ప్రధాని మోదీ అరుదైన ఘనత.. అమెరికా కాంగ్రెస్ ఆహ్వానం

PM Modi to Address US Congress Once Again - Sakshi

న్యూఢిల్లీ: ఈనెల 22న యూఎస్‌ కాంగ్రెస్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రధానమంత్రి మోదీ ప్రసంగించనున్నారు. ఈమేరకు సెనేట్ సభాపతి కెవిన్ మెక్ కార్తి స్వయంగా భారత ప్రధాని మోదీని ఆహ్వానించారు. ఈ సభలో ప్రధాని భారత్ అమెరికా సంబంధాల రీత్యా అనుసరించాల్సిన భవిష్యత్తు కార్యాచరణతోపాటు ఉభయ దేశాలు ప్రాపంచికంగా ఎదుర్కొంటున్న సవాళ్లపై ప్రసంగం చేయనున్నారు. 

మోదీ  అరుదైన ఘనత... 
ఏడేళ్ల కిందట 2016లో ఇదే వేదికపై ప్రసంగించారు మోదీ.  బ్రిటీష్ మాజీ ప్రధాని విన్స్టన్ చర్చిల్, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా తర్వాత రెండు సందర్భాల్లో యూఎస్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రసంగించిన నాయకుడిగా చరిత్ర సృష్టించనున్నారు.  

2016 ప్రసంగంలో మోడీ... 
గతంలో మోదీ ఇదే సభను ఉద్దేశించి మాట్లాడుతూ వాతావరణ మార్పుల నుంచి ఉగ్రవాదం వరకు, రక్షణ శాఖ, భద్రతా వ్యవహారాలు, వాణిజ్య సంబంధాలు, రెండు దేశాల మధ్య ఆర్ధిక పురోగతి  వంటి అనేక అంశాలను స్పృశించారు.  

చదవండి: రాహుల్ గాంధీ చెప్పింది అక్షరాలా నిజం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top