. తద్వారా 6వ జనరేషన్(6జీ) మొబైల్ సర్వీసులలో ప్రపంచ పేటెంట్లలో 10వ వంతును అందిపుచ్చుకోవాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.ఏఐఎంఏ నేషనల్ మేనేజ్మెంట్ కన్వెన్షన్ ఇక్కడ నిర్వహించిన 51వ సదస్సు(ఎడిషన్) సందర్భంగా కీలకోపన్యాసం చేశారు. 5జీ సేవల నెట్‌వర్క్‌లో ప్రపంచంలోనే భారత్ వేగంగా విస్తరిస్తున్నట్లు ప్రస్తావించారు. పీఎస్‌యూ సంస్థ బీఎస్ఎన్ఎల్ కోసం సొంత 4జీ టెక్నాలజీకి తెరతీసినట్లు పేర్కొన్నారు. 22 నెలల్లోనే 4.5 లక్షల 4జీ టవర్లు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఈ బాటలో 6జీ సాంకేతికతలోకి ప్రవేశించేందుకు భారత్ 6జీ కూటమి(అలయెన్స్)ను నెలకొలి్పనట్లు వెల్లడించారు.రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్త పేటెంట్లలో 10 శాతాన్ని సాధించేందుకు కృషి చేయనున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం భారత్ ప్రపంచస్థాయిలో పురోగమిస్తున్నదని, సవాళ్లు ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థ స్థాయిని అధిగమించిందని వివరించారు. ప్రపంచ ఆర్థిక, సామాజిక అనిశి్చత పరిస్థితుల్లో భారత్ నిలకడ, నమ్మకాల దిక్సూచిలా అవతరించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే మొబైల్ ఫోన్ల తయారీలో రెండో పెద్ద దేశంగా భారత్ నిలుస్తున్నదని వెల్లడించారు.ఇదీ చదవండి: మూడు నెలల్లో భారీగా ఉద్యోగాలు.. ఈ రంగాల్లోనే అధికంగత దశాబ్దంలో దేశీ కమ్యూనికేషన్ పరిశ్రమ సొంత బాటలో పరివర్తన చెందినట్లు తెలియజేశారు. సొంతంగా పూర్తి 4జీ టెక్నాలజీని అభివృద్ధి చేయడంతోపాటు.. వచ్చే ఏడాది మధ్యలో మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. దేశీయంగా టెక్నాలజీ డిజైన్, అభివృద్ధి, అమలును చేపట్టినట్లు తెలియజేశారు. గ్లోబల్ ప్రమాణాలను అనుసరించడంతోపాటు.. రానున్న రోజుల్లో భారత్ సొంతంగా ప్రపంచానికి ప్రమాణాలను నిర్దేశించనున్నట్లు అభిప్రాయపడ్డారు.
- 
      
                   
                                 2జీ, 3జీ, 4జీ, 5జీ.. తరాల్లో మతలబుసాంకేతిక విప్లవంలో భారత్ మరికొద్ది రోజుల్లో కీలక ముందడుగు వేయబోతోంది. టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టే 5జీ టెక్నాలజీలోకి ఇప్పటికే అడుగుపెట్టింది. దీనికి సంబంధించిన ఇతర సేవలందించేలా స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియ మే 20న ప్రారంభం కాబోతోంది. ఈ ప్రక్రియ పూర్తయిన కొన్ని నెలల్లోనే దేశంలో అత్యంత వేగవంతమైన టెలికాం సేవలు అందుబాటులోకి రానున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో సాంకేతికంగా దేశంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు సంభవించబోతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు 2జీ, 3జీ, 4జీ, 5జీ సాంకేతికల్లో తేడాలెందుకో ఈ కథనంలో తెలుసుకుందాం. మొదట్లో సెల్‌ఫోన్ బరువు కేజీ ఉండేది. తర్వాత కీ ప్యాడ్ ఫోన్ వచ్చింది. తర్వాత మడత పెట్టే ఫోన్లూ వచ్చాయి. ఆ తర్వాతి కాలంలో ఫోన్లు స్మార్ట్‌గా మారిపోయాయి. ఒకప్పుడు ఫోన్లు కేవలం కాల్స్ మాట్లాడడానికి మాత్రమే.. కానీ ఇప్పటి స్మార్ట్ఫోన్లతో దాదాపు అన్ని రకాల పనులూ చక్కెబెట్టేయొచ్చు. అలాగే టెలికాం కమ్యూనికేషన్ రంగంలోనూ ఎప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకుంటూ వస్తున్నాయి. అలా తొలి తరం నెట్‌వర్క్‌ను 1జీ అనే వారు. ఇక్కడ G అంటే జనరేషన్ అని అర్థం. ఈ నెట్‌వర్క్‌లో కేవలం ఫోన్లు మాట్లాడడానికి మాత్రమే పరిమితం. ఆ తర్వాత తరాన్ని బట్టి ఇంటర్నెట్ అందించే వేగంలో మార్పులు వచ్చాయి. ప్రస్తుతం 4జీ, 5జీ విస్తృత వినియోగంలో ఉన్నాయి. ఏ తరం దేనికి? 1G: 1970ల్లో జపాన్‌లో తొలి తరం మొబైల్ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చింది. ఈ తరంలో కేవలం ఫోన్లు చేసుకోవడానికి మాత్రమే అవకాశం ఉండేది. సౌండ్ క్వాలిటీ కూడా అంతంత మాత్రమే. 2G: టెలికాం రంగంలో చెప్పుకోదగ్గ మార్పు ఉన్న నెట్వర్క్ 2జీ. 1991లో ఈ సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. తొలిసారి ఎస్సెమ్మెస్, ఎంఎంఎస్ అనేవి ఇక్కడి నుంచే ప్రారంభమయ్యాయి. డేటా వేగం గరిష్ఠంగా 50 కేబీపీఎస్ మాత్రమే. 3G: 2001లో ఈ సాంకేతికత పరిచయం అయ్యింది. మనం ఇప్పుడు వాడుతున్న చాలా సదుపాయాలు ఈ సాంకేతిక నుంచి మొదలైనవే. వేగవంతమైన మొబైల్ ఇంటర్నెట్, వీడియో కాలింగ్, వెబ్ బ్రౌజింగ్ వంటి సదుపాయాలు ఇక్కడి నుంచి ప్రారంభమయ్యాయి. 4G: దేశంలో చాలా వరకు వాడుకలో ఉన్న నెట్వర్క్ ఇదే. వేగవంతమైన డేటా, వీడియో స్ట్రీమింగ్, వీడియో కాలింగ్ వంటి సదుపాయాలు ఈ నెట్ వర్క్ సొంతం. ముఖ్యంగా జియో రాకతో చాలా వరకు 2జీ, 3జీ దాదాపు కనుమరుగైనప్పటికీ.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ ఈ నెట్వర్క్ వాడుతున్నారు. 5G: ఇప్పటికే ఈ టెక్నాలజీ కొన్ని ప్రాంతాల్లో వాడుతున్నా పూర్తిస్థాయిలో ఇంకా దాన్ని వినియోగించట్లేదు. 4జీ కంటే కొన్ని రెట్ల వేగంతో ఇంటర్నెట్ పనిచేస్తుంది. 4జీలో ఒక సినిమా డౌన్లోడ్ కావాలంటే కొన్ని నిమిషాలు పడితే.. ఇందులో రెప్పపాటులోనే అల్ట్రా హెచ్డీ సినిమాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదీ చదవండి: రూ.96వేల కోట్ల స్పెక్ట్రమ్ వేలానికి తేదీ ఖరారు.. అసలు స్పెక్ట్రమ్ అంటే.. ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే వీఆర్, ఏఆర్ సాంకేతికతలో వేగం పెరగనుంది. భద్రతతో కూడిన రవాణా వ్యవస్థ, రిమోట్ ప్రాంతాలకు ఆరోగ్యసేవలు, వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత వినియోగం, సరకు రవాణాలో డిజిటల్ సేవలు వంటి ఎన్నో అంశాల్లో 5జీ కీలకం కానుంది. రిమోట్ ఆధారిత సేవలు అందుబాటులోకి రానున్నాయి.
- 
      
