Phonepe Warns Congress Of Legal Action Over Posters On Shivraj Singh Chouhan - Sakshi
Sakshi News home page

ఇదేం బాలేదు.. తక్షణమే తొలగించండి.. కాంగ్రెస్‌ పార్టీకి ఫోన్‌పే వార్నింగ్‌!

Jun 29 2023 3:56 PM | Updated on Jun 29 2023 8:38 PM

Phonepe Warns Congress Party Over Posters QR Code Shivraj Chouhan - Sakshi

భోపాల్‌: ఈ సారి ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో బీజేపీని గద్దె దించేందకు కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ పాలిత ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని ఆరోపిస్తూ.. పోస్టర్ల ప్రచారానికి తెర లేపింది. సీఎం శివ‌రాజ్‌ 50 శాతం క‌మీష‌న్లు తీసుకుంటున్న‌ట్లుపై ఆరోప‌ణ‌లు చేసింది. ఫోన్ పే క్యూఆర్ కోడ్‌ను ప్రింట్ చేసి దాంట్లో శివ‌రాజ్ బొమ్మ‌ను చేర్చి ఆ పోస్టర్లును పలు చోట్ల అంటించింది.

పోస్టర్ల రచ్చ
అందులో "50% లావో, ఫోన్‌పే కామ్ కరో (మీ పని పూర్తి కావాలంటే 50% కమీషన్ చెల్లించాలి). అయితే ప్రస్తుతం ఆ పోస్ట‌ర్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మరోవైపు  బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య పోస్టర్‌ యుద్ధం సాగుతున్న నేపథ్యంలో ఆన్‌లైన్‌ చెల్లింపుల యాప్‌ ఫోన్‌పే సంస్థ తమ కంపెనీ పేరు, లోగోను ఉపయోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పోస్టర్లను తొలగించాలని కాంగ్రెస్‌ను కోరడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 

ఫోన్‌పే పోస్టర్‌లపై స్పందిస్తూ, "రాజకీయ లేదా రాజకీయేతర వాటికోసం తమ బ్రాండ్ లోగోను అనధికారికంగా ఉపయోగించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి వాటికి తమ కంపెనీ లోగోను వాడ‌వ‌ద్దు అని త‌న ట్వీట్‌లో చెప్పింది. అనుమ‌తి లేకుండా లోగోను వాడితే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఫోన్ పే కంపెనీ తెలుపుతూ.. ఆ పోస్టర్‌లను తొలగించాలని కాంగ్రెస్‌ను కోరింది.

బీజేపీ స్పందన ఇదే
భోపాల్, ఇండోర్, గ్వాలియర్, సెహోర్, రేవా, మందసౌర్, ఉజ్జయిని, భింద్, బాలాఘాట్, బుధ్ని, మరికొన్ని నగరాల్లో వెలువడిన ఈ పోస్టర్‌ల వీడియోలను కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. పోస్టర్లపై బీజేపీ స్పందిస్తూ.. పలు నగరాల్లో పోస్టర్లు అంటించిన తర్వాత కాంగ్రెస్ డర్టీ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని మధ్యప్రదేశ్ హోంమంత్రి, బీజేపీ నేత నరోత్తమ్ మిశ్రా మండిపడ్డారు.
 

చదవండి: రైలు అక్కడకు రాగానే ‘అంధకారం’.. విచిత్రమో, విడ్డూరమో కాదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement