నేడు ఛత్తీస్‌గఢ్‌లో ప్రధాని ఎన్నికల ర్యాలీ.. జనం హాజరుపై సందేహాలు? | Sakshi
Sakshi News home page

Chhattisgarh Election: నేడు ఛత్తీస్‌గఢ్‌లో ప్రధాని ఎన్నికల ర్యాలీ

Published Mon, Nov 13 2023 8:02 AM

PM Narendra Modi Chhattisgarh Visit - Sakshi

ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు (నవంబర్ 13) ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించనున్నారు. ముంగేలి అసెంబ్లీ నియోజకవర్గంలోని జంకుహిలో ఉదయం 11 గంటల నుంచి 11:40 వరకు జరిగే ఎన్నికల సభలో ఆయన ప్రసంగించనున్నారు. బీజేపీ రాష్ట్ర ఇంచార్జి ఓం మాథుర్ ఇప్పటికే ముంగేలికి చేరుకుని సభా స్థలాన్ని పరిశీలించారు. 

మరోవైపు ప్రధాని పర్యటన స్థానిక బీజేపీ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. దీపావళి మర్నాడే ఏ‍ర్పాటు చేసిన ఈ బహిరంగ సభకు జనాన్ని కూడగట్టడం వారికి సవాలుగా పరిణమించింది. అయినప్పటికీ బీజేపీ నేతలు జనసమీకరణకు నడుం బిగించారు. రాష్ట్రంలో ప్రధాని పాల్గొంటున్న మూడవ బహిరంగ సభ ఇది. దీనికి ముందు మోదీ నవంబర్ నాలుగు, ఐదు తేదీలలో దుర్గ్, డోంగర్‌గావ్‌లలో జరిగిన ఎన్నికల ర్యాలీలలో పాల్గొన్నారు. 

బస్తర్‌లో ప్రధాని రూ. 27 వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. అలాగే రాయ్‌గఢ్‌లో రూ.6,350 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. తొమ్మిది జిల్లాల్లో క్రిటికల్ కేర్ బ్లాకులకు శంకుస్థాపన చేశారు. గత జూలై 7న ప్రధాని మోదీ రాయ్‌పూర్‌లో రూ.7,600 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. ఛత్తీస్‌గఢ్‌ అసెబ్లీ ఎన్నికల్లో నవంబర్ 7 మొదటి దశ పోలింగ్‌ జరగగా, నవంబర్‌ 17 రెండవ దశ పోలింగ్ జరగనుంది.
ఇది కూడా చదవండి: బ్రిటీష్‌ ప్రధానికి భారత్‌ దీపావళి కానుక

Advertisement
Advertisement