                   
                                 6జీ టెక్నాలజీపై పరిశోధనకు ప్రతిష్టాత్మక కంపెనీల జట్టుటెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో సాంకేతిక పరికరాలను మరింత సమర్థంగా తయారుచేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే వాటిలో చాలామార్పులు చేస్తున్నారు. భవిష్యత్తు అవసరాలను తీర్చేలా డేటాలోనూ, దాని వేగంలోనూ మరిన్ని పరిశోధనలు జరగాలని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం వాడుతున్న 5జీకి బదులు 6జీపై ఎన్నో సంస్థలు ఇప్పటికీ పరిశోధనలు చేస్తున్నాయి. తాజాగా సమాజంపై నేరుగా ప్రభావం చూపనున్న 6జీ సాంకేతికత, 6జీ వినియోగంపై సంయుక్తంగా పరిశోధన చేసేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), నోకియా భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా బెంగళూరులో 6జీ పరిశోధనలకు అవసరమయ్యే ల్యాబ్‌ను సైతం ప్రారంభించారు. రేడియో టెక్నాలజీస్, ఆర్కిటెక్చర్, ఎయిర్ ఇంటర్ఫేస్లో మెషీన్ లెర్నింగ్ యాప్ అప్లికేషన్.. ఈ మూడు విభాగాల్లో పరిశోధనలు చేస్తారని నోకియా తెలిపింది. ఐఐఎస్సీతో జట్టు కట్టడం ద్వారా భారత్‌లో 6జీ సాంకేతికతపై తాము ఇచ్చిన హామీని మరింత ముందుకు తీసుకెళ్లనున్నామని నోకియా పేర్కొంది. ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ పరిశోధనలు ఉంటాయని, అయితే భారత్‌లో సమస్యలకు పరిష్కారం చూపేందుకే ప్రాధాన్యం ఇస్తామని వివరించింది. ఇదీ చదవండి: 2024లో జీతం ఎంత పెరుగుతుందో తెలుసా..? ఇంధన సామర్థ్య కమ్యూనికేషన్ వ్యవస్థలు, నెట్‌వర్క్‌ల సామర్థ్యాన్ని మెరుగపర్చడం, ఏఐ వినియోగం, రవాణా భద్రతను మెరుగుపర్చడం, ఆరోగ్య సంరక్షణ, విద్య వ్యాప్తి విస్తరణ నిమిత్తం నెట్వర్క్ సెన్సార్ సాంకేతికతలను అభివృద్ధి చేయడం లాంటి వాటిపై ఈ పరిశోధనల సాగే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
- 
      
                   
                                 6జీ టెక్నాలజీపై నోకియా డెమో.. అదిరిపోయే ఫీచర్లున్యూదిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2023లో కంపెనీలు 5జీ, 6జీ టెక్నాలజీలను ప్రదర్శిస్తున్నారు. అందులో భాగంగా నోకియా 6జీటెక్నాలజీకు సంబంధించి డెమో ఇచ్చింది. కంపెనీ వార్షిక టెలికాం టెక్నాలజీ ఫోరమ్‌లో 6జీ కనెక్టివిటీ, ర్యాపిడ్ రైల్ ఎన్సీఆర్టీసీ, ప్రైవేట్ వైర్లెస్ నెట్వర్క్, చంద్రునిపై 4జీ/LTE నెట్వర్క్ వంటి సెన్సింగ్ టెక్నాలజీలతో పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్, ఎక్స్టెండెడ్ రియాలిటీ (ఎక్స్ఆర్), బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ పై ఆధారపడే మెటావర్స్ ఇంటెలిజెంట్ ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ సాంకేతికతలపై డెమో ప్రదర్శించింది. నోకియా ప్రదర్శించిన 6జీ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా వినియోగదారులకు వారి పరిసరాల గురించి, అక్కడి పరిస్థితులపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఈ సెన్సింగ్ టెక్నాలజీ వినియోగదారుల గోప్యతను కాపాడుతుందని, రాడార్ లాగా పనిచేస్తుందని, వ్యక్తులు, వస్తువులు వాటి కదలికలను పసిగట్టగలదని నోకియా చెబుతుంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎన్సీఆర్టీసీ) దిల్లీ నుంచి మీరట్ రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కోసం ఒక ప్రైవేట్ వైర్లెస్ నెట్‌వర్క్‌ను కూడా ప్రదర్శించింది. దీన్ని ఫ్రెంచ్ సంస్థ అయిన అల్స్టోమ్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేశారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఎల్టీఈ/ 4.9జీ ప్రైవేట్ వైర్లెస్ నెట్వర్క్. నాసా ప్రోత్సాహంతో చంద్రునిపై మొట్టమొదటి సెల్యులార్ 4జీ/ఎల్టీఈ నెట్వర్క్ని ఆవిష్కరించేందుకు నోకియా బెల్ ల్యాబ్స్ ఇంటూటివ్ మెషీన్స్, లూనార్ అవుట్‌పోస్ట్‌తో జతకట్టింది. భూమిపై ఉన్న స్మార్ట్ఫోన్లను కనెక్ట్ చేయడానికి ఉపయోగించే అదే సెల్యులార్ సాంకేతికతను భవిష్యత్తులో చంద్రుడితో అనుసంధానం చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.
- 
      
                   
                                 ఇప్పటికే దేశంలో 4లక్షల 5జీ బేస్స్టేషన్లు: ప్రధానిమోదీన్యూదిల్లీలోని ప్రగతిమైదాన్‌లో ఏర్పాటు చేసిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2023ను శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించి మాట్లాడారు. దేశం ప్రస్తుతం 6జీ దిశగా అడుగులు వేస్తోందన్నారు. 5జీని అందుబాటులోకి తీసుకొచ్చిన ఏడాదిలోపే దేశవ్యాప్తంగా నాలుగు లక్షల 5జీ బేస్ స్టేషన్లను ఏర్పాటు చేసుకోగలిగామన్నారు. బ్రాడ్‌బ్యాండ్ వేగంలో భారత్ గతంలో 118 ర్యాంక్‌లో ఉండగా..ఇప్పుడు 43వ ర్యాంక్‌కు చేరిందని తెలిపారు. ఇటీవలే గూగుల్.. భారత్‌లో పిక్సెల్ ఫోన్‌ను తయారు చేయనున్నట్లు ప్రకటించిందన్నారు. శామ్సంగ్ ఫోల్డ్ 5, యాపిల్ ఐఫోన్ 15 ఇప్పటికే దేశంలో తయారవుతున్నాయని గుర్తచేశారు. ప్రపంచమంతా మేడ్ ఇన్ ఇండియా ఫోన్లను ఉపయోగిస్తుండటం గర్వంగా ఉందని మోదీ కొనియాడారు. భారత టెక్ విప్లవంలో యువత పాత్ర కీలకమని, అంతరిక్ష రంగంలో భారత్ వేగంగా వృద్ధి చెందుతోందని తెలిపారు. 6జీ టెక్నాలజీలో భారత్ ప్రపంచానికి మార్గనిర్దేశంగా నిలుస్తుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
- 
      
                   
                                 భారత్‌లో నోకియా 6జీ ల్యాబ్న్యూఢిల్లీ: టెలికం పరికరాల తయారీ సంస్థ నోకియా భారత్‌లో తమ 6జీ ల్యాబ్‌ను నెలకొల్పింది. కేంద్ర టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ దీన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. భారత్‌ను నూతన ఆవిష్కరణల హబ్‌గా తీర్చిదిద్దాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షల సాధన దిశగా ఇది మరో ముందడుగని ఆయన తెలిపారు. సురక్షితమైన రవాణా, ఆరోగ్య సంరక్షణ, విద్య తదితర విభాగాలకు ఉపయోగపడగలిగే 6జీ టెక్నాలజీ ఆధారిత నవకల్పనలపై ఈ ల్యాబ్ పనిచేయనున్నట్లు మంత్రి వివరించారు. బెంగళూరులోని తమ గ్లోబల్ రీసెర్చ్, డెవలప్మెంట్ సెంటర్లో నోకియా దీన్ని ఏర్పాటు చేసింది. భారత్ ఇప్పటికే 6జీ టెక్నాలజీలో 200 పైచిలుకు పేటెంట్లు దక్కించుకుంది.
- 
      
