కోవిడ్‌ పుట్టుక ప్రకృతిసిద్ధమే! 

New Evidence Shows Covid-19 Evolved Naturally: Lancet Report - Sakshi

ల్యాబ్‌ లీకేజ్‌ వాదనకు ఆధారాల్లేవు 

లాన్సెట్‌ నివేదికలో సైంటిస్టుల అభిప్రాయం 

న్యూఢిల్లీ: కరోనా ఎలా వచ్చిందో, దేని ద్వారా వచ్చిందోననే అంశంపై భిన్నవాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. చాలామంది ఈ వైరస్‌ చైనాలోని ఒక ల్యాబ్‌లో ఉత్పన్నమైందని భావిస్తున్నా, ఈ వాదనకు తగ్గ శాస్త్రీయ ఆధారాలు దొరకలేదు. అయితే ఈ వైరస్‌ ప్రకృతిలోనే సహజంగా ఉద్భవించిందని ద లాన్సెట్‌ జర్నల్‌లో కొందరు శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పలువురు బయాలజిస్టులు, వైరాలజిస్టులు, డాక్టర్లు, ఎకాలజిస్టులు ఈ అధ్యయనంలో పాలుపంచుకున్నారు.

తాజాగా జరిపిన పరిశోధనల్లో వైరస్‌ ప్రకృతిసిద్ధంగా ఉత్పన్నమైందనేందుకు బలమైన సాక్ష్యాలు లభించాయని అధ్యయనం తెలిపింది. అంతేకాకుండా ఈ వైరస్‌ ల్యాబ్‌ నుంచి వచ్చిందనేందుకు ఎలాంటి సైంటిఫిక్‌ సాక్ష్యాలు లేవని గుర్తు చేసింది. గతేడాది లాన్సెట్‌ ప్రచురించిన నివేదికలో సైతం ఈ బృందం ల్యాబ్‌ లీకేజీ వాదనలను తోసిపుచ్చింది.

పరిశోధన అవసరం: ల్యాబ్‌ లీకేజ్‌పై ఆరోపణలతో ఎలాంటి ప్రయోజనం లేదని, గబ్బిలాల నుంచి మనిషికి వైరస్‌ సోకిన విధానంపై పరిశోధన ద్వారానే తదుపరి ప్రమాదాలు నివారించగలమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో వాదోపవాదాలను పక్కనబెట్టి శాస్త్రీయ పరిశోధనా మార్గాన్ని అనుసరించినప్పుడే భవిష్యత్‌ మహమ్మారులను ఎదుర్కోగలమని తెలిపారు. వైరస్‌ పుట్టుకపై శాస్త్రీయ పరిశోధన కోసం డబ్లు్యహెచ్‌ఓ, ఇతర సంస్థలు చైనా నిపుణులతో కలిసి లోతైన పరిశోధన సాగించాలని సూచించారు.  ఈ విషయమై స్పష్టమైన వివరాలు తెలియడానికి సంవత్సరాలు పట్టవచ్చని, కానీ ప్రపంచ శాస్త్రీయ సమాజం తప్పక ఈపని చేయాలని తెలిపారు. అధ్యయనంలో బోస్టన్‌ యూనివర్సిటీ, మేరీలాండ్‌ యూనివర్సిటీ, గ్లాస్గోవ్‌ యూనివర్సిటీ, ద వెల్‌కమ్‌ ట్రస్ట్, క్వీన్స్‌లాండ్‌ యూనివర్సిటీతో పాటు పలు సంస్థలకు చెందిన సైంటిస్టులు పాల్గొన్నారు.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

