పిల్లలపై... థర్డ్‌వేవ్‌ ప్రభావానికి ఆధారాల్లేవ్‌!

No indication that Covid 3rd wave will impact children more - Sakshi

లాన్సెట్‌ ఇండియా నివేదిక  

న్యూఢిల్లీ: కరోనా థర్డ్‌వేవ్‌ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందనేందుకు ఇంతవరకు సరైన ఆధారాల్లేవని లాన్సెట్‌ కోవిడ్‌–19 కమిషన్‌ ఇండియా టాస్క్‌ఫోర్స్‌ నివేదిక తేల్చిచెప్పింది. ‘భారతీయ పిల్లల్లో కోవిడ్‌ 19’ అనే అంశంపై పరిశోధన జరిపేందుకు లాన్సెట్‌ ఇండియా సంస్థ ఎయిమ్స్‌లోని ప్రముఖ పీడియాట్రిషన్ల్ల(చిన్నపిల్లల వైద్య నిపుణులు)తో  కూడిన ఒక బృందాన్ని ఏర్పరిచింది. ఈ బృందం పిల్లలలో థర్డ్‌వేవ్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుందనేందుకు ఆధారాలేమీ లభించలేదని వివరించింది. ‘కోవిడ్‌ సోకిన చిన్నారుల్లో ఎక్కువమంది ఎలాంటి లక్షణాలను కనబరచరు(ఎసింప్టమాటిక్‌), మిగిలినవారిలో స్వల్ప లక్షణాలు కనిపిస్తాయి. వీరిలో అధికులు స్వల్ప జ్వరం, శ్వాస సమస్యలు, ఉదర సమస్యలు ఎదుర్కొంటారు. వయసులవారీగా చూస్తే లక్షణాలు చూపే పిల్లల సంఖ్య వయసు పెరిగేకొద్దీ పెరుగుతుంది’అని బృంద నివేదిక తెలిపింది.  

లక్షలో ఒక్కరు..
అధ్యయన వివరాలను అనువర్తిస్తే లక్షమంది పిల్లల్లో కేవలం 500 మంది మాత్రమే ఆస్పత్రి పాలయ్యారు. వీరిలో 2 శాతం మంది మాత్రమే మరణించడం జరిగింది. ‘లక్ష మంది పిల్లల్లో కోవిడ్‌ మరణాలు కేవలం ఒకటి రెండు మాత్రమే ఉన్నాయి’ అని బృందం సభ్యుడు డాక్టర్‌ సుశీల్‌ కాబ్రా చెప్పారు. ‘ గణాంకాల ప్రకారం చూస్తే కరోనా థర్డ్‌వేవ్‌ ప్రభావం పిల్లలపై చాలా ఎక్కువని కానీ, పిల్లలు తీవ్ర అనారోగ్యం పాలవుతారనేందుకు కానీ సరైన ఆధారాలేవీ లేవు. పెద్దలతో పోలిస్తే పిల్లల్లో వ్యాధి తీవ్రత తక్కువ, మరణాల రేటు కూడా తక్కువే’ అని వివరించారు. ఒబేసిటీ, ఆస్థమా, శ్వాస సమస్యలు, పెరుగుదల సమస్యలు, గుండె సమస్యలు, కాన్సర్, ఇమ్యునిటీ వ్యాధులు రిస్కు కారకాలని నివేదిక తెలిపింది. అలాగే తీవ్రత తక్కువని నిర్లక్ష్యం చేయకుండా, చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించి మౌలిక వసతులు పెంచడం, ఆక్సీజన్‌ సరఫరా అంతరాయం లేకుండా చూసుకోవడం, మందుల కొరత నివారించడం తదితర చర్యలు చేపట్టాలని ప్రభుత్వాలకు సూచించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