                   
                                 6జీ పేటెంట్లు లక్ష్యంగా పనిచేయాలిన్యూఢిల్లీ: 2030 నాటికల్లా అంతర్జాతీయంగా 6జీ టెక్నాలజీ పేటెంట్లలో కనీసం 10 శాతం వాటానైనా దక్కించుకునేలా భారత్ కృషి చేయాల్సి ఉందని కేంద్ర ఐటీ, టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. భారత్ ప్రస్తుతం సాంకేతికతలను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని, 6జీకి సంబంధించి ఇప్పటికే 200 పేటెంట్లను పొందిందని ఆయన తెలిపారు. ఆరో తరం టెక్నాలజీలను అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన భారత్ 6జీ ఫోరమ్‌ను ఆవిష్కరించిన మంత్రి ఈ విషయాలు చెప్పారు. 2014–23 మధ్య కాలంలో దేశీ టెలికం రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) దాదాపు 24 బిలియన్ డాలర్లకు చేరాయని ఆయన వివరించారు. గతంలో టెలికంలోకి ఎఫ్‌డీఐలను ఆకర్షించడం పెద్ద సవాలుగా ఉండేదని.. ప్రస్తుతం పెట్టుబడులు రావడం గణనీయంగా పెరిగిందని మంత్రి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలి అమెరికా పర్యటన సందర్భంగా .. సాంకేతికతలను సంయుక్తంగా అభివృద్ధి చేయాలని ఇరు దేశాలు అంగీకారాానికి వచ్చాయని వైష్ణవ్ చెప్పారు. టెక్నాలజీలను దిగుమతి చేసుకునే దేశంగా ఉన్న భారత్ ఇప్పుడు వాటిని ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని, అనేక దేశాలు మన దగ్గర్నుంచి టెలికం పరికరాలను దిగుమతి చేసుకుంటున్నాయన్నారు. భారతీయ టెలికం పరికరాల తయారీ సంస్థలు అమెరికా మార్కెట్‌కు కూడా ఎగుమతులు ప్రారంభించారని మంత్రి చెప్పారు. వచ్చే 2–3 ఏళ్లలో టెలికం రంగం కోసం పూర్తిగా దేశీయంగా రూపొందించిన తొలి చిప్ అందుబాటులోకి రాగలదని ఆయన తెలిపారు. మైక్రాన్ ఏర్పాటు చేస్తున్న 2.75 బిలియన్ డాలర్ల చిప్ ప్లాంటుకు వచ్చే 40–45 రోజుల్లో శంకుస్థాపన జరగనుందని చెప్పారు.
- 
      
                   
                                 6జీ సంకల్పం నెరవేరగలదా?రేపటితరం టెలీ కమ్యూనికేషన్ టెక్నాలజీగా చెబుతున్న 6జీపై భారత్ ఓ దార్శనిక పత్రం విడుదల చేసింది. ఇటీవలే దేశంలో ప్రవేశపెట్టిన 5జీ టెక్నాలజీతో పోల్చినా ఎన్నో రెట్లు మెరుగైందీ 6జీ. ఇది వాస్తవ రూపం దాలిస్తే సమాచారం ఏకంగా సెకనుకు ఒక టెరాబిట్ వేగంతో ప్రయాణిస్తుంది. 5జీతో పోల్చితే వందరెట్లు ఎక్కువ వేగం! దార్శనిక పత్రం లక్ష్యం చౌకైన, సర్వవ్యాప్తమైన, సుస్థిర టెక్నాలజీల అభివృద్ధి. కానీ ఈరోజుకూ దేశంలో సుమారు 35,000 గ్రామాల్లో కనీసం 2జీ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా లేకపోవడం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ దార్శనిక పత్రం పెద్ద ఆశయాలతో కూడి ఉన్నదని చెప్పక తప్పడం లేదు. 6జీ డాక్యుమెంట్ కేవలం కాగితాలకే పరిమితం కాకుండా చూసుకోవాలి. 6జీ టెక్నాలజీతో అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు నమోదయ్యే అవకాశం ఉంది. అందుకే భారత్ ఈ విషయమై కేవలం దార్శనిక పత్రాన్ని జారీ చేయడంతోనే సరిపెట్టకూడదు. పరిశోధనలకు తగినన్ని నిధులు కేటాయించడంతోపాటు 6జీ టెక్నాలజీ విషయంలో అంతర్జాతీయ ప్రొటోకాల్, ప్రమాణాల నిర్ధారణ విషయంలోనూ చురుకుగా పాలు పంచుకోవాలి. ఈ పనులు చేయకపోతే 6జీ కేవలం భారత్‌కున్న ఆశల్లో ఒకటిగా మిగులుతుంది. అనూహ్యమైన ప్రభావం... 6జీ టెక్నాలజీ పూర్తిస్థాయిలో సాకరమైతే కలిగే ప్రయోజనాలు అనూహ్యం. విద్య, ఆరోగ్యం, రవాణాలతోపాటు మానవ జీవితంలోని ప్రతి పార్శా్వన్నీ ఇది స్పృశిస్తుందనడంలో ఎలాంటి సందే హమూ లేదు. రక్షణ రంగ నిపుణుల అంచనాల ప్రకారం, 6జీ టెక్నా లజీని అంతరిక్ష, అణుశక్తి రంగాల మాదిరిగానే ఓ వ్యూహాత్మక రంగంగా పరిగణించి పెట్టుబడులు పెట్టాలి! ఇదే విషయాన్ని మూడేళ్ల క్రితం లెఫ్టినెంట్ జనరల్ ఎస్.ఎస్.మెహతా ‘ద ట్రిబ్యూన్ ’లో రాసిన ఒక వ్యాసంలో విస్పష్టంగా పేర్కొన్నారు. 6జీ టెక్నాలజీతో టాక్టయిల్ ఇంటర్నెట్, హోలోగ్రాఫిక్ కమ్యూ నికేషన్ వంటివి సాధ్యమవుతాయి. ఆగ్మెంటెడ్, వర్చువల్, మిక్స్డ్ రియాటీలకూ ఈ టెక్నాలజీ సాయం అందిస్తుంది. అదే సమయంలో ఆర్థిక వ్యవస్థలను సమూలంగా మార్చగలిగేంత శక్తి కూడా ఈ టెక్నాలజీలకు ఉంది. ఇవన్నీ సాధ్యం కావాలంటే కొత్త కొత్త నెట్వర్క్ టెక్నాలజీలు, పరికరాలు, ప్రమాణాలు అవసరమవుతాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న 5జీ టెక్నాలజీ పూర్తి సామర్థ్యాన్నే మనం అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉండగా, తరువాతి తరం టెక్నాలజీ అభివృద్ధికి రంగం సిద్ధమవుతోందన్నమాట! భారత్ ఇటీవలే విడుదల చేసిన 6జీ దార్శనిక పత్రంలో భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టెలికామ్ మార్కెట్ అని పేర్కొన్నారు. పూర్తిస్థాయి టెక్నాలజీ సృష్టికర్తగా, తయారీదారుగా ఎదగాలని కూడా సంకల్పం చెప్పుకొంది. కాబట్టి 6జీ టెక్నాలజీ తీరుతెన్నులను నిర్ణ యించే ప్రక్రియలో భారత్ కూడా భాగస్వామి కావాలి. అంతరిక్ష రంగంలో ప్రపంచం మొత్తమ్మీద అగ్రస్థానంలోకి చేరేందుకు ఏం చేయాలో ఆలోచించమని ప్రభుత్వం గతేడాదే ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. మార్చి 22న ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన డాక్యుమెంట్– పారిశ్రామిక వర్గాలు, విద్యాసంస్థలు, సర్వీస్ ప్రొవై డర్లు ఏఏ అంశాలపై పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలో గుర్తించమని చెబుతోంది. ఇది రెండు దశల్లో జరిగేందుకు అవకాశముంది. తొలిదశ (2023 –25)లో ప్రాథమికమైన పరిశోధన, మేధోహక్కుల అభివృద్ధి జరిగితే, రెండో దశ (2025–30) వాణిజ్యీకరణ. దార్శనిక పత్రం లక్ష్యం చౌకైన, సర్వవ్యాప్తమైన, సుస్థిర టెక్నా లజీల అభివృద్ధి. ఇది చాలా కష్టసాధ్యమైన పని. ఎందుకంటే ప్రస్తుతం ఉపయోగిస్తున్న 5జీ టెక్నాలజీలకు ఈ లక్షణాలేవీ లేవు. అంటే... 6జీ ద్వారా టెక్నాలజీ పరంగా భారీ పురోగమనం జరగా లన్న లక్ష్యాన్ని భారత్ నిర్దేశించుకుంది. అంతేకాదు, అవన్నీ చౌకగా చేయాలి. అన్నిచోట్ల అందుబాటులో ఉండేలా చూడాలి. (కానీ ఈరోజుకూ దేశంలో సుమారు 35,000 గ్రామాల్లో కనీసం 2జీ ఇంట ర్నెట్ కనెక్షన్ కూడా లేకపోవడం గమనార్హం). సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సరేసరి. వీటికి తోడు కేవలం భారత్‌కు మాత్రమే కాకుండా... 6జీ టెక్నాలజీలన్నీ ప్రపంచం మొత్తానికి అందే ఏర్పాట్లూ చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ దార్శనిక పత్రం పెద్ద ఆశయాలతో కూడి ఉన్నదని చెప్పక తప్పడం లేదు. 6జీ టెక్నాలజీపై పట్టు సాధించడం ద్వారా పెత్తనం చలాయించవచ్చునన్న అంచనాలతో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా బోలెడన్ని కార్యక్రమాలు చకచకా నడుస్తున్నాయి. పరిశ్రమ వర్గాలతో కూడిన ‘నెక్స్ట్–జీ అలయన్స్ ఆఫ్ నార్త్ అమెరికా’ సుమారు 50 టెక్నాలజీల అభివృద్ధి అవసరాన్ని గుర్తించింది. రేడియో టెక్నాలజీలు, నెట్వర్క్ ఆర్కిటెక్చర్, సెక్యూరిటీ, ప్రైవసీ వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. మరోవైపు దక్షిణ కొరియా 2021లోనే యూనివర్సిటీల్లో 6జీ టెక్నా లజీపై పరిశోధనలు చేసేందుకు మూడు కేంద్రాలను ఏర్పాటు చేసింది. అలాగే చిన్న, మధ్యతరహా పరిశ్రమలు పరస్పర సహకారంతో పరిశోధనలు చేసేలా ప్రోత్సహిస్తోంది. యూరోపియన్ దేశాలు కూడా తెలివైన నెట్‌వర్క్‌ల ఏర్పాటు, మేనేజ్మెంట్లను దృష్టిలో ఉంచుకుని ప్రయత్నాలు చేస్తున్నాయి. చైనా, జపాన్ లలోనూ 6జీ టెక్నాలజీకి సంబంధించి వేర్వేరు అంశాలపై పరిశోధనలకు ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. మన దృక్కోణంలో... భారతదేశపు 6జీ విజన్ డాక్యుమెంట్ ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు జరుగుతున్న రంగాలు, భారతీయ దృక్కోణంలో పరిశోధనలు చేపట్టాల్సిన అంశాలపై దృష్టి పెట్టింది. ఈ డాక్యుమెంట్లో పేర్కొన్న అంశాలు, వ్యూహాలు, కార్యక్రమాల రూపం సంతరించుకోవాలంటే ‘ఆర్ అండ్ డీ’కి దీర్ఘకాలం పెట్టుబడులు అవసరమవుతాయి. నెక్స్ట్–జీ అలయన్స్‌లో ప్రఖ్యాత టెలికామ్ కంపెనీలు ఏటీ అండ్ టీ, బెల్, ఇంటెల్, శాంసంగ్, ఆపిల్, డెల్, సిస్కో, ఎరిక్సన్ , గూగుల్, హెవ్లెట్ ప్యాకర్డ్, ఎల్జీ, మైక్రోసాప్ట్, నోకియా తదితర కంపెనీలు వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నాయి. కొరియా, జపాన్ , యూరప్‌లలో 6జీ సంబంధిత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది, చురుకుగా పాల్గొంటున్నది ఈ భారీ కంపెనీలే. అక్కడి ప్రభుత్వాలు కూడా సానుకూలంగా వాటికి మద్దతు పలుకు తున్నాయి. మన దేశంలో పరిస్థితి పూర్తిగా భిన్నం. మొత్తం ప్రభుత్వం ఆధ్వ ర్యంలో నడుస్తోంది. టెలికామ్ రంగంలోని తయారీదారులు, సేవలందించేవారు పాల్గొంటారని ఆశించవచ్చు కానీ... నేతృత్వం మాత్రం ప్రభుత్వం వద్ద ఉండే అవకాశాలే ఎక్కువ. పరిశోధనల విషయానికి వస్తే ఐఐటీల్లాంటి విద్యాసంస్థలు ఇప్పటికే కొన్ని కొత్త, వినూత్న టెక్నాలజీలపై పనిచేస్తున్నాయి. వాటికి మరింత ప్రోత్సాహం అందించాలి. 6జీ వాణిజ్యీకరణ విషయానికి వస్తే పరిశ్రమ వర్గాలు, విద్యాసంస్థల భాగస్వామ్యం తప్పనిసరి. 6జీ టెక్నాలజీలో భాగమైన సైబర్ ఫిజికల్ సిస్టమ్స్‌పై డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఐదేళ్ల క్రితమే ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టినా ఇప్పటివరకూ సాధించింది కొంతే. విజన్ డాక్యుమెంట్లో నిధుల అంశంపై అంత స్పష్టత లేదు. భారీ మొత్తంతో ఒక నిధిని ఏర్పాటు చేస్తామని మాత్రమే ఈ డాక్యు మెంట్ చెబుతోంది. ఈ నిధి పదేళ్ల కాలానికి దాదాపుగా రూ.10,000 కోట్ల వరకూ ఉండవచ్చునని అంటోంది. ఈ నిధి ప్రభుత్వానిదా, కాదా? అన్నదాంట్లోనూ అస్పష్టతే. టెలికామ్ రంగంలో భారతదేశం దేశీయంగా తయారు చేసిన గొప్ప టెక్నాలజీ ఏదైనా ఉందీ అంటే అది 1980ల నాటి డిజిటల్ రూరల్ స్విచ్! గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ టెలిఫోన్ ఎక్స్ఛేంజీ ఏర్పాటు చేసేందుకు కేంద్రం అప్పట్లో ‘ద సెంటర్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీ–డాట్)ను ఏర్పాటు చేసింది. మూడేళ్ల సమయం రూ.36 కోట్ల నిధులు కేటాయించింది. ప్రాజెక్టు విజయవంతమైంది. ఈ టెక్నాలజీని ప్రైవేట్ సంస్థలకు అందించారు. తరువాతి కాలంలో చాలా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ వినియోగించారు. 6జీ విషయంలోనూ ఇదే తరహా పద్ధతిని అనుసరించడం మేలు. ఈ అత్యవసరమైన చర్యలన్నీ తీసుకోకపోతే 6జీ డాక్యుమెంట్ కేవలం కాగితాలకే పరిమితమవుతుంది! దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
- 
      
