PM Modi: సంక్రాంతి స్పెషల్‌.. పంచె కట్టులో ప్రధాని మోదీ | PM Narendra Modi Participated In Pongal Celebrations | Sakshi
Sakshi News home page

PM Modi: సంక్రాంతి స్పెషల్‌.. పంచె కట్టులో ప్రధాని మోదీ

Jan 14 2024 1:48 PM | Updated on Jan 14 2024 2:38 PM

PM Narendra Modi Participated In Pongal Celebrations - Sakshi

ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక, పలు రాష్ట్రాల్లో కూడా సంక్రాంతిని ప్రజలు వేడుకగా జరుపుకుంటున్నాయి. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ పండుగ వేళ మరోసారి తన మార్క్‌ చూపిస్తూ సాంప్రదాయ పద్దతిలో పంచెకట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

కాగా, ప్రధాని మోదీ సంక్రాంతి సంబురాల్లో పాల్గొన్నారు. ఢిల్లీలోని కేంద్రమంత్రి ఎల్‌ మురుగన్‌ నివాసంలో జరిగిన వేడుకలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా సాంప్రదాయ పద్ధతిలో మోదీ పంచె కట్టారు. అలాగే, పండుగ సందర్భంగా కట్టెల పొయ్యిపై పాయసం వండారు. అనంతరం గోమాతకు సారె సమర్పించి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ తదితరులు పాల్గొన్నారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ అవుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement