‘యశోభూమి’కి తరలిరండి

PM Narendra Modi to launch inaugurate Yashobhoomi convention centre - Sakshi

సినిమా, టీవీ పరిశ్రమకు, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలకు సకల సౌకర్యాలున్నాయ్‌

ఢిల్లీలో అతిపెద్ద కన్వెన్షన్‌ సెంటర్‌ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ పిలుపు

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద కన్వెన్షన్‌ సెంటర్లలో ఒకటైన ఇండియా ఇంటర్నేషన్‌ కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పో సెంటర్‌ ‘యశోభూమి’ మొదటి దశను ప్రధాని మోదీ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా ఇదే వేదికపై ‘పీఎం విశ్వకర్మ’ పథకానికి శ్రీకారం చుట్టారు.

ఢిల్లీలోని భారత్‌ మండపం, యశోభూమిలో సకల సౌకర్యాలున్నాయని, వీటిని ఉపయోగించుకోవాలని, ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుకు రావాలని సినిమా, టీవీ పరిశ్రమను, అంతర్జాతీయ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలను ప్రధాని ఆహా్వనించారు. పీఎం విశ్వకర్మ పథకంలో సంప్రదాయ వృత్తి కళాకారులకు, కార్మికులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. 18 మంది లబి్ధదారులకు ‘విశ్వకర్మ సర్టిఫికెట్లు’అందజేశారు. వారు ఎలాంటి పూచీకత్తు లేకుండానే తక్కువ వడ్డీకే రూ.3 లక్షలదాకా రుణం పొందవచ్చు.  

కాన్ఫరెన్స్‌ టూరిజంకు పెద్దపీట
దేశంలో సదస్సుల పర్యాటకానికి ఉజ్వలమైన భవిష్యతు ఉందని మోదీ స్పష్టం చేశారు. యశోభూమి కన్వెన్షన్‌ సెంటర్‌ ప్రారం¿ోత్సవంలో ఆయన ప్రసంగించారు. భారత్‌లో ఈ రంగం విలువ రూ.25,000 కోట్లకుపైగా ఉందన్నారు.  అనంతరం ‘యశోభూమి ద్వారక సెక్టార్‌ 25’మెట్రో రైల్వే స్టేషన్‌ను మోదీ ప్రారంభించారు.  

ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ  
ప్రధాని మోదీ 73వ జన్మదినం సందర్భంగా ఆదివారం  రాష్ట్రపతి ముర్ము, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, బీజేపీ  అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అధికార బీజేపీ ‘సేవా పఖ్వారా’ను ప్రారంభించింది. అక్టోబర్‌ 2 దాకా ఇది కొనసాగుతుంది.

రూ.13 వేల కోట్లతో ‘విశ్వకర్మ’ పథకానికి శ్రీకారం  
దేశంలో పౌరుల రోజువారీ జీవనంలో విశ్వకర్మల పాత్ర చాలా కీలకమని మోదీ ఉద్ఘాటించారు. ఎంతటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా సమాజంలో వారి స్థానం చెక్కుచెదరని ప్రశంసించారు.  రూ.13,000 కోట్లతో పీఎం విశ్మకర్మ పథకాన్ని అమలు చేస్తామని, సంప్రదాయ వృత్తి కళాకారులకు, కారి్మకులకు అండగా నిలుస్తామని అన్నారు. ఈ పథకంతో వడ్రంగులు, స్వర్ణకారులు, కమ్మరులు, శిల్పకారులు, కుమ్మరులు, దర్జీలు, తాపీ మేస్త్రీలు, రజకులు, క్షురకులు తదితరులకు మేలు జరుగుతుందన్నారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top