                   
                                 మిషన్ 6జీ.. 5జీ కంటే వందరెట్ల వేగంగా నెట్ స్పీడ్.. భారత్ భారీ ప్లాన్!టెలికమ్యూనికేషన్ రంగంలో ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడుతోంది. 5జీ సేవల్ని 125 నగరాల్లో అందుబాటులోకి తెచ్చి ఆరు నెలలైందో లేదో 6జీపై అధ్యయనం కోసం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. 2030 నాటికి దేశంలో 6జీ సేవలు అందుబాటులోకి తెచ్చి ప్రజా జీవనంలోనూ, సామాజికంగా సమూల మార్పు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. 6జీని ఒక మిషన్లా తీసుకువెళ్లి దక్షిణ కొరియా, చైనా, జపాన్ వంటి దేశాల సాంకేతికతతో పోటీపడతామని సగర్వంగా ప్రకటించింది. ప్రస్తుతం భారతీయులు 100 కోట్ల మొబైల్ ఫోన్లను వాడుతున్నారు. ఇంటర్నెట్ వాడే వారి సంఖ్య 2014లో 25 కోట్లు ఉంటే ఇప్పుడు 85 కోట్లకు చేరుకుంది. ఇక ఏడాదికేడాది స్మార్ట్ ఫోన్లు వాడే సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం 30 కోట్ల గృహాలకు చెందిన వారు ఏడాదికి 16 కోట్ల కంటే ఎక్కువగానే స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. అంటే ప్రతీ ఇంటివారు రెండేళ్లకి ఒకసారి కొత్త ఫోన్‌ను కొంటున్నట్టు లెక్క. భారతీయులు ఫోన్ లేకుండా ఒక నిముషం కూడా గడిపే పరిస్థితి లేదు. అన్ని పనులు ఫోన్‌ద్వారా చేస్తున్నారు. ఏదైనా బిల్లు కట్టాలన్నా, సినిమాలు చూడాలన్నా, ఆన్లైన్ క్లాసులు వినాలన్నా , బ్యాంకింగ్ లావాదేవీలు, యూపీఐ చెల్లింపులు ఇలా.. ఏ పనైనా అరచేతిలో ఉన్న ఫోన్‌తోనే. అందుకే స్మార్ట్ ఫోన్ మార్కెట్ కూడా మన దగ్గరే ఎక్కువ. 6జీ ద్వారా నెట్ స్పీడ్ పెరిగితే మరింత సులభంగా పనులన్నీ అయిపోతాయి. ఆ మేరకు మార్కెట్ కూడా విస్తృతమవుతుంది. పదేళ్లలో 6జీ సేవలు అందుబాటులోకి తెచ్చేలా కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. ఏమిటీ 6జీ...? టెలికమ్యూనికేషన్ రంగంలో ఆరో తరం సేవల్ని 6జీ అంటారు. 5జీ సేవలు పూర్తిగా విస్తరించకుండానే 6జీపై కేంద్రం పరిశోధనలు మొదలు పెట్టింది. 5జీ కంటే దీని నెట్ స్పీడ్ వందరెట్లు వేగంగా ఉంటుంది. సెకనుకు ఒక టెరాబైట్ వేగంతో పని చేస్తుంది. క్షణ మాత్రం ఆలస్యం లేకుండా డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. కేంద్రం ప్రణాళికలు ఇవే ..! భారత్ 6జీ ప్రాజెక్టును రెండు దశల్లో అమలు చేస్తారు. తొలి దశలో ప్రధానంగా పరిశోధనలపై ఫోకస్ ఉంటుంది. రెండో దశలో వాణిజ్యపరంగా 6జీ సేవల వాడకంపై సమగ్ర అధ్యయనం జరుగుతుంది. ప్రాజెక్టు పర్యవేక్షణకు కేంద్రం అత్యున్నత కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది. 6జీ ప్రమాణాలు, స్పెక్ట్రమ్‌ల గుర్తింపు, సిస్టమ్స్, డివైజ్‌లకు ఎకో సిస్టమ్ ఏర్పాటు, పరిశోధన, అధ్యయనాలకు ఆర్థిక సాయం తదితరాలను ఈ కౌన్సిల్ పర్యవేక్షిస్తుంది. రూ.10వేల కోట్లతో ఒక కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేసి 6జీపై తొలిదశ పరిశోధనలు మొదలు పెట్టనున్నారు. మొత్తంగా 6జీ పరిశోధనలకు రూ. 63 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనాలున్నాయి. కొత్త సాంకేతిక వ్యవస్థలైన టెరాహెర్ట్జ్ కమ్యూనికేషన్, రేడియో ఇంటర్ఫేసెస్, టాక్టిల్ ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కొత్త ఎన్కోడింగ్ పద్ధతులు, 6జీ పరికరాలకు అవసరమయ్యే చిప్ సెట్స్ వంటివాటిపై కూడా ప్రధానంగా అత్యున్నత మండలి దృష్టి పెడుతుంది. ఎలాంటి మార్పులు వస్తాయి? ► 6జీ అందుబాటులోకి వస్తే ఫ్యాక్టరీలన్నీ రిమోట్ కంట్రోల్‌తో ఆపరేట్ చేయొచ్చు ► రియల్–టైమ్ గేమింగ్ ఇండస్ట్రీకి కొత్త హంగులు చేకూరుతాయి. ► స్వయంచోదక కార్లు రోడ్లపై ఇక పరుగులు తీస్తాయి ► డేటా ట్రాన్స్ఫర్ జాప్యం లేకుండా క్షణాల్లో జరగడం వల్ల సుదూరంలో ఉండి కూడా సర్జరీ చేసే అవకాశం ఉంటుంది. ► 6జీ సపోర్ట్‌తో నడిచే డివైజ్‌లన్నీ బ్యాటరీలతో నడుస్తాయి. దీంతో బ్యాటరీ తయారీ రంగం పరుగులు పెడుతుంది ► ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) మరో దశకు చేరుకుంటుంది. ► ఆత్మనిర్భర్ భారత్ కింద ఉన్న డిజిటల్ ఇండియా, రూరల్ బ్రాడ్‌బ్యాండ్, స్మార్ట్ సిటీలు, ఈ–గవర్నెన్స్ వంటివి పుంజుకుంటాయి. ► రేడియో ఫ్రీక్వెన్సీ వినియోగం మరింత సామర్థ్యంతో పని చేస్తుంది. ఎలాంటి నెట్వర్క్ సమస్యలు లేకుండా ఒకేసారి అత్యధిక డివైజ్‌లకు నెట్ కనెక్షన్ ఇవ్వొచ్చు. 5జీతో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ పరికరాలకు 6జీ కనెక్షన్ ఒకేసారి ఇచ్చే అవకాశముంటుంది. ► వైర్లెస్ కమ్యూనికేషన్లలో విప్లవాత్మక మార్పులు రావడంతో పర్యావరణం అనుకూలంగా ఉంటుంది. 5జీ రేడియేషన్‌తో పర్యావరణానికి దెబ్బ ఎక్కువగా ఉందనే ఇప్పటికే విమర్శలున్నాయి. ► సామాజికంగా పలు మార్పులు చోటు చేసుకుంటాయి. అత్యంత వేగంతో పనిచేసే ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం వల్ల ఎక్కడ నుంచైనా పని చేసే అవకాశం ఉంటుంది. దీంతో పల్లెలు, పట్టణాల మధ్య తేడా తగ్గిపోతుంది. పల్లెల నుంచి వలసల్ని నిరోధించవచ్చు ► 6జీ సర్వీసులు అందరికీ అందుబాటులోకి రావడం, ఎక్కడ నుంచైనా రిమోట్ కంట్రోల్‌తో ఆపరేట్ చేసే అవకాశాలు ఉండడంతో గ్రామీణ జీవనంలో కూడా విప్లవాత్మక మార్పులు వస్తాయి. ఇతర దేశాల్లో ఎలా..? ► 6జీ సేవల్లో ప్రస్తుతం దక్షిణ కొరియా ముందంజలో ఉంది. రూ.1200 కోట్ల పెట్టుబడులతో 2025కల్లా తొలి దశ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఉంది. ► జపాన్‌లో ఐఒడబ్ల్యూఎన్ ఫోరమ్ 6జీ సేవలపై 2030 విజన్ డాక్యమెంట్ని విడుదల చేసింది. ► చైనా 6జీపై 2018లోనే అధ్యయనం ప్రారంభించింది. 2029లో అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ► అమెరికా కూడా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్‌సీసీ)తో కలిసి 2018లో 6జీపై అధ్యయనాలు మొదలు పెట్టింది. యాపిల్, గూగుల్ వంటి కంపెనీలతో కూడా కలిసి పనిచేస్తోంది.
- 
      
