కుటుంబంలో అందరికీ సోకదు

Not everyone in coronavirus-hit family prone to disease - Sakshi

కరోనాపై ఐఐపీహెచ్‌ అధ్యయనం

అహ్మదాబాద్‌: కరోనా సోకిన వ్యక్తి ఉన్న కుటుంబంలో అందరికీ ఆ వైరస్‌ సోకుతుం దని చెప్పలేమని తాజా అధ్యయనంలో తేలింది. కోవిడ్‌–19 నిర్ధారణ అయిన వ్యక్తి ఉన్న కుటుంబంలోని దాదాపు 80% నుంచి 90% సభ్యులకు ఆ వైరస్‌ సోకకపోవచ్చని తేలింది. అందుకు కారణం వారిలో ఆ వైరస్‌ నిరోధక శక్తి పెరగడమే కావచ్చని గుజరాత్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ సంస్థ నిర్వహించిన ఒక అధ్యయనంలో స్పష్టమైంది.

‘వైరస్‌ సోకిన వ్యక్తిని కలిసిన అందరికీ అది సోకుతుందని చెప్పలేం. అదే నిజమైతే, కోవిడ్‌–19 నిర్ధారణ అయిన కుటుంబంలోని అందరికీ ఆ వైరస్‌ సోకాలి కదా?. కానీ అలా జరగడం లేదు. కోవిడ్‌–19తో చనిపోయిన వ్యక్తి ఉన్న కుటుంబాల్లో కూడా ఎవరికీ ఆ వైరస్‌ అంటుకోని ఉదాహరణలున్నాయి’అని ఆ సంస్థ డైరెక్టర్‌ దిలీప్‌ మవలాంకర్‌ వివరించారు.

కుటుంబ సభ్యులకు వైరస్‌ సోకే అవకాశాలపై అం తర్జాతీయంగా ప్రచురితమైన 13 పరిశోధనల ఆధారంగా ఈ అధ్యయనం చేశామన్నారు. అహ్మదాబాద్‌లో కేసు ల సంఖ్య భారీగా పెరిగి, ఆ తరువాత ఒక్కసారిగా తగ్గాయని, అందుకు కారణం హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించడమే కావ చ్చని వివరించారు. యూనివర్సిటీ కా లేజ్‌ ఆఫ్‌ లండన్‌ న్యూరో సైంటిస్ట్‌ కార్ల్‌ ఫ్రిస్టన్‌ ప్రతిపాదిం చిన ‘ఇమ్యూనలాజికల్‌ బ్లాక్‌ హోల్‌’సిద్ధాంతం ప్రకారం జనాభాలో 50% మందికి వైరస్‌ సోకదని వివరించారు. ఇమ్యూనిటీ, ఇళ్లకే పరిమితమవడం.. మొదలైనవి అందుకు కారణాలన్నారు.

17 లక్షలు దాటిన కేసులు
దేశంలో కోవిడ్‌ కేసులు 16 లక్షలు దాటిన రెండు రోజుల్లోనే 17 లక్షల మార్కును దాటాయి. ఆదివారం కొత్తగా 54,735 కేసులు బయట పడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 17,50,723కు చేరుకుంది. గత 24 గంటల్లో 853 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కోలుకున్న వారి సంఖ్య 11,45,629కి చేరుకోగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 5,67,730గా ఉంది.

గత నాలుగు రోజులుగా వరుసగా రోజుకు 50 వేలకు పైగా కేసులు  నమోదవుతున్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 65.44 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 2.13 శాతానికి పడిపోయిందని తెలిపింది. ప్రస్తుతం దేశంలో 32.43 శాతం యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు పేర్కొంది. 24 గంటల్లో 51,225 మంది కోలుకున్నట్లు పేర్కొంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top