ఐడీ ప్రూఫ్‌ లేకుండా రూ.2000 నోటు మార్పిడి.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం!

New Delhi: Hc Dismisses Pil Against Allowing Exchange Of Rs 2000 Note Without Id - Sakshi

న్యూఢిల్లీ: రూ. 2 వేల నోట్ల మార్పిడికి ఐడీ ప్రూఫ్‌ తప్పనిసరా కాదా అనే అంశంపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఎలాంటి రిక్విజిషన్ స్లిప్, ఐడీ ప్రూఫ్‌ లేకుండా రూ. 2,000 నోట్లను మార్చుకోవడానికి హైకోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్‌లను సవాలు చేస్తూ దాఖలైన పిల్‌ను ధర్మాసనం కొట్టివేసింది. 

నోట్ల రద్దు అనంతరం.. ఎలాంటి గుర్తింపు కార్డు అవసరం లేకుండానే 2,000 రూపాయల నోట్ల మార్చుకోవచ్చని ఆర్‌బీఐ తెలిపింది. ఇదే దారిలో ఎస్‌బీఐ కూడా నడిచింది. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ నేత, న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఆర్బీఐ, ఎస్‌బీఐ నోటిఫికేషన్లు ఏకపక్షంగా, అహేతుకంగా ఉన్నాయని, రాజ్యాంగంలోని 14వ అధికరణను ఉల్లంఘించేలా ఉందని అందులో పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరారు.

ఆర్‌బీఐ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రూ.2,000 నోట్లను ఉపసంహరించుకోవడం నోట్ల రద్దు కాదని, చట్టబద్ధమైన చర్య అని ఆయన వాదించారు. చివరికి ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. ఎలాంటి ఐడీ ప్రూఫ్ లేకపోయినా రెండు వేల రూపాయల నోట్లు మార్చుకోవచ్చని తీర్పు వెలువరించింది.

చదవండి: కరెంట్‌ బిల్లులు చెల్లించకపోతే నెక్స్ట్‌ జరిగేది ఇదే: విద్యుత్‌ శాఖ వార్నింగ్‌!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top