13-06-2021
Jun 13, 2021, 02:59 IST
ఒకటి పక్కన పన్నెండు సున్నాలు పెట్టి చూడండి!! వచ్చే అంకెను లక్ష కోట్లు అంటాం!  దీంతో పోలిస్తే... 1,400 అనే...
13-06-2021
Jun 13, 2021, 02:17 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 థర్డ్‌ వేవ్‌లో వైద్యపరంగా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది....
12-06-2021
Jun 12, 2021, 19:32 IST
కోవిడ్‌ వ్యాక్సిన్‌ రెండు డోసులూ వేసుకున్నాక కూడా ఇన్‌ఫెక్షన్‌ సోకితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు భరోసా...
12-06-2021
Jun 12, 2021, 17:12 IST
బ్రెసీలియా: బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారోపై సర్వత్రా విమర్షల దాడి కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆయన బ్రెజిల్‌లోని ఆగ్నేయ రాష్ట్రమైన...
12-06-2021
Jun 12, 2021, 14:09 IST
సాక్షి, సిటీబ్యూరో: ప్రజల ఆదాయం పెరగటంలేదు... కానీ పెరిగిన నిత్యావసరాల ధరలు మాత్రం పట్టపగలే చుక్కలను చూపిస్తున్నాయి. ఏం కొనేటట్టులేదు.....
12-06-2021
Jun 12, 2021, 12:36 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌-19 థర్డ్‌వేవ్‌ ముప్పు ఉందన్న మాట నిజమేనని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌  శనివారం పేర్కొన్నారు. కరోనా కేసులు...
12-06-2021
Jun 12, 2021, 11:57 IST
భారత్‌లో గుర్తించిన కరోనా డెల్టా వేరియంట్‌(బీ1. 617.2) ఇతర వేరియంట్లతో పోలిస్తే 60 శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని, వ్యాక్సిన్ల...
12-06-2021
Jun 12, 2021, 08:43 IST
మీర్‌పేట (హైదరాబాద్‌): టీకా తీసుకున్న కొన్ని నిమిషాలకే ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మీర్‌పేట రాఘవేంద్రనగర్‌ కాలనీలో చోటు...
12-06-2021
Jun 12, 2021, 08:30 IST
సాక్షి, ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఆమె కామాంధుల బాధితురాలన్న కనికరంలేదు.. ఆమెకు కరోనా సోకిందన్న దయ లేదు.. ఆమెను తండావాసులు నిర్దాక్షిణ్యంగా వెలివేశారు. చుట్టూ...
12-06-2021
Jun 12, 2021, 08:13 IST
పెద్ద సంఖ్యలో జనం వ్యాక్సినేషన్‌  సెంటర్లకు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ కేంద్రాల్లో కొన్ని కేటగిరీలవారికే వ్యాక్సిన్లు వేస్తుండటంతో జనం...
12-06-2021
Jun 12, 2021, 06:59 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా బారినపడిన కొందరిలో తీవ్రమైన లక్షణాలు కన్పిస్తున్నాయి ఎందుకు? ఈ ప్రశ్నకు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం సమాధానం...
12-06-2021
Jun 12, 2021, 05:20 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చురుగ్గా సాగుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌...
12-06-2021
Jun 12, 2021, 05:17 IST
ఆపద కాలం ఉంటుంది. కానీ ఆదుకోలేని కాలం ఒకటి ఉంటుందని మొదటిసారిగా చూస్తున్నాం. ఒక కోడలు.. అపస్మారక స్థితిలో ఉన్న...
12-06-2021
Jun 12, 2021, 04:43 IST
కార్బిస్‌బే: కరోనా మహమ్మారిపై ఉమ్మడి పోరాటం, సంపూర్ణ వ్యాక్సినేషనే లక్ష్యంగా గ్రూప్‌ ఆఫ్‌ సెవెన్‌(జీ7) దేశాల మూడు రోజుల శిఖరాగ్ర...
12-06-2021
Jun 12, 2021, 04:30 IST
కరోనా పుట్టుక.. బ్యాడ్‌ బ్యాట్స్‌.. అందరి దృష్టి గబ్బిలాల మీదే ఎందుకంటే!
12-06-2021
Jun 12, 2021, 03:54 IST
సాక్షి, అమరావతి: ఎక్కువ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడంతోపాటు వేగంగా ఫలితాలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 19 చోట్ల...
11-06-2021
Jun 11, 2021, 18:55 IST
సాక్షి,అమరావతి: ఆందధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గాయి.. యాక్టీవ్ కేసుల సంఖ్య లక్ష లోపునకు చేరింది. ప్రస్తుతం ఏపీలో 96,100 యాక్టీవ్...
11-06-2021
Jun 11, 2021, 17:54 IST
సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 1,01,863 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 8,239 మందికి కరోనా పాజిటివ్‌గా...
11-06-2021
Jun 11, 2021, 14:48 IST
సినీనటి, దర్శకురాలు ఆయేషా సుల్తానాపై దేశద్రోహం కేసు నమోదైంది. కరోనా వైరస్‌ గురించి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినందుకుగానూ ఆమె మీద ఈ కేసు...
11-06-2021
Jun 11, 2021, 11:03 IST
సాక్షి, విజయవాడ: రాష్ట్రం‍లో కరోనా ఉదృతి కొనసాగుతున్న నేపథ్యంలో మరో పదిరోజుల పాటు కర్ఫ్యూ పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top