07-07-2021
Jul 07, 2021, 07:30 IST
టోక్యో: విశ్వ క్రీడలంటేనే ప్రతిష్టాత్మకం. అలాంటే మేటి ఒలింపిక్స్‌ క్రీడలను ఔత్సాహిక ప్రేక్షకులు ప్రత్యక్షంగా చూసేందుకు ఎగబడతారు. నెలల ముందే...
07-07-2021
Jul 07, 2021, 07:28 IST
కర్ణాటకలో 725 డెల్టా, 2 రెండు డెల్టాప్లస్‌ కేసులు
07-07-2021
Jul 07, 2021, 07:02 IST
లండన్‌: శ్రీలంకను పరిమిత ఓవర్ల సిరీస్‌లలో ఊదేసిన ఇంగ్లండ్‌ జట్టును కరోనా వైరస్‌ చుట్టుముట్టింది. ముగ్గురు ఆటగాళ్లతో పాటు నలుగురు...
07-07-2021
Jul 07, 2021, 04:41 IST
‘దేవుడి దయవల్ల కరోనా తగ్గుముఖం పడుతోంది. కోవిడ్‌ నియంత్రణలో కలెక్టర్లు అద్భుతంగా పనిచేశారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు.. అందులో భాగస్వాములైన...
07-07-2021
Jul 07, 2021, 04:04 IST
సాక్షి, అమరావతి: కరోనా మరణాల నియంత్రణలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో ముందంజలో కొనసాగుతోంది. దేశంలో చాలా రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌.. మరణాల...
07-07-2021
Jul 07, 2021, 01:25 IST
బోస్టన్‌: కొత్తగా పుట్టుకొస్తున్న కరోనా వైరస్‌ వేరియంట్లను దీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన టీకాల కోసం శాస్త్రవేత్తలు కొత్త చిట్కాను కనిపెట్టారు....
06-07-2021
Jul 06, 2021, 18:56 IST
లండన్‌: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల తీవ్రత తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో బ్రిటన్‌ ప్రభుత్వం వ్యక్తిగత బాధ్యతను గుర్తు చేస్తూ.....
06-07-2021
Jul 06, 2021, 03:43 IST
సెప్టెంబర్‌ నెల మధ్య నాటికే కరోనా మూడో వేవ్‌ పతాక స్థాయికి చేరొచ్చని ఎస్‌బీఐ రీసెర్చ్‌ అంచనా వేసింది. ప్రపంచవ్యాప్త...
06-07-2021
Jul 06, 2021, 00:40 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌లో తీవ్రంగా ప్రభావితమైన దేశ రాజధాని ఢిల్లీలో నెల రోజులుగా పరిస్థితులు కాస్త...
05-07-2021
Jul 05, 2021, 20:49 IST
సాక్షి, అమరావతి: కరోనా సోకిన ఉద్యోగులకు 20 రోజుల సెలవు మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది....
04-07-2021
Jul 04, 2021, 08:12 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో పంపిణీ చేసిన వ్యాక్సిన్‌ డోస్‌ల సంఖ్య 34.46 కోట్లు దాటింది. శనివారం...
04-07-2021
Jul 04, 2021, 00:02 IST
కరోనా నిర్ధారణ కోసం ఓ పుల్లలాంటి పరికరంతో ముక్కులోంచి స్వాబ్‌ సేకరించి, దాని సహాయంతో కరోనా ఉందని తెలుసుకోవడం జరుగుతుంది....
03-07-2021
Jul 03, 2021, 19:20 IST
కోల్‌కతా: నర్సు పక్కన ఉండగానే తృణముల్‌ పార్టీకి చెందిన కౌన్సిలర్‌ వ్యాక్సిన్‌ వేసిన ఘటన వివాదాస్పదంగా మారింది. ఈ ఘటన కోల్‌కతాకు...
03-07-2021
Jul 03, 2021, 14:54 IST
సాక్షి బెంగళూరు: రాష్ట్రంపై పంజా విసిరిన కరోనా మహమ్మారి నెమ్మదిస్తోంది. కేసులు, మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టగా డిశ్చార్జ్‌ల సంఖ్య...
03-07-2021
Jul 03, 2021, 14:31 IST
సంక్షోభంలో హోటల్‌ రంగం
03-07-2021
Jul 03, 2021, 10:13 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా కేసులు తగ్గడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు సాధారణ వైద్య సేవలు, శస్త్ర చికిత్సలు ప్రారంభిస్తున్నాయి. సెకండ్‌...
03-07-2021
Jul 03, 2021, 09:21 IST
డెల్టా వేరియంట్ విషయంలో ఇది 65.2 శాతం సామర్థ్యంతో పని చేస్తుంది
03-07-2021
Jul 03, 2021, 08:33 IST
సాక్షి, హైదరాబాద్‌: కోవాగ్జిన్, కోవీషీల్డ్‌ వ్యాక్సిన్‌లకు సంబంధించిన ఇండెంట్‌ సమాచారం తమ వద్ద లేదని కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ...
02-07-2021
Jul 02, 2021, 19:01 IST
లక్నో: అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం మరిన్ని నిబంధనలు సడలించింది. సినిమా హాళ్లు, మల్టీపెక్సులు, క్రీడా మైదానాలు, జిమ్‌లు...
02-07-2021
Jul 02, 2021, 17:54 IST
సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో కోవిడ్‌ కేసుల సంఖ్య తగ్గినప్పటికీ స్థిరంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 3,203 కరోనా...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top