                   
                                 6జీ.. భారత ఆత్మవిశ్వాస ప్రతీక: మోదీన్యూఢిల్లీ: దేశంలో 5జీ సాంకేతికత అందుబాటులోకి వచ్చిన కేవలం ఆరు నెలల్లోనే 6జీ టెక్నాలజీపై పరిశోధనలు చేసే స్థాయికి భారత్ ఎదిగిందని ప్రధాని మోదీ ప్రకటించారు. ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ టెలీకమ్యూనికేషన్ సంఘం(ఐటీయూ) ప్రాంతీయ కార్యాలయం, ఇన్నోవేషన్ సెంటర్‌ను బుధవారం ఢిల్లీలో ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ప్రసంగించారు. ‘ దేశంలోకి 5జీ సేవలు మొదలైన 6 నెలల్లోనే 6జీ టెక్నాలజీపై పరిశోధన మొదలవుతోంది. ఇది భారత ఆత్మవిశ్వాసానికి దర్పణం పడుతోంది. 4జీ కంటే ముందు టెలికం సాంకేతికతలో భారత్ కేవలం ఒక యూజర్‌గా ఉండేది. కానీ ఇప్పుడు భారీ టెలికం టెక్నాలజీని ఎగుమతి చేసే దిశగా అడుగులు వేస్తోంది. దేశీయంగా అభివృద్ధిని సాధించిన టెక్నాలజీ వైపు ప్రపంచం దృష్టి సారించింది. ఇది భారత సాంకేతిక దశాబ్దం ‘సమ్మిళిత సాంకేతికత వల్లే డిజిటల్ చెల్లింపులు, ప్రత్యక్ష నగదు బదిలీ, జన్‌ధన్, ఆధార్, బ్రాడ్‌బ్యాండ్ సేవలు సాధ్యమయ్యాయి. టెలికం టెక్నాలజీ భారత్‌లో కేవలం శక్తి మాధ్యమం మాత్రమేకాదు సాధికారతకు సోపానం. ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 85 కోట్లకు పెరిగింది. దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో మొత్తంగా 25 లక్షల కి.మీ.ల ఆప్టికల్ ఫైబర్ వేశాం. త్వరలో వంద 5జీ ల్యాబ్‌లు ఏర్పాటుచేస్తాం. దేశీయ అవసరాల తీర్చేలా 5జీ అప్లికేషన్లను ఇవి అభివృద్ధిచేస్తాయి. దేశంలో 5జీ సేవలు మొదలైన 120 రోజుల్లోనే 125 నగరాలకు విస్తరింపజేశాం. ఈ దశాబ్దం భారత సాంకేతికదశాబ్దం(టెక్‌ఏడ్)’ అని మోదీ అభివర్ణించారు.
- 
      
