రేపు డిజిట‌ల్ హెల్త్ మిష‌న్ స్కీమ్‌ను ప్రారంభించనున్న మోదీ

PM to launch Pradhan Mantri Digital Health Mission on September 27 - Sakshi

ప్రతి భారతీయుడికీ హెల్త్ కార్డు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం జాతీయ స్ధాయిలో డిజిటల్ హెల్త్ మిషన్ అమలుకు సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ పేరుతో అమలు చేసే ఈ కార్యక్రమాన్ని రేపు(సెప్టెంబర్ 27న) ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ప్రతీ పౌరుడికీ హెల్త్ కార్డుల జారీతో పాటు వారి ఆరోగ్య సమాచారాన్ని ఆ కారులో నిక్లిప్తం చేయనున్నారు. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ అమలు చేయబోతున్నట్లు గత ఏడాది ఆగస్టు 15న ప్రధాని మోదీ ప్రకటించారు. ప్రస్తుతం ఆరు కేంద్ర పాలిత ప్రాంతాలు అండమాన్ & నికోబార్, చండీగఢ్, దాద్రా & నాగర్ హవేలీ మరియు డామన్ & డయు, లడఖ్, లక్షద్వీప్ & పుదుచ్చేరిలలో టెస్ట్ రన్ చేస్తున్నారు.

పిఎమ్-డిహెచ్ఎమ్ అంటే ఏమిటి?
పిఎమ్-డిహెచ్ఎమ్(ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్) కింద దేశంలోని పౌరులందరికీ హెల్త్ కార్డులతో పాటు హెల్త్ ఐడీ కూడా అందిస్తారు. ఇది బ్యాంక్ ఖాతా ఎలా పనిచేస్తుందో? అలాగే, వారి ఆరోగ్యానికి సంబంధించి ఒక ఖాతాగా పనిచేస్తుంది. దీని ఆధారంగా ప్రతీ ఒక్కరి ఆరోగ్య సమాచారాన్ని అందులో నిక్షిప్తం చేస్తారు. భవిష్యత్తులో ఎప్పుడైనా జబ్బు చేసినప్పుడు చికిత్స అందించాల్సి వచ్చినా, మందులు తీసుకోవాల్సి వచ్చినా దానికి ఈ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ఉపయోగపడుతుంది. దీని ద్వారా మీరు ఏదైనా ఆసుపత్రికి వెళ్లినప్పుడు మీ హెల్త్ ఐడీ నమోదు చేయగానే స్వయం చాలకంగా మీ పూర్తి ఆరోగ్య సమాచారం డాక్టర్లకు కనిపిస్తుంది. ఒకవేల కొత్త పరీక్షలు చేయాల్సి వస్తే ఆ వివరాలను ఇందులో చేరుస్తారు.(చదవండి: ‘ఎస్‌బీఐ లాంటివి నాలుగైదు బ్యాంకులు కావాలి’)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top