మీరు గ్రేట్‌! పెళ్లి దుస్తుల్లో రక్తదానం

Newly Married Couple Donated Blood On Wedding Day In UP - Sakshi

లక్నో : ప్రాణాపాయంలో ఉన్న ఓ యువతికి రక్త దానం చేసి ప్రాణం నిలిపింది కొత్తగా పెళ్లైన ఓ జంట. పెళ్లి బట్టల్లో రక్తదానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచింది. వివరాలు.. కొద్దిరోజుల క్రితం ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ యువతికి ఆపరేషన్‌ చేయటానికి రక్తం అత్యవసరమైంది. దీంతో పోలీస్‌ మిత్ర ద్వారా రక్తదానం చేసే వారి కోసం అన్వేషించారు. అయితే ఎవ్వరూ రక్తం ఇ‍వ్వటానికి ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో యువతికి రక్తం అవసరమన్న సంగతి తెలుసుకున్న ఓ వధూవరుల జంట రక్తం ఇవ్వటానికి ముందుకు వచ్చింది. ( భార్యకు వాలెంటైన్స్‌ డే గిఫ్ట్‌గా ఓ ప్రాణం)

పెళ్లి బట్టలతో ఆసుపత్రికి వెళ్లి రక్త దానం చేసి యువతి ప్రాణాలు కాపాడింది. ఈ విషయాన్ని పోలీస్ ఉన్నతాధికారి‌ ఆశిష్‌ మిశ్రా తన ట్విటర్‌ ఖాతా వేదికగా వెల్లడించారు. వధూవరుల జంటపై ప్రశంసలు కురిపించారు. దీంతో ఈ ట్వీట్‌ కాస్తా వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు కూడా వారిద్దరిపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. ( వైరల్‌: టైటానిక్‌ మరో క్లైమాక్స్ సీన్‌‌ వీడియో )

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top