                   
                                 6జీ టెక్నాలజీలో భారతీయులకు 100 పేటెంట్లున్యూఢిల్లీ: 6జీ టెక్నాలజీకి సంబంధించి భారతీయ సైంటిస్టులు, ఇంజినీర్లు, విద్యావేత్తలకు 100 పేటెంట్లు ఉన్నాయని కేంద్ర ఐటీ, టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఎలక్ట్రానిక్స్ అనేది చాలా సంక్లిష్టమైన అంశం అయినప్పటికీ మనవారు ఆ రంగంలో గణనీయ పురోగతి సాధిస్తున్నారని చెప్పారు. పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన భారత్ స్టార్టప్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు వివరించారు. 5జీ నెట్వర్క్ విస్తరణ .. ప్రభుత్వం నిర్దేశించిన 200 నగరాలను కూడా దాటి ప్రస్తుతం 397 నగరాలకు చేరిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం 3.5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఉన్న భారత్.. పాలన, మౌలిక సదుపాయాలు, వ్యాపారాల నిర్వహణలో మార్పులతో ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగగలదని వైష్ణవ్ పేర్కొన్నారు. ఆ దిశగా అందరూ కృషి చేస్తే .. 30 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా భారత్ ఆవిర్భవించడాన్ని ఏ శక్తీ ఆపలేదని ఆయన చెప్పారు.
- 
      
                   
                                 దక్షిణ కొరియా 6జీ ఫ్యూచర్ ప్లాన్స్ అదుర్స్: చైనాకే షాకిస్తుందా..?సియోల్: టెలికం రంగంలో 5జీ నెట్వర్క్ ఒక సంచలనం అని చెప్పాలి. ఇప్పటికే మన దేశంలో చాలా ప్రాంతాల్లో 5 జీ నెట్ వర్క్ అందుబాటులోకి వచ్చింది. తాజాగా దక్షిణ కొరియా ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేస్తోంది. ముఖ్యంగా అనుకున్న దానికంటే రెండు సంవత్సరాల ముందుగానే అందు బాటులోకి తేనున్నామని, దక్షిణ కొరియా సైన్స్, ఐసీటీ మంత్రిత్వశాఖ సోమవారం తెలిపింది.రాబోయే 6జీ నెట్వర్క్ పేటెంట్ పోటీలో ఈ సంఖ్యను 30 శాతం లేదా అంతకంటే ఎక్కువ పెంచనున్నట్లు దక్షిణ కొరియా ప్రభుత్వం తెలిపింది. ఎలెక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, రోబోటిక్ నూతన సాకేంతికత, ఉత్పత్తులతో దూసుకుపోతున్న దక్షిణ కొరియా 2028లో ప్రపంచంలోనే తొలి 6జీ నెట్వర్క్ సేవను ప్రారంభించాలని యోచిస్తోంది. వైర్లెస్ రంగంలో తన ఆధిపత్యాన్ని చాటుకునేలా కే-నెట్వర్క్ 2030 ప్రణాళికలో భాగంగా నెక్ట్స్ జెన్ నెట్వర్క్ కోసం రానున్న రెండేళ్లలో మరింత వేగవంతం చేయనుంది. బెర్నామా నివేదిక ప్రకారం ప్రపంచస్థాయి 6జీ టెక్నాలజీ ద్వారా సురక్షితమైన మొబైల్ నెట్‌వర్క్‌ను దక్షిణ కొరియా ఆవిష్కరించనుంది. కౌంటీ నెట్వర్క్ సరఫరా గొలుసును బలోపేతం చేయాలనే ప్రణాళికలో భాగంగా, దక్షిణ కొరియా మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం 625.3 బిలియన్ వోన్ లేదా 481.7 బిలియన్ డాలర్ల విలువైన కోర్ 6జీ సాంకేతికతలపై పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్ట్ సాధ్యాసాధ్యాల అధ్యయనం జరుగుతోందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతేకాకుండా, దేశంలో తదుపరి తరం మొబైల్ నెట్వర్క్ టెక్నాలజీ ఉత్పత్తులపై దేశీయ కంపెనీలను ప్రోత్సహించాలని భావిస్తోంది. మొబైల్ పరికరానికి అనుకూలంగా ఉండే ఓపెన్ RAN లేదా ఓపెన్ రేడియో యాక్సెస్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం స్థానిక కంపెనీలను ప్రోత్సహించనుదని Yonhap నివేదించింది. కాగా ఆసియాలో నాల్గవ-అతిపెద్ద ఆర్థికవ్యవస్థ గత సంవత్సరం 5జీ పేటెంట్ల సంఖ్యలో 25.9 శాతంగా ఉంది. ఈ విషయంలో మార్కెట్ లీడర్ చైనాను 26.8 శాతం మాత్రమే అనేది గమనార్హం.
- 
      
                   
                                 5జీ కన్జ్యూమర్ సేవల్లోకి రావడం లేదుముంబై: టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ కీలక ప్రకటన చేశారు. వినియోగదారులకు 5జీ సేవలను అందించే ప్రణాళిక ఏదీ తమ వద్ద లేదని స్పష్టం చేశారు. భారీ నష్టాల కారణంగా కన్జ్యూమర్ టెలికం సేవల నుంచి కొన్నేళ్ల క్రితమే టాటా గ్రూపు తప్పుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాకపోతే 4జీ, 5జీకి సంబంధించి అధునాత టెక్నాలజీ సదుపాయాలను నిర్మించడంపైనే తమ ప్రయత్నాలన్నీ కేంద్రీకృతమై ఉన్నాయని, 6జీపైనా పెట్టుబడులు పెట్టనున్నట్టు చెప్పారు. ‘లోక్మత్ మహరాష్ట్రియన్ ఆఫ్ ఇయర్ 2022’ అవార్డుల కార్యక్రమం సందర్భంగా చంద్రశేఖరన్ మాట్లాడారు. టాటా గ్రూపు కంపెనీలు నిర్మిస్తున్న టెక్నాలజీ సదుపాయాలు పూర్తి దేశీయంగా అభివృద్ధి చేసినవని, పరీక్షించిన అనంతరం పెద్ద ఎత్తున విస్తరించనున్నట్టు చెప్పారు. వీటికి సంబంధించి ఇప్పటికే విచారణలు వస్తున్నట్టు తెలిపారు. గ్రూపులోని నాలుగు ఎయిర్‌లైన్స్ కంపెనీలను స్థిరీకరించే ప్రణాళికలపై మాట్లాడుతూ.. ఒక్కటే ఎయిర్‌లైన్, రెండు ప్లాట్‌ఫామ్‌లు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. ‘‘ఒకటి పూర్తిస్థాయి సేవలతో ప్రపంచ స్థాయి కంపెనీగా ఉంటుంది. అప్పుడు భారతీయులు ప్రపంచంలో ఎక్కడికైనా ప్రయాణించేందుకు వీలుటుంది. రెండోది తక్కువ వ్యయాలతో కూడి ఉంటుంది. ఇది మా లక్ష్యం. ఇది సుదీర్ఘ ప్రయాణం’’ అని పేర్కొన్నారు. రూపాయి అన్ని ఇతర కరెన్సీలతో లాభపడుతూ, డాలర్‌తో విలువను కోల్పోతున్నట్టు చెప్పారు. ద్రవ్యోల్బణాన్ని మనం నియంత్రించగలమన్నారు. టాటా గ్రూపు, ఇతర పారిశ్రామిక గ్రూపులు ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రిక్ వాహనాలు, ఇతర అధునాతన రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు పోటీ పడుతున్నట్టు చంద్రశేఖరన్ చెప్పారు.
- 
      
