మూడింతలు పెరిగిన సంపన్నుల విరాళాలు

Philanthropy by Indian Families Tripled During the Pandemic - Sakshi

2020 ఆర్థిక సంవత్సరంలో రూ.12,000 కోట్లకు 

బెయిన్, దస్రా సంయుక్త నివేదిక 

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నప్పటికీ అత్యంత సంపన్న కుటుంబ(హెచ్‌ఎన్‌ఐ) విరాళాలు 2020 ఆర్థిక సంవత్సరంలో మూడింతలు పెరిగి.. రూ.12,000 కోట్లకు చేరాయి. 2019 ఆర్థిక సంవత్సరం నుంచి చూస్తే ప్రైవేట్‌ రంగం ఇచ్చిన విరాళాల్లో మూడింట రెండొంతుల వాటాకు చేరాయి. బెయిన్‌ అండ్‌ కంపెనీ, దస్రా సంస్థలు కలిపి రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2020 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్‌ రంగ (విదేశీ, కార్పొరేట్, రిటైల్, అత్యంత సంపన్న వర్గాల(హెచ్‌ఎన్‌ఐ) కుటుంబాల) విరాళాలు మొత్తం రూ. 64,000 కోట్లుగా ఉండగా.. ఇందులో కుటుంబాల వాటా దాదాపు 20 శాతంగా ఉంది. 

మొత్తం నిధుల్లో విదేశీ వనరుల నుంచి వచ్చినది 25 శాతంగా ఉండగా, దేశీ కంపెనీలు కార్పొరేట్‌ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్‌) కింద కేటాయించినది 28 శాతంగాను, రిటైల్‌ ఇన్వెస్టర్ల వాటా మరో 28 శాతంగాను ఉంది. అయితే, దాతృత్వ కార్యక్రమాలకు ఇబ్బడి ముబ్బడిగా విరాళాలు వస్తున్నప్పటికీ సామాజిక సంక్షేమం మాత్రం కుంటినడకనే నడుస్తుండటం గమనార్హమని నివేదిక పేర్కొంది. ‘కుటుంబ దాతృత్వ కార్య కలాపాలు.. భారత అభివృద్ధి అజెండాను తీర్చిదిద్దేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. వీటికి మరింత ప్రోత్సాహం లభిస్తే దేశ శ్రేయస్సుకు తోడ్పడగలవు‘ అని తెలిపింది. విరాళాల్లో అత్యధిక భాగం వాటా విద్య, ఆరోగ్య రంగాలదే ఉంటోందని నివేదిక పేర్కొంది. విద్యా రంగానికి 47 శాతం, ఆరోగ్య రంగానికి 27 శాతం వాటా ఉందని వివరించింది.

చదవండి:

పిల్లల కోసం తల్లిదండ్రులు ఇలా ఆలోచిస్తే మంచిదే

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top