                   
                                 టీసీఎస్ సంచలనం..5జీ..6జీ!!న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఏ టెలికం సంస్థకైనా 5జీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు తాము సర్వసన్నద్ధంగా ఉన్నామని ఐటీ దిగ్గజం టీసీఎస్ హెడ్ (కమ్యూనికేషన్, మీడియా..ఇన్ఫర్మేషన్ సర్వీసుల విభాగం) కమల్ భదాడా తెలిపారు. ఇప్పటికే పలు దేశాల్లోని టెల్కోలకు టెక్నాలజీ ఇవ్వడంతో పాటు వాటి నెట్‌వర్క్‌లను నిర్వహించే సర్వీసులు కూడా అందిస్తున్నట్లు వివరించారు. దేశీ అవసరాలకు తగ్గట్లు నెట్‌వర్క్‌పై మరింతగా కసరత్తు చేస్తున్నామని కమల్ వివరించారు. ప్రస్తుతం చాలా దేశాల్లో 5జీ నెట్వర్క్ వినియోగం మధ్యలో ఉండగా.. భారత్‌లో ఇంకా ప్రారంభం కావాల్సి ఉందన్నారు. 2023 లేదా 2024 నాటికి 5జీ సేవలు అందుబాటులోకి రావచ్చని.. ఆ తర్వాత పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చేందుకు మరో 3–4 ఏళ్లు పడుతుందని కమల్ తెలిపారు. అటు పైన 6జీ నెట్వర్క్ కోసం ప్రక్రియ ప్రారంభం కాగలదని వివరించారు. చదవండి: దిమ్మతిరిగే స్పీడ్.. చిటికెలో 27 సినిమాల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు!!
- 
      
                   
                                 దిమ్మతిరిగే స్పీడ్.. చిటికెలో 27 సినిమాల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు!!ప్రపంచ దేశాల్లో 5జీ (5జనరేషన్) వైర్లెస్ మొబైల్ నెట్ వర్క్ ప్రారంభం కానేకాలేదు. కానీ అప్పుడే 6జీ టెక్నాలజీ గురించి చర్చ మొదలైంది. 5జీ కంటే 6జీ ఎంత వేగంతో పనిచేస్తుంది. ఎంత తక్కువ సమయంలో డేటానుషేర్ చేయొచ్చు. ఎన్ని రోజుల్లో 6జీ నెట్వర్క్ అందుబాటులోకి వస్తుందనే' పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా 6జీ మొబైల్ టెక్నాలజీ వైర్లెస్ ట్రాన్స్మిషన్ స్పీడ్‌లో సరికొత్త రికార్డులను నమోదు చేస్తుందని చైనా మీడియా సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనాన్ని ప్రచురించింది. చైనా రీసెర్చర్లు సెకన్ వ్యవధిలో 206.25 డేటాను షేర్ చేసే కెపాసిటీ 6జీ టెక్నాలజీని బిల్డ్ చేసినట్లు చైనా మీడియా తన కథనంలో పేర్కొంది. అంతేకాదు 6జీ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే 5జీ కంటే 100రెట్లు ఫాస్ట్‌గా పనిచేస్తుందని వెల్లడించింది. ఉదాహరణకు 4కే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ మూవీస్ మొత్తం 59.5గంటలు ఉండగా..ఆ మొత్తాన్ని చిటికెలో డౌన్లోడ్ చేయొచ్చు. అంటే 206.25గిగా బైట్ల వేగంతో ఆ అన్నిగంటల సినిమాను కేవలం 16 సెకన్లలో డౌన్లోడ్ చేయొచ్చన్నమాట. కాగా, సౌత్ కొరియా మీడియా కథనాల ప్రకారం..టెలికాం సంస్థల నుంచి సేకరించిన సమాచారం మేరకు 6జీ టెక్నాలజీ 2030 కల్లా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. 5జీకి కోవిడ్ దెబ్బ ప్రపంచంలోని ఎక్కువ దేశాల్లో కోవిడ్, సప్లయి చైన్, 5జీ ఎక్విప్మెంట్ అధిక ధరల కారణంగా 5జీ నెట్‌వర్క్‌లు సేవలకు ప్రారంభం కాలేదు. ముఖ్యంగా మనదేశంలో 5G స్పెక్ట్రమ్ కోసం వేలం మరింత ఆలస్యం కారణంగా 5జీ సేవలు పూర్తిస్థాయిలో అందేందుకు మరింత సమయం పట్టనుంది. చదవండి: 6జీ టెక్నాలజీ..! ముందుగా భారత్‌లోనే..
- 
      
                   
                                 6జీ టెక్నాలజీ..! ముందుగా భారత్‌లోనే..భారతదేశంలో అతి త్వరలో 6జీ టెక్నాలజీ అందుబాటులోకి రానుందా? అంటే, అవును అనే సమాధానాం వస్తుంది. టెలికాం రంగంలో ఆరవ తరం 6జీ టెక్నాలజీ అవకాశాలను అన్నీ దేశాల కంటే ముందే అందిపుచ్చుకోవడానికి తయారీ & సేవల వ్యవస్థను సిద్ధం చేసేందుకు భారతదేశం 6జీ టెక్నాలజీ ఇన్నోవేషన్ గ్రూప్(టీఐజీ)ని ఏర్పాటు చేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు కానున్న 6G టెక్నాలజీని అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోని విధంగా అభివృద్ధి చేసేందుకు ఈ 6జీ టెక్నాలజీ గ్రూప్ ఇన్నోవేషన్ గ్రూప్(టీఐజీ) ఏర్పాటు చేసినట్లు టెలికమ్యూనికేషన్స్ విభాగం(డీఓటీ) తెలిపింది. "6జీ టెక్నాలజీ అవకాశాలను అన్నీ దేశాల కంటే ముందే అందిపుచ్చుకోవడానికి భారతదేశంలో ఈ 6జీ టెక్నాలజీ గ్రూప్ ఇన్నోవేషన్ గ్రూప్(టీఐజీ) సిద్ధం చేయడం అవసరం" అని కూడా డీఓటీ తెలిపింది. ఈ 6జీ టెక్నాలజీ గ్రూప్ ఇన్నోవేషన్ గ్రూపులో ప్రభుత్వం, అకాడెమియా, ఇండస్ట్రీ అసోసియేషన్, టిఎస్ డీఎస్ఐ(టెలికామ్ స్టాండర్డ్స్ డెవలప్ మెంట్ సొసైటీ ఆఫ్ ఇండియా) సభ్యులుగా ఉంటారు. 6జీ సాంకేతిక పరిజ్ఞానంపై పనిచేయడానికి శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు అవసరమైన అనుమతులు ఇవ్వడంతో పాటు దేశీయంగా అభివృద్ధి చేసిన హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ సహాయంతో 6జి టెక్నాలజీని రూపొందించనున్నట్లు కమ్యూనికేషన్ శాఖ మంత్రి వైష్నావ్ గతంలో పేర్కొన్నారు. 2024 లేదా 2025 ఏడాది ప్రారంభంలో ఈ 6జీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
- 
      
                   
                                 విదేశాలకు దేశీయ 6జీ టెక్నాలజీ ఎగుమతి!2024 నాటికి భారత్ దేశంలో 6జీ టెక్నాలజీని అమలులోకి తీసుకొని రావడానికి కృషి చేస్తున్నట్లు కమ్యూనికేషన్ శాఖ మంత్రి అశ్వినీ వైష్నావ్ నేడు(నవంబర్ 24) తెలిపారు. 6జీ సాంకేతిక పరిజ్ఞానంపై పనిచేయడానికి శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు అవసరమైన అనుమతులు ఇచ్చినట్లు ఆయన అన్నారు. దేశీయంగా అభివృద్ధి చేసిన హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ సహాయంతో 6జి టెక్నాలజీని రూపొందించనున్నట్లు వైష్నావ్ పేర్కొన్నారు. ఈ టెక్నాలజీని ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయనున్నట్లు తెలిపారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) 5జీ కోసం సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించినట్లు, 2022 ద్వితీయార్ధంలో స్పెక్ట్రమ్ వేలం వేయనున్నట్లు ఆయన అన్నారు. "5జీ స్పెక్ట్రమ్ వేలం కోసం ట్రాయ్(టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) ఇప్పటికే 5జీ స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియను ప్రారంభించింది. ఈ ప్రక్రియ రాబోయే సంవత్సరంలో ఫిబ్రవరి-మార్చి వరకు ముగుస్తుంది. ఈ వేలం ప్రక్రియ తర్వాత 2022 క్యూ2 నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది" అని వైష్నావ్ తెలిపారు. (చదవండి: తప్పిన తిప్పలు.. ఆన్లైన్లో అందుబాటులోకి జియోఫోన్ నెక్ట్స్!)
- 
      
                   
                                 6జీ ఇంటర్నెట్ స్పీడ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!మన దేశంలో ఇంకా 5జీ టెక్నాలజీ అందుబాటులోకి రాకముందే అప్పుడే 6జీ టెక్నాలజీ మీద పనులు ప్రారంభించాలని కేంద్రం పేర్కొంది. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికామ్ పరిశోధన & అభివృద్ధి సంస్థ సీ-డీఓటీని ప్రపంచ మార్కెట్ కు అనుగుణంగా 6జీ, ఇతర భవిష్యత్ టెక్నాలజీల మీద పనులు ప్రారంభించాలని టెలికాం కార్యదర్శి కె రాజరామన్ కోరారు. ఇప్పటికే శామ్ సంగ్, హువావే, ఎల్జీ కొన్ని ఇతర కంపెనీలు 6జీ టెక్నాలజీలపై పనిచేయడం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. 5జీ వేగం 5జీ నెట్వర్క్ గరిష్టంగా 20 జీబీపీఎస్ డౌన్లోడ్ వేగాన్ని అందుకోగలదు. భారతదేశంలో 5జీ నెట్వర్క్ స్పీడ్ టెస్టింగ్ సమయంలో డౌన్లోడ్ గరిష్ట వేగం 3.7 జీబీపీఎస్ చేరుకుంది. ఎయిర్ టెల్, వీఐ, జియో కంపెనీలు 5జీ నెట్వర్క్ ట్రయల్స్‌లో 3 జీబీపీఎస్ వరకు డౌన్లోడ్ వేగాన్ని అందుకున్నట్లు పేర్కొన్నాయి. (చదవండి: రూ.69 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ కూడా అదుర్స్!) 6జీ వేగం 6జీ వైర్ లెస్ టెక్నాలజీ ఆరవ తరం. 6జీ నెట్వర్క్ డౌన్లోడ్ వేగం 1000 జీబీపీఎస్ కి చేరుకుంటుందని భావిస్తున్నారు. ఎల్జీ సంస్థ ఇటీవల జర్మనీలో 6జీ నెట్వర్క్ ట్రయిల్స్ ప్రారంభించినట్లు మీడియా నివేదికలు తెలిపాయి. ఈ నివేదిక ప్రకారం, ట్రయల్స్‌లో 100 మీటర్ల దూరంలో డేటాను పంపించడంతో పాటు స్వీకరించారు. 6జీ నెట్వర్క్ సహాయంతో సెకనుకు 1000 మెగాబైట్ల వేగంతో కేవలం 51 సెకన్లలో 6జీబీ మూవీని డౌన్లోడ్ చేసుకోవచ్చు.(చదవండి: సేఫ్టీలో టాటా మోటార్స్ కార్లకు తిరుగులేదు) 6జీ నెట్వర్క్ ముఖ్యాంశాలు 6జీ నెట్వర్క్ వేగం 5జీ కంటే 50 రెట్లు అధికం జపాన్‌లో 6జీ నెట్వర్క్ 2030 నాటికి ప్రారంభించవచ్చు. జపాన్‌తో పాటు, దక్షిణ కొరియా, చైనా, ఫిన్లాండ్ కూడా 6జీ నెట్వర్క్ కోసం సిద్ధమవుతున్నాయి. యూరోపియన్ యూనియన్‌లో 6జీ నెట్వర్క్ కోసం మిలియన్ల యూరోలు ఖర్చు చేస్తున్నారు.
- 
      
                   
                                 అప్పుడే 6జీ టెక్నాలజీపై కసరత్తు ప్రారంభించిన కేంద్రంన్యూఢిల్లీ: ఇంకా 5జీ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి రాకముందే అప్పుడే 6జీ టెక్నాలజీ మీద పనులు ప్రారంభించాలని కేంద్రం పేర్కొంది. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికామ్ పరిశోధన & అభివృద్ధి సంస్థ సీ-డీఓటీని ప్రపంచ మార్కెట్ కు అనుగుణంగా 6జీ, ఇతర భవిష్యత్ టెక్నాలజీల మీద పనులు ప్రారంభించాలని టెలికాం కార్యదర్శి కె రాజరామన్ కోరారు. ఇప్పటికే శామ్ సంగ్, హువావే, ఎల్ జీ కొన్ని ఇతర కంపెనీలు 6జీ టెక్నాలజీలపై పనిచేయడం ప్రారంభించాయి. ఈ టెక్నాలజీ 5జీ కంటే 50 రెట్లు వేగంగా ఉంటుందని, 2028-2030 మధ్య వాణిజ్యపరంగా అందుబాటులోకి రానున్నట్లు భావిస్తున్నారు. వొడాఫోన్ ఐడియా భారతదేశంలో ట్రయల్స్ సమయంలో అత్యధిక గరిష్ట వేగం 3.7 జీబీపీలను సాధించినట్లు పేర్కొంది. దేశంలోని రిలయన్స్ జియో నెట్ వర్క్ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) సెకనుకు 20 మెగాబిట్ వద్ద 4జీ టాప్ స్పీడ్ ను నమోదు చేసింది. అక్టోబర్ 1న డీఓటీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన రాజరామన్ టెక్నాలజీ వాణిజ్యీకరణపై దృష్టి పెట్టాలని, వేగవంతమైన సాంకేతిక వాణిజ్యీకరణ కోసం సి-డిఒటిలో ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేయడాన్ని పరిగణనలోకి తీసుకోవాలి అని సీ-డీఓటీకి సూచించారు. ఇప్పటికే అమెరికా, చైనా వంటి దేశాలు 6జీ టెక్నాలజీ అభివృద్ధి, పరిశోధనలకు సంబంధించిన పనులు ప్రారంభించాయి. ఇప్పుడు వాటితో పోటీగా మన దేశంలో కూడా నూతన టెక్నాలజీల పనిచేయాలని డీఓటీ పేర్కొంది. ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, మిక్స్ డ్ రియాలిటీ కలిసిన XR టెక్నాలజీతో.. ఎంటర్టైన్మెంట్, మెడిసిన్, సైన్స్, విద్య, తయారీ పరశ్రమల బౌండరీలను 6జీ పెంచనుంది.
- 
      
                   
                                 6జీ టెక్నాలజీ అభివృద్ధి దిశగా ఎల్జీ కంపెనీప్రపంచవ్యాప్తంగా తన మొబైల్ ఫోన్ వ్యాపారాన్ని మూసివేస్తున్నట్లు ప్రముఖ ఎల్జీ కంపెనీ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా 6జీ టెక్నాలజీ అభివృద్ధిలో భాగంగా యుఎస్ ఆధారిత సంస్థ కీసైట్ టెక్నాలజీస్, కొరియా అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్&టెక్నాలజీలతో చేతులు కలిపినట్లు ప్రకటించింది. ఈ మూడు సంస్థలు కలిసి 6జీ టెక్నాలజీని వీలైనంత త్వరగా తీసుకొని రావడానికి పరిశోధనపై దృష్టి పెట్టాయి. ఒప్పందం ప్రకారం.. 6జీ కమ్యూనికేషన్లకు కీలకమైన ఫ్రీక్వెన్సీ బ్యాండ్ టెరాహెర్ట్జ్‌కు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో ఒకదానికొకటి సహకారం అందించుకోనున్నాయి. 2024 నాటికి 6జీ పరిశోధనలను పూర్తి చేయాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నట్లు యోన్హాప్ వార్తా సంస్థ నివేదించింది. 6జీ నెట్వర్క్ ను వాణిజ్య పరంగా 2029లో అందుబాటులోకి తీసుకోని రానున్నట్లు ఎల్జీ పేర్కొంది. 5జీ అన్ని దేశాలలో అందుబాటులో రాకముందే 6జీ టెక్నాలజీ అభివృద్ధిపై అనేక సంస్థలు దృష్ట్టి సారించాయి. 6జీ డేటా వేగం 5జీ పోలిస్తే అనేక రేట్లు అధికంగా ఉండనున్నట్లు కంపెనీ తెలిపింది. ఎల్జీ 2019లో కైస్ట్ తో కలిసి 6జీ పరిశోధనా కేంద్రాన్ని స్థాపించింది. 6జీ టెక్నాలజీలను అధ్యయనం చేయడానికి కొరియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ సైన్స్ తో గత సంవత్సరం ఒప్పందం కుదుర్చుకుంది. కీసైట్ టెక్నాలజీస్ 6జీ టెరాహెర్ట్జ్ పరీక్ష పరికరాలకు ప్రధాన సరఫరాదారుడు. ఇది ఎల్జీ, కైస్ట్ యొక్క 6జీ పరిశోధన కేంద్రానికి పరికరాలను అందిస్తోంది. ఈ కొత్త తరువాతి తరం 6జీ టెక్నాలజీ వల్ల డిజిటల్ హెల్త్‌కేర్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, స్మార్ట్ సిటీలు, స్మార్ట్ ఫ్యాక్టరీలు, పెనుమార్పులు చోటు చేసుకోనున